ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లోని ఝంఝునూ లో ట్రాక్టర్ దుర్ఘటన కారణం గాప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు



प्रविष्टि तिथि: 29 MAY 2023 11:10PM by PIB Hyderabad

రాజస్థాన్ లోని ఝుంఝునూ లో జరిగిన ట్రాక్టర్ దుర్ఘటన కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని బాధితుల కు ఇవ్వడం జరుగుతుందని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘రాజస్థాన్ లోని ఝుంఝునూ లో జరిగిన ట్రాక్టర్ దుర్ఘటన ను గురించి తెలిసి బాధ పడుతున్నాను. ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు కావాలని కోరుకొంటున్నాను. మృతుల దగ్గరి బంధువుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలియ జేసింది.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1928350) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam