ప్రధాన మంత్రి కార్యాలయం

కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ ప్రతిష్టాపన కు ముందు అధీనం స్వాముల ఆశీస్సులు అందుకున్న ప్రధాన మంత్రి


"తమిళనాడు భారత జాతీయవాదానికి కంచుకోట"

"అధీనం ,రాజాజీ మార్గదర్శకత్వంలో మనం మన పవిత్ర పురాతన తమిళ సంస్కృతి నుండి ఒక ఆశీర్వాద మార్గాన్ని కనుగొన్నాము - సెంగోల్ మాధ్యమం ద్వారా అధికార బదిలీ మార్గం"

"1947లో తిరువడుదురై అధీనం ఒక ప్రత్యేక సెంగోల్ ను సృష్టించారు. నేడు, ఆ శకానికి చెందిన చిత్రాలు తమిళ సంస్కృతి - ఆధునిక ప్రజాస్వామ్యంగా భారతదేశ భవితవ్యం మధ్య లోతైన భావోద్వేగ బంధాన్ని గుర్తు చేస్తున్నాయి.‘‘

"వందల సంవత్సరాల బానిసత్వ ప్రతి చిహ్నం నుండి భారతదేశానికి విముక్తి కలిగించడానికి అధీనం సెంగోల్ ఆరంభం"

"బానిసత్వానికి ముందు ఉన్న జాతి శకానికి స్వేచ్చా భారతదేశాన్ని కలపింది సెంగోలు"

‘ప్రజాస్వామ్య దేవాలయంలో సెంగోల్ కు సముచిత స్థానం లభిస్తోంది‘

Posted On: 27 MAY 2023 10:07PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ ప్రతిష్టకు ముందు అధీనమ్ స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అధీనమ్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, వారు స్వయంగా ప్రధాని నివాసానికి రావడం గొప్ప అదృష్టమని అన్నారు. పరమశివుని ఆశీస్సుల వల్లే తాను ఆయన శిష్యులందరితో ఒకేసారి సంభాషించగలిగానని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అదీనాలు హాజరై ఆశీస్సులు అందించనుండడం సంతోషదాయకం అని ప్రధాని అన్నారు.

 

స్వాతంత్ర పోరాటంలో తమిళనాడు పాత్రను ప్రధాని ప్రస్తావించారు. భారత జాతీయతకు తమిళనాడు కంచుకోట అని ఆయన అన్నారు. తమిళ ప్రజలకు ఎల్లప్పుడూ భారతి మాత సేవా, సంక్షేమ స్ఫూర్తి ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి సంవత్సరాల్లో తమిళులకు తగిన గుర్తింపు లభించలేదని శ్రీ మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశానికి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.

 

స్వాతంత్రం వచ్చిన సమయంలో అధికార బదలాయింపు చిహ్నానికి సంబంధించి ప్రశ్నలు తలెత్తాయని, ఈ విషయంలో భిన్న సంప్రదాయాలు ఉన్నాయని ప్రధాని గుర్తు చేశారు. "ఆ సమయంలో, అధీనం , రాజా జీ మార్గదర్శకత్వంలో మనం మన పవిత్ర పురాతన తమిళ సంస్కృతి నుండి ఒక ఆశీర్వాద మార్గాన్ని కనుగొన్నాము - అదే సెంగోల్ మాధ్యమం ద్వారా అధికార బదిలీ మార్గం", అని ఆయన అన్నారు.

దేశ సంక్షేమం పట్ల ఒక వ్యక్తి తన బాధ్యతను, విధినిర్వహణ మార్గం నుంచి ఎన్నటికీ వెనుకడుగు వేయబోననే సంకల్పాన్ని సెంగోల్ గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఆ సమయంలో 1947లో తిరువడుత్తురై అధీనం ఒక ప్రత్యేక సెంగోల్ ను సృష్టించింది. ఈ రోజు, ఆ శకానికి చెందిన చిత్రాలు తమిళ సంస్కృతికి - ఆధునిక ప్రజాస్వామ్యంగా భారతదేశ భవితవ్యానికి మధ్య లోతైన భావోద్వేగ బంధాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ ఈ ప్రగాఢమైన బంధం  ఈ రోజు చరిత్ర పుటల నుండి సజీవంగా వచ్చింది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇది ఆనాటి సంఘటనలను సరైన కోణం తో  చూడటానికి ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఈ పవిత్ర చిహ్నాన్ని ఎలా గౌరవించారో కూడా తెలుసుకుంటామని చెప్పారు. రాజాజీ, ఇతర అధీనాల దూరదృష్టికి ప్రధాని ప్రత్యేకంగా నమస్కరించి, వందల సంవత్సరాల బానిసత్వ ప్రతి చిహ్నం నుండి స్వేచ్ఛకు నాంది పలికిన సెంగోల్ ప్రాముఖ్యత గురించి తెలియచేశారు.

బానిసత్వానికి పూర్వం ఉన్న దేశ కాలానికి స్వతంత్ర భారతదేశాన్ని కలిపేది సెంగోల్ అని, 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అధికార బదిలీని ఇది సూచిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.

సెంగోల్ మరో ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది భారతదేశ గత సుసంపన్న సంవత్సరాలను , సంప్రదాయాలను స్వతంత్ర భారతదేశ భవిష్యత్తుతో అనుసంధానించిందని ప్రధాన మంత్రి అన్నారు. పవిత్ర సెంగోల్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదని, దాన్ని ప్రయాగ్ రాజ్ లోని ఆనంద్ భవన్ లో వాకింగ్ స్టిక్ గా ప్రదర్శించారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంద్ భవన్ నుంచి సెంగోల్ ను బయటకు తీసుకొచ్చింది ప్రస్తుత ప్రభుత్వమే. దీనితో, కొత్త పార్లమెంటు భవనంలో సెంగోల్ స్థాపన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మొదటి క్షణాన్ని పునరుద్ధరించే అవకాశం మనకు లభించిందని ప్రధాన మంత్రి అన్నారు. "ప్రజాస్వామ్య దేవాలయంలో సెంగోల్ కు సముచిత స్థానం లభిస్తోంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశపు గొప్ప సంప్రదాయాల చిహ్నమైన సెంగోల్ ను కొత్త పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకం అని అన్నారు. ‘‘నిరంతరం కర్తవ్య మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సెంగోల్ మనకు గుర్తు చేస్తుం ది‘‘ అని ఆయన తెలిపారు. 

 

‘అధీనం గొప్ప స్ఫూర్తిదాయక సంప్రదాయం సజీవ పుణ్యశక్తికి చిహ్నం‘ అని ప్రధాన మంత్రి అన్నారు. వారి శైవ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, వారి తత్వశాస్త్రంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రధాన మంత్రి కొనియాడారు.

ఈ పవిత్రమైన పేర్లలో కొన్ని హిమాలయాలలో ఉన్నప్పటికీ వారి హృదయాలకు సమీపంలో ఉన్న పవిత్ర పర్వతమైన కైలాసాన్ని సూచిస్తున్నందున చాలా మంది అధీనాల పేర్లు ఈ స్ఫూర్తిని తెలియజేస్తాయని ఆయన అన్నారు.

మహా శైవ సాధువు తిరుములార్ శివభక్తిని వ్యాప్తి చేయడానికి కైలాసం నుండి వచ్చాడని చెబుతారు. అదేవిధంగా ఉజ్జయిని, కేదార్ నాథ్, గౌరీకుండ్ లను భక్తిశ్రద్ధలతో ప్రస్తావించిన తమిళనాడుకు చెందిన ఎందరో మహానుభావులను ప్రధాని స్మరించుకున్నారు.

 

వారణాసి పార్లమెంటు సభ్యునిగా, తమిళనాడు నుండి కాశీ వెళ్ళి బెనారస్ లోని కేదార్ ఘాట్ వద్ద కేదారేశ్వర ఆలయాన్ని స్థాపించిన ధర్మపురం అధీనంకు చెందిన స్వామి కుమారగురుపర గురించి ప్రధాన మంత్రి తెలియజేశారు. తమిళనాడులోని తిరుప్పనందల్ లోని కాశీ మఠానికి కూడా కాశీ పేరు పెట్టారని తెలిపారు. ఈ మఠం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరుప్పనందల్ లోని కాశీ మఠం యాత్రికులకు బ్యాంకింగ్ సేవలను అందించేదని, తమిళనాడులోని కాశీ మఠంలో డబ్బు డిపాజిట్ చేసి, కాశీలో ధృవీకరణ పత్రాన్ని చూపించి విత్ డ్రా చేసుకోవచ్చని ప్రధాన మంత్రి తెలియజేశారు. "ఈ విధంగా శైవ సిద్ధాంత అనుయాయులు శివభక్తిని వ్యాప్తి చేయడమే కాకుండా, మనలను ఒకరికొకరు దగ్గర చేసే పనిని కూడా చేశారు" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు. వందల సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా తమిళ సంస్కృతిని చైతన్యవంతంగా ఉంచడంలో అధీనం వంటి గొప్ప సంప్రదాయం పాత్రను ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. దాన్ని పెంచి పోషించిన ఘనత దోపిడీ కి గురైన , అణగారిన వర్గాల ప్రజానీకానిదే అని అన్నారు.

'దేశానికి చేసిన సేవల విషయంలో మీ సంస్థలన్నింటికీ ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి , రాబోయే తరాల కోసం పనిచేయడానికి ప్రేరణ పొందడానికి ఇది సరైన సమయం" అని ప్రధాన మంత్రి తన పేర్కొన్నారు.

 

వచ్చే 25 సంవత్సరాల కోసం నిర్ధేశించిన

లక్ష్యాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, వందవ స్వాతంత్ర దినోత్సవం నాటికి బలమైన, స్వావలంబన, సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించాలన్నది సంకల్పమని

అన్నారు. దేశం 2047 లక్ష్యాలతో ముందుకు సాగుతున్నప్పుడు అధీనం లది చాలా ముఖ్యమైన పాత్ర అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. లక్షలాది మంది దేశప్రజలు 1947లో అధీనం పాత్రతో తిరిగి పరిచయం అయ్యారని ఆయన అన్నారు. 'మీ సంస్థలు ఎల్లప్పుడూ సేవా విలువలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఒకరితో ఒకరు అనుసంధానం కావడానికి, వారిలో సమానత్వ భావనను సృష్టించడానికి మీరు ఒక గొప్ప ఉదాహరణను అందించారు", అని ఆయన అన్నారు.

 

ప్రసంగాన్ని ముగిస్తూ,  భారతదేశ బలం దాని ఐక్యతపై ఆధారపడి ఉందని ప్రధాన మంత్రి  స్పష్టం చేశారు. దేశ ప్రగతికి అడ్డంకులు సృష్టించి వివిధ సవాళ్లు విసురుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

భారత దేశ పురోగతికి ఆటంకం కలిగించే వారు మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ సంస్థల నుండి దేశానికి లభిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక బలంతో ప్రతి సవాలును ఎదుర్కొంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను", అని విశ్వాసం వెలిబుచ్చారు.

 

***

 



(Release ID: 1927821) Visitor Counter : 198