మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మహిళా విద్యార్థులు / స్కాలర్లు / సామాజిక కార్యకర్తలు / ఉపాధ్యాయుల కోసం ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించిన మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

Posted On: 26 MAY 2023 2:31PM by PIB Hyderabad

మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రెండు నెలల వ్యవధి [03.07.2023 -31.08.2023] ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం భారతదేశంలోని నాన్-టైర్ I నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన  మహిళా విద్యార్థులు/పండితులు/ సామాజిక కార్యకర్తలు/ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ/అకడమిక్/నాన్-అకడమిక్ ఇన్‌స్టిట్యూషన్‌లో నమోదు చేసుకోవాలి/అసోసియేట్ అయి ఉండాలి.

ఈ కార్యక్రమం మహిళా విద్యార్థులు/పండితులు/సామాజిక కార్యకర్తలు/ఉపాధ్యాయులకు  (ఇకపై 'ఇంటర్న్‌లు' అని పిలుస్తారు)  మంత్రిత్వ శాఖ  విధానాలు, అమలు చేస్తున్న  కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం రూపొందింది.   ఇంటర్న్‌లు మంత్రిత్వ శాఖ  కార్యకలాపాలపై దృష్టి సారించి పైలట్ ప్రాజెక్ట్‌లు/సూక్ష్మ-అధ్యయనాలను చేపట్టవలసి ఉంటుంది. భవిష్యత్తులో మహిళలు, పిల్లల సమస్యలను వివిధ వేదికల ద్వారా   లేవనెత్తి పరిష్కార మార్గాలు కనుగొనేలా చూసేందుకు కార్యక్రమం రూపొందింది.మంత్రిత్వ శాఖ లక్ష్యాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించి విశ్లేషణ జరిపేలా ప్రోత్సాహం అందుతుంది.  

21-40 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు తమ దరఖాస్తును Google ఫారమ్‌ల ద్వారా పంపవచ్చు.

(https://docs.google.com/forms/d/1UWK5W_07pRxL8yekBy6DbjAg2-25Vd_WJwfnc4nReTU/viewform?edit_requested=true).

 

20.05.2023, 00:00 గంటల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.   దరఖాస్తులను  29.05.2023, 23:59 గంటల లోగా సమర్పించాల్సి ఉంటుంది. సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇంటర్న్‌ల ఎంపిక జరుగుతుంది.  సిఫార్సు చేసిన అభ్యర్థుల జాబితా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో 'కొత్తగా ఏమిటి' కింద అందుబాటులో ఉంటుంది. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఒకసారి ఎంపికైన అభ్యర్థి, మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.

 

ఎంపికైన ఇంటర్న్‌లకు ఏక మొత్తంలో నెలకు రూ.20,000/- స్టైఫండ్ అందుతుంది.  మంత్రిత్వ శాఖ నిర్వహించే కార్యక్రమంలో చేరడానికి, కార్యక్రమం ముగిసిన తర్వాత   తిరిగి రావడానికి ప్రయాణ ఖర్చు (డీలక్స్ / ఎసి బస్సు / 3 టైర్ ఎసి రైలు ద్వారా) తిరిగి చెల్లిస్తారు.  ఇంటర్న్‌లకు ఢిల్లీలో కార్యక్రమం జరిగే కాలంలో   షేరింగ్ ప్రాతిపదికన హాస్టల్ సౌకర్యాలు అందిస్తారు.ముగ్గురు కలిసి ఉండేలా అనువుగా ఉండే గదిని  అటాచ్డ్ బాత్రూమ్ (మంచం కాకుండా), టేబుల్, కుర్చీ  అల్మారాతో కూడిన ప్రతి గదిలో ప్రాథమిక సౌకర్యాలు కల్పించి అందిస్తారు. .మెస్ ఛార్జీలు వసతి లో భాగంగా ఉండవు హాస్టల్ సౌకర్యాన్ని పొందుతున్న ఇంటర్న్  మెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

హాస్టల్ సౌకర్యం ప్రోగ్రామ్ ప్రారంభానికి 2 రోజుల ముందు నుండి ప్రోగ్రామ్ ముగిసిన 2 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది (ఉదా., జూలై 3న ప్రారంభమయ్యే ఇంటర్న్‌షిప్ బ్యాచ్‌కి, హాస్టల్ సౌకర్యం 1 జూలై 2023 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటుంది. లేదా 2 సెప్టెంబర్ 2023). ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఇంటర్న్‌లకు సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు. 

ఇంటర్న్‌షిప్ కార్యక్రమం  వివరణాత్మక మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ https://wcd.nic.in/schemes/internship-schemeలో చూడవచ్చు

 మరిన్ని వివరాలు/ సందేహాల కోసం అభ్యర్థులు అన్ని పని దినాలలో ఉదయం 10 నుంచి సాయంకాలం 5  మధ్య ID <mwcd-research[at]gov[dot]in>లో ఇమెయిల్ ద్వారా స్టాటిస్టిక్స్ బ్యూరో ని సంప్రదించవచ్చు.

ఫారమ్‌తో పాటు వివరణాత్మక నోటిఫికేషన్‌ను మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌

(https://wcd.nic.in/sites/default/files/Internship%20Advertisment%20July-Aug.pdf) లో చూడవచ్చు.

***

 



(Release ID: 1927623) Visitor Counter : 102