ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి

Posted On: 23 MAY 2023 6:40PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.

 

విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులు మరియు వ్యాపార రంగ ప్రతినిధుల తో కూడిన భారతీయ ప్రవాసి సముదాయం ఈ కార్యక్రమం లో గొప్ప ఉత్సాహం తో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా కు చెందిన మంత్రులు పలువురు, పార్లమెంటు సభ్యులు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రులు ఇద్దరు కలసి భారతదేశ సముదాయం సభ్యులు పెద్ద సంఖ్య లో నివసిస్తున్న పశ్చిమ సిడ్ నీ పర్రామట్టా ప్రాంతం లో గల హేరిస్ పార్కు లో నిర్మాణం జరుగనున్న ‘లిటిల్ ఇండియా’ గేట్ వే కు శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించాచారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగం లో, భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య నెలకొన్న సన్నిహిత చారిత్రిక సంబంధాల కు ‘‘పరస్పర విశ్వాసం మరియు పరస్పర సమ్మానం’’ పునాది గా ఉన్నాయన్నారు. ఉభయ దేశాల ను ఒక బంధం లో పెనవేస్తున్న వివిధ అంశాల ను గురించి ఆయన ఈ సందర్భం లో నొక్కి పలికారు. ఆస్ట్రేలియా లో ఉంటున్న భారతదేశ సముదాయం సభ్యుల తోడ్పాటు మరియు సాఫల్యాల ను ఆయన కొనియాడుతూ, వారిని భారతదేశం యొక్క సాంస్కృతిక బ్రాండ్ అంబాసిడర్ లు గా వర్ణించారు.

 

ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క కార్యసాధన లు అంతకంతకు పెరుగుతూ ఉండడాన్ని ప్రధాన మంత్రి పేర్కొని, భారతదేశం యొక్క సాఫల్య గాథ ల పట్ల ప్రపంచం ఎడతెగని కుతూహలాన్ని కనబరుస్తోందన్నారు. భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య బంధం గాఢతరం గా మారుతున్న విషయాన్ని ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, బ్రిస్బేన్ లో ఒక భారతదేశ వాణిజ్య దూత కార్యాలయాన్ని తెరవడం జరుగుతుందని తెలిపారు.

 

***


(Release ID: 1926889) Visitor Counter : 138