ప్రధాన మంత్రి కార్యాలయం

–ఒడిషాలో మే 18న రూ 8000 కోట్ల రూపాయల విలువగల పలు రైల్వే ప్రాజెక్టులకు శంకు స్థాపన చేసి జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.


–పూరీ –హౌరా మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి,

– ఒడిషాలో 100 శాతం రైలు నెట్వర్క్ విద్యుదీకరణను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి.

– పూరీ , కటక్ ర ఐల్వే ష్టేషన్ల పునర్ అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేయనున్న ప్రధానమంత్రి.

Posted On: 17 MAY 2023 5:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రూ 8000 కోట్ల రూపాయలకు పైగా విలువగల   పలు రైల్వే ప్రాజెక్టులకు
శంకుస్థాపనలు ,జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని  2023 మే 18 వతదీ మధ్యాహ్నం సుమారు
 12.30 గంటల  సమయంలో  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి పూరీ,హౌరా లమధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును జండా ఊపి ప్రారంభించనున్నారు.  ఈ రైలు ఒడిషా లో  ఖోర్ధా,కటక్, జైపూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాలమీదుగా ,పశ్చిమబెంగాల్లోని పశ్చిమ మిడ్నపూర్
పూర్వ మిడ్నపూర్ జిల్లాల మీదుగా వెళుతుంది. ఈ రైలు వేగంగా వెళ్లడమే కాక సౌకర్యవంత ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. దీనితో ఈ ప్రాంతంలో పర్యాటకం వృద్ధిచెందడమే కాక,  ఇది ఈ ప్రాంత ఆర్ధికాభివృద్ధిని పెంపొందిస్తుంది.

ప్రధానమంత్రి పూరి, కటక్ రైల్వే స్టేషన్ల పునర్ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. ఈ పునర్ అభివృద్ధి జరిగే రైల్వే స్టేషన్లలో అధునాతన సదుపాయాలు కల్పించడంతోపాటు,
రైల్వే ప్రయాణికులకు ప్రపంచశ్రేణి సదుపాయాలు అందుబాటులోకి తేనున్నారు. ప్రధానమంత్రి ఒడిషాలో 100 శాతం  పూర్తయిన రైల్వే నెట్ వర్క్ విద్యుదీకరణ ను జాతికి అంకితం చేస్తారు.
 ఇది ఆపరేటింగ్ , మెయింటినెన్స్ ఖర్చులను  క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది.


ప్రధానమంత్రి, సంబల్ పూర్– టిట్లఘర్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులను కూడా జాతికి అంకితం చేయనన్నారు. అంగుల్– సుకిందా మధ్య కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ను, మనోహర్పూర్– రూర్కేలా– ఝార్స్గూడ– జామ్గ లను కలుపుతూ మూడవ లైను, బీచుపల్లి,
జార్తర్ భా లమధ్య కొత్త బ్రాడ్గేజ్ లైన్ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.
ఇవి పెరిగిన ట్రాఫిక్ డిమాండ్ అవసరాలను తీరుస్తాయి. ఫలితంగా ఒడిషాలో  స్టీలు, విద్యుత్, మైనింగ్ రంగాలలో
సత్వర పారిశ్రామికాభివృద్ధికి వీలు కలిగిస్తుంది.అలాగే ఈ రైల్వే సెక్షన్లలో ప్రయాణికుల ట్రాఫిక్కు సంబంధించి ఒత్తిడిని తగ్గిస్తుంది.

 

***



(Release ID: 1925104) Visitor Counter : 132