సహకార మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి" దార్శనికతను సాకారం చేయడానికి, కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా కృషితో, సహకార రంగంలో 1100 న్యూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ పి ఒ) ఏర్పాటుకు నిర్ణయం
ఎఫ్ పి ఒ ల పథకం కింద నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ సీ డీ సీ) కు ఈ అదనపు 1100
ఎఫ్ పి ఒ ల కేటాయింపు
ఎఫ్ పి ఒ పథకం కింద, ప్రతి ఎఫ్ పి ఒ కు రూ. 33 లక్షల ఆర్థిక సహాయం; ప్రతి ఎఫ్ పి ఒ ద్వారా క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థ (సి బి బి ఒ) లకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం
పి ఎ సి ఎస్ లు ప్రధానంగా స్వల్పకాలిక రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిమగ్నమై ఉండగా, ఇప్పుడు తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం వంటి అధిక ఆదాయాన్ని ఆర్జించే కార్యకలాపాలతో సహా ఇతర ఆర్థిక కార్యకలాపాలను చేపట్టగలవు.
ఈ చొరవ రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారిస్తుంది; ఇది పిఎసిఎస్ ఆర్థిక కార్యకలాపాలలో వైవిధ్యానికి దారితీస్తుంది; కొత్త, స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది.
శ్రీ అమిత్ షా నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాలు సాధారణంగా సహకార రంగాన్ని ,ముఖ్యంగా పిఎసిఎస్ లను తమ సభ్యులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సృష్టించడానికి , వాటిని ఆచరణీయమైన, విశిష్ట, ఆర్థికంగా స్థిరమైన ఆర్థిక సంస్థలుగా మార్చడానికి దోహదపడతాయి.
प्रविष्टि तिथि:
17 MAY 2023 7:31PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ "సహకార్ సే సమృద్ధి" దార్శనికతను సాకారం చేయడానికి ,కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా కృషి తో, సహకార రంగంలో 1100 కొత్త ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ పిఒ) ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ '10,000
ఎఫ్ పి ఒ ల ఏర్పాటు, ప్రోత్సాహం' పథకం కింద ఈ 1100 అదనపు ఎఫ్ పి ఒ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ సి డి సి )కి కేటాయించింది.
ఎఫ్ పి ఒ స్కీమ్ కింద ఒక్కో ఎఫ్ పి ఒ కు రూ.33 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ (సీబీబీఓ)కు ఒక్కో ఎఫ్ పి ఒ కు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.
సుమారు 13 కోట్ల మంది రైతులు సభ్యులుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఇప్పటిదాకా ప్రధానంగా స్వల్పకాలిక రుణాలు, విత్తనాలు, ఎరువుల పంపిణీలో నిమగ్నమయ్యాయి. ఇప్పుడు ఇతర ఆర్థిక కార్యకలాపాలను కూడా చేపట్ట
గలుగుతాయి. ఎఫ్ పిఒ పథకంలో పిఎసిఎస్ లను విలీనం చేయడం వల్ల కల్టివేటర్, టిల్లర్, హార్వెస్టర్ మొదలైన వ్యవసాయ పరికరాలు. ప్రాసెసింగ్, క్లీనింగ్, అస్సేయింగ్, సార్టింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్, రవాణా మొదలైన వాటితో సహా. ఉత్పత్తి ఉపకరణాల సరఫరా రంగాలలో వారి వ్యాపారాన్ని విస్తరించడానికి వీలు కల్పిస్తుంది; తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం వంటి అధిక ఆదాయాన్ని అందించే కార్యకలాపాలను కూడా పీఏసీఎస్ లు చేపట్టగలవు.
ఈ కార్యక్రమం ద్వారా రైతులకు అవసరమైన మార్కెట్ లింకేజీలు కల్పించడం ద్వారా వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఇది పిఎసిఎస్ ఆర్థిక కార్యకలాపాలలో వైవిధ్యతకు దారితీస్తుంది, తద్వారా వారు కొత్త ,స్థిరమైన ఆదాయ వనరులను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది.
ఇది, దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి శ్రీ అమిత్ షా నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ చేపట్టిన అనేక ఇతర కార్యక్రమాలతో పాటు, సాధారణంగా సహకార రంగం, ముఖ్యంగా పిఎసిఎస్ లు తమ సభ్యులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా అవి ఆచరణీయమైన, విశిష్ట మైన, ఆర్థికంగా స్థిరమైన ఆర్థిక సంస్థలుగా రూపాంతరం చెందుతాయి. .
****
(रिलीज़ आईडी: 1925021)
आगंतुक पटल : 228