ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ రక్తపోటు (హైపర్ టెన్షన్) దినం


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక “75/25” చొరవ - 2025 నాటికి రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న 7.5 కోట్ల మందిని పి హెచ్ సి ల ద్వారా స్టాండర్డ్ కేర్ పై ఉంచుతామని ప్రకటన

శశక్త్ పోర్టల్ ద్వారా సమాజానికి ఆరోగ్య సంరక్షణ సేవలను మరింత చేరువ చేయడానికి 40,000 మంది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వైద్యాధికారులకు నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల (ఎన్ సి డి) ప్రామాణిక చికిత్స వర్క్ ఫ్లో పై శిక్షణ

నాన్-కమ్యూనికబుల్ వ్యాధుల
(ఎన్ సి డి) నివారణ, నియంత్రణ కు సంబంధించిన జాతీయ కార్యక్రమానికి సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలు మరింత విస్తృతమైన కవరేజీతో జారీ

వనరులను కేటాయించడం, సామర్థ్యాన్ని పెంచడం, సమీకరణ , బహుళ రంగాల సహకారం ద్వారా ఎన్ సి డి లను పరిష్కరించడానికి ప్రభుత్వ స్పష్టమైన సంకల్పాన్ని ఇది సూచిస్తుంది: డాక్టర్ వికె పాల్

దేశంలో పెరుగుతున్న ఎన్ సి డి ల భారాన్ని పరిష్కరించడానికి సంబంధిత రంగాల పరస్పర (ఇంటర్ సెక్టోరల్) పరస్పర ప్రయత్నాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సహకారం అవసరం: ఆరోగ్య కార్యదర్శి

2025 నాటికి ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో ప్రామాణిక సంరక్షణ కింద రక్తపోటు ఉన్న 75 మిలియన్ల మందికి చేరు

Posted On: 17 MAY 2023 2:32PM by PIB Hyderabad

ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 నాటికి రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న 7.5 కోట్ల మందిని ప్రామాణిక సంరక్షణలో ఉంచే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడిక్కడ శ్రీకారం చుట్టింది.

 

జి-20 కో బ్రాండెడ్ ఈవెంట్ గా కేంద్ర 'రక్తపోటు, మధుమేహం నివారణ, నిర్వహణను వేగవంతం చేయడం' పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ,

డబ్ల్యూహెచ్ ఒ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ గోపాలకృష్ణన్ సమక్షంలో నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ ఈ విషయం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటించారు. డబ్ల్యూహెచ్ ఒ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్, డబ్ల్యూహెచ్ ఒ సియరో  డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఇందులో వర్చువల్ గా ప్రసంగించారు.

 

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలో ప్రారంభమయ్యే కమ్యూనిటీ ఆధారిత విధానంతో ప్రపంచంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఎన్ సి డిల అతిపెద్ద విస్తరణ ఇదేనని డాక్టర్ పాల్ పేర్కొన్నారు. వనరులను కేటాయించడం, సామర్థ్యాన్ని పెంచడం, సమీకరణ , బహుళ రంగాల సహకారం ద్వారా ఎన్ సి డి లను పరిష్కరించడానికి ప్రభుత్వ స్పష్టమైన సంకల్పాన్ని ఇది సూచిస్తుంది అని ఆయన అన్నారు. 'గౌరవ ప్రధాన మంత్రి నాయకత్వంలో, అమృత్ కాలములో రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కృతనిశ్చయంతో ఉంది.

అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఆయుర్దాయం, మాతాశిశు మరణాల రేటు, ఎన్ సి డి లు వంటి సామాజిక సూచికల్లో ఫలితాలను సాధించేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది’ అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ 2023-2024  అవుట్ కం బడ్జెట్ డాక్యుమెంట్ మొదటిసారిగా రక్తపోటు ,డయాబెటిస్ చికిత్సను ప్రవేశపెట్టింది, ఇది అధిక రక్తపోటు , డయాబెటిస్ కవరేజ్ సేవలను పెంచడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

 

ఎన్ సి డిలపై పోరాటం ప్రాథమిక ఆరోగ్య స్థాయి ద్వారా జరగాలని, 1.5 లక్షలకు పైగా హెచ్ డబ్ల్యు సి ల ఏర్పాటు, టెలిమెడిసిన్ ,డిజిటల్ ఆరోగ్య సేవలను అమలు చేయడం ద్వారా ఈ ముప్పును ఎదుర్కోవటానికి భారతదేశం ఒక వేదికను సృష్టించిందని డాక్టర్ పాల్ పేర్కొన్నారు.

 

స్క్రీనింగ్ అనేది ఏదైనా వ్యాధిని విజయవంతంగా నిర్వహించడానికి పునాది కాబట్టి అధిక రక్తపోటు నివారణ,  నిర్వహణను వేగవంతం చేయడానికి, రాష్ట్ర బృందాలను అన్ని ఎస్ఓపిలకు ముఖ్యంగా స్క్రీనింగ్ ఎస్ఓపిలకు సరిగ్గా కట్టుబడి ఉండాలని డాక్టర్ వికె పాల్  కోరారు, అయితే కేవలం స్క్రీనింగ్ మాత్రమే సరిపోదని ఆయన పేర్కొన్నారు. గుర్తించడం ఫలితాలకు దారితీయాలి. కాబట్టి వ్యాధి నిర్ధారణ అయిన వారిలో కనీసం 80 శాతం మంది చికిత్సలో ఉండేలా చూడాలని కోరారు. ఈ ప్రయత్నంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అవసరం అని, ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడానికి నమూనాలు ,వివిధ బిల్డింగ్ బ్లాక్ లను రూపొందించడంలో విద్యా -పరిశోధన రంగం సహకారం కూడా కీలకమని స్పష్టం చేశారు.

 

మంచి ఆహారం తినడం, వ్యాయామం, ఇతర ఆరోగ్య పద్ధతుల ద్వారా జీవనశైలి మార్పులను కలిగి ఉన్న నివారణ దిశగా ఎక్కువ కృషి చేయాలని డాక్టర్ పాల్ నొక్కి చెప్పారు. సమాజ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రయత్నాన్ని మరింతగా కనిపించేలా చేయడానికి జన్ ఆందోళన్ ఆవశ్యకతను ఆయన వివరించారు.  "ఒకే భూమి, ఒకే ఆరోగ్యం" స్ఫూర్తితో దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం, ఒకరి విజయాలను మరొకరు పంచుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ప్రముఖంగా తెలిపారు.

 

2025 నాటికి ప్రాధమిక ఆరోగ్య సంరక్షణలో ప్రామాణిక సంరక్షణ కింద రక్తపోటు ఉన్న 75 మిలియన్ల మందికి చేరుకోవాలనే భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక లక్ష్యం ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్ సి డి కవర్ అని డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ అన్నారు.

 

డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ తన వర్చువల్ ప్రసంగంలో, ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించినందుకు భారత ప్రభుత్వాన్ని అభినందించారు. ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ పట్ల భారతదేశ నిబద్ధతను ఆమె ప్రశంసించారు.   1.5 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను నిర్వహించడం ఒక ముఖ్యమైన విజయంగా ఆమె అభినందించారు. ఎన్ సి డి నియంత్రణను వేగవంతం చేయడానికి కొత్త , సమర్థవంతమైన ప్రాంతీయ రోడ్ మ్యాప్ ను రూపొందించాలని ఆగ్నేయాసియా ప్రాంతంలోని దేశాలను ఆమె కోరారు.

 

ఆర్థిక వ్యవస్థ, సామాజిక శక్తులు, అంటువ్యాధుల మధ్య పరస్పర చర్యను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వివరించారు. గత రెండు దశాబ్దాల్లో 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధితో, భారతదేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం నేడు 70 శాతానికి గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. జనాభాలో అధిక భాగం జీవనశైలి మునుపటి కంటే నిశ్చలంగా మారింది. అవగాహన, నివారణ, ఆరోగ్య జాగ్రత్తలు, శ్రేయస్సును సమగ్ర పద్ధతిలో చూసే సామాజిక విధానంలో ఎన్ సి డి ల సమస్యకు పరిష్కారం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ఎన్ సిడిల భారాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సమిష్టి ప్రయత్నాలు ,సహకారం అవసరమని ఆయన నొక్కి చెప్పారు.

 

75/25 చొరవతో పాటు, కమ్యూనిటీకి దగ్గరగా ఆరోగ్య సంరక్షణ సేవలను సాకారం చేయడానికి ప్రారంభించిన

ఎన్ సి డి ల  ప్రామాణిక చికిత్స వర్క్ ఫ్లో పై 40,000 మంది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వైద్య అధికారులకు శిక్షణ ఇవ్వడానికి శశక్త్ పోర్టల్ ను

ప్రారంభించారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్పీ-ఎన్సీడీ) సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను మరింత విస్తృత కవరేజీ లక్ష్యంతో విడుదల చేశారు. దీర్ఘకాలిక అబ్ స్త్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సిఓపిడి) ,ఆస్తమా, క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) ,నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ (ఎన్ఎఎఫ్ఎల్ డి), అధిక రక్తపోటు, డయాబెటిస్ తో పాటు ఎస్ టి ఎలివేషన్ ఆఫ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి) , నోటి, రొమ్ము , గర్భాశయంతో సహా మూడు సాధారణ క్యాన్సర్లకు ఈ కార్యక్రమం ఇప్పుడు సేవలను అందిస్తోంది.

 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ విశాల్ చౌహాన్, భారతదేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్ ఓఫ్రిన్, జి -20 ప్రతినిధులు, డబ్ల్యూహెచ్ఓ-సీరో దేశాల ప్రతనిధులు, డబ్ల్యూహెచ్ఓ, ఐరాస , ఇతర సంస్థల నుండి రక్తపోటు ,మధుమేహంపై పని చేస్తున్న అంతర్జాతీయ భాగస్వాములు, రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు, జాతీయ ఎన్ సి డి భాగస్వాములు ఇంకా  కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1925019) Visitor Counter : 220