వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లను విక్రయించడాన్ని నిషేధిస్తూ అగ్రశ్రేణి 5 ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు వ్యతిరేకంగా కేంద్రం ఆర్డర్ జారీ చేసింది


క్లిప్‌లు వినియోగదారుల రక్షణ చట్టం, 2019ని ఉల్లంఘించి, కారు ప్రయాణికుల జీవితాలతో రాజీ పడుతున్నాయి.

13,118 కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ల విక్రయాలను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించారు

Posted On: 12 MAY 2023 11:43AM by PIB Hyderabad

వినియోగదారుల రక్షణ చట్టం, 2019ని ఉల్లంఘించిన దృష్ట్యా, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లను విక్రయించడాన్ని నిషేధిస్తూ అగ్రశ్రేణి ఐదు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. సీటు బెల్టులు ధరించనప్పుడు అలారం బీప్‌ను ఆపడం ద్వారా క్లిప్‌లు వినియోగదారుని జీవితం మరియు భద్రతను రాజీ చేస్తాయి.

 

చీఫ్ కమీషనర్, శ్రీమతి నిధి ఖరే నేతృత్వంలో, సి సి పి ఎ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్ మరియు మీషో వినియోగదారుల హక్కుల ఉల్లంఘన మరియు అన్యాయమైన వాణిజ్య చర్యలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ల విక్రయం సమస్య రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లేఖ ద్వారా వినియోగదారుల వ్యవహారాల శాఖ సి సి పి ఎ దృష్టికి వచ్చింది. కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ల అక్రమ విక్రయాల సమస్యను ఈ లేఖ స్పష్టం చేసింది మరియు తప్పు చేసిన విక్రేతలు / ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై చర్య తీసుకోవాలని మరియు సలహా జారీ చేయాలని అభ్యర్థించింది. అలాగే సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్ 1989లోని రూల్ 138 సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి చేసింది. అయితే, సీటు బెల్టులు ధరించనప్పుడు అలారం బీప్‌ను ఆపడం ద్వారా ప్రయాణీకుల భద్రతకు హాని కలిగించే  వస్తువుల ఆన్‌లైన్ విక్రయాలు సురక్షితం కాదు మరియు వినియోగదారుల జీవితానికి మరియూ భద్రతకు ప్రమాదకరం.

 

మోటారు ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో క్లెయిమ్ మొత్తాలను కోరుకునే వినియోగదారులకు కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లను ఉపయోగించడం కూడా అడ్డంకిగా ఉంటుందని చెప్పడం అత్యవసరం. అటువంటి క్లిప్‌లను ఉపయోగించినందుకు క్లెయిమ్‌దారు యొక్క నిర్లక్ష్యం కారణంగా బీమా కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. మరోవైపు, సీట్ బెల్ట్‌ని ఉపయోగించడం వల్ల ఎయిర్‌బ్యాగ్ కు సరైన కుషన్‌ను అందించడానికి వీలు కల్పిస్తుంది అలాగే ప్రమాద సమయం లో పూర్తి శక్తితో ప్రయాణికులను తాకదు, ఇది ప్రమాద సందర్భంలో రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంది.

 

సి సి పి ఎ వినియోగదారుల హక్కులను రక్షించడానికి, ప్రోత్సహించడానికి మరియు అమలు చేయడానికి వినియోగదారుల రక్షణ చట్టం, 2019 అమలు లోకి తెచ్చింది.  సి సి పి ఎ కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ల విక్రయ సమస్యను గుర్తించింది . దాని డేగ కన్నుతో క్లిప్‌లు అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో సులువుగా కొనగల పద్ధతిలో అమ్ముడవుతున్నాయని కనుగొంది.  మరియు వినియోగదారుల విలువైన జీవితానికి అధిక ప్రమాదం ఉంది. కొంతమంది విక్రేతలు క్లిప్‌లను బాటిల్ ఓపెనర్లు లేదా సిగరెట్ లైటర్ వంటి వాటితో మభ్యపెట్టి విక్రయిస్తున్నట్లు విచారణలో కనుగొనింది.

 

వినియోగదారుల భద్రత మరియు విలువైన జీవితంపై ఈ ఉత్పత్తి యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, సి సి పి ఎ ఈ విషయాన్ని డీ జీ ఇన్వెస్టిగేషన్ (సి సి పి ఎ)కి సూచించింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్‌లోని సిఫార్సులు మరియు ఇ-కామర్స్ ఎంటిటీలు చేసిన సమర్పణల ఆధారంగా, సి సి పి ఎ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌లు ప్రయాణికులు మరియు ప్రజల భద్రతకు హాని కలిగించే అనుబంధ మోటారు వాహనాల భాగాలను శాశ్వతంగా తొలగించాలని వారిని ఆదేశించారు.  అటువంటి ఉత్పత్తుల యొక్క అక్రమ విక్రయదారులపై తీసుకున్న చర్యల గురించి సి సి పి ఎకి తెలియజేయాలని మరియు పై ఆదేశాలపై  నివేదికతో పాటు విక్రేతల వివరాలను సమర్పించాలని కూడా వారిని ఆదేశించారు.

 

సి సి పి ఎ జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే, మొత్తం ఐదు ఇ-కామర్స్ సంస్థలు తమ నివేదికలు సమర్పించారు. సి సి పి ఎ చొరవ ఆధారంగా, కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ల యొక్క సుమారు 13,118 లిస్ట్ లను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి తొలగించారు. తొలగింపుల వివరాలు ఇలా ఉన్నాయి:

 

S.No.

Name of E-commerce Company

Delistings

(Numbers as per the submissions made by companies)

  1.  

Amazon

8095

  1.  

Flipkart

4000-5000

  1.  

Meesho

21

  1.  

Snapdeal

1

  1.  

Shoplcues

1

Total

13,118

 

ఎం ఓ ఆర్ టీ హెచ్ ప్రచురించిన తాజా నివేదిక ప్రకారం 2021లో సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో 16,000 మందికి పైగా మరణించారని, వారిలో 8,438 మంది డ్రైవర్లు మరియు మిగిలిన 7,959 మంది ప్రయాణికులు ఉన్నారు.  దీనితో ఈ చర్య ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా, సుమారు 39,231 మంది గాయపడ్డారు, వారిలో 16,416 మంది డ్రైవర్లు మరియు 22,818 మంది ప్రయాణికులు ఉన్నారు. 18-45 సంవత్సరాల వయస్సు గల యువకులు రోడ్డు ప్రమాద కేసుల్లో బాధితుల్లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది ఉన్నారని నివేదిక తెలియజేసింది.

 

సి సి పి ఎ దేశవ్యాప్తంగా  ఉన్న వినియోగదారుల యొక్క హక్కులను ప్రోత్సహించడానికి మరియు రక్షించడానికి 24 గంటలు పని చేస్తోంది, ఈ విషయంలో, వినియోగదారులకు ప్రాణనష్టం లేదా తీవ్రమైన గాయాన్ని నివారించడానికి కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్ క్లిప్‌ల తయారీ లేదా అమ్మకానికి వ్యతిరేకంగా సి సి పి ఎ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధాన కార్యదర్శులు మరియు జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. వినియోగదారుల విలువైన ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్న నివేదికను సమర్పించాలని సి సి పి ఎ అభ్యర్థించింది.

 

ప్రజల ప్రాణనష్టాన్ని నివారించడానికి, సి సి పి ఎ  కార్ సీట్ బెల్ట్ అలారం స్టాపర్‌ల తయారీ లేదా విక్రయం తీవ్రత గురించి విస్తృత సమాచారవ్యాప్తి కోసం ఎం ఓ ఆర్ టీ హెచ్ మరియు డీ పీ ఐ ఐ టీ కార్యదర్శి, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ఈ కామర్స్ సంస్థలు, పరిశ్రమ సంఘాలు మరియు స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలకు ఒక సలహా జారీ చేసింది.

 

***


(Release ID: 1923752) Visitor Counter : 189