నౌకారవాణా మంత్రిత్వ శాఖ
పర్యావరణ హితమైన ఓడరేవుల కోసం జారీచేసిన 'హరిత సాగర్' మార్గదర్శకాలు 2023ను అమలును ప్రారంభించిన కేంద్ర మంత్రి సోనోవాల్
'హరిత సాగర్ మార్గదర్శకాలు 2023' పోర్టుల అభివృద్ధి, వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థలో గతిశీలతను దృష్టిలో ఉంచుకొని రూపొందించినవి
ఓడరేవులన్నీ పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకున్నాయి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన 'పంచమిత్ర' నిబద్ధతను పాటించడానికి చురుకుగా తోడ్పడుతున్నాయి: కేంద్ర ఓడరేవులు, నోకానిర్మాణం, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్
వివిధ నిర్వహణ పరిమితులను సాధించి అసాధారణ ప్రతిభ కనబర్చిన పెద్ద పోర్టులకు 'సాగర్ శ్రేష్ఠ సమ్మాన్' అవార్డులను బహుకరించారు
Posted On:
10 MAY 2023 4:18PM by PIB Hyderabad
కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలనే (జీరో కార్బన్ ఎమిషన్) లక్ష్యాన్ని సాధించాలనే కలను నిజం చేసుకోవడానికి హరిత రేవుల కోసం కేంద్ర ఓడరేవులు, నోకానిర్మాణం, జలమార్గాల మంత్రిత్వ శాఖ 'హరిత సాగర్' మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల అమలును కేంద్ర ఓడరేవులు, నోకానిర్మాణం, జలమార్గాలు మరియు ఆయుష్ శాఖ మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ న్యూఢిల్లీలో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఓడరేవులు, నోకానిర్మాణం, జలమార్గాలు మరియు పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ వై. నాయక్ మరియు మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
'ప్రకృతితో కలిసి పనిచేయడం' అనే భావనకు అనుగుణంగా పోర్టుల అభివృద్ధి, వ్యాపార కార్యకలాపాలు, నిర్వహణ కోసం పర్యావరణ వ్యవస్థలో గతిశీలత సాధించాలనే యోచనతోపాటు నౌకాశ్రయ పర్యావరణ వ్యవస్థలోని జీవసంబంధ అంగాల ప్రభావాన్ని న్యూనత పరిచేందుకు 'హరిత సాగర్ మార్గదర్శకాలు - 2023' రూపొందించారు.
పోర్టు కార్యకలాపాల నిర్వహణలో పరిశుభ్రమైన / హరిత ఇంధనాల వినియోగం, నిల్వ సామర్ధ్యం పెంపును, సరుకుల రవాణాను అభివృద్ధి చేయడం, హరిత హైడ్రోజెన్, హరిత అమోనియా, హరిత మిథేనాల్ హరిత ఇంధనాలు నింపే సామర్ధ్యం పెంచడం వంటి వాటిపై మార్గదర్శకాలు దృష్టిని కేంద్రీకరిస్తాయి.
కర్బన ఉద్గారాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యాల సాధనకు పెద్ద పోర్టులు ఒక సమగ్ర ప్రణాలికను రూపొందించుకునేందుకు ఈ మార్గదర్శకాలు ఒక చట్రాన్ని సమకూరుస్తాయి. అంతేకాక హరిత ఉపక్రమణలను
సమీపంనుంచి పర్యవేక్షించి అమలు చేయడం ద్వారా నిర్వహణీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఇవి తోడ్పడుతాయి.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఓడరేవులన్నీ పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకున్నాయని, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించిన 'పంచమిత్ర' నిబద్ధతను పాటించడానికి చురుకుగా తోడ్పడుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ తెలిపారు.
హరిత సాగర్ - 2023 మార్గదర్శకాలు పెద్దపోర్టులు నిర్ణీత కాలవ్యవధిలో కర్భన ఉద్గారాలను పరిమాణీకరించే స్థాయిలో తగ్గించేందుకు వీలుగా పెద్ద పోర్టులు సమగ్ర కార్యాచరణ ప్రణాలికను రూపొందించుకొని సాధికారత సాధించడానికి తోడ్పడుతాయి.
ఈ మార్గదర్శకాల ఉద్దేశం వ్యర్ధాలను తగ్గించడం, పోర్టు కార్యకలాపాల నుంచి వ్యర్ధాల విడుదలను పూర్తిగా మానివేయడం, వ్యర్ధాల పునర్వినియోగం.
హరిత సాగర్ మార్గదర్శకాలు నిర్వహణీయ లక్ష్యాల సాధన దిశలో గణనీయమైన చర్య అని, అన్ని పోర్టులలో పర్యావరణ హితమైన అభ్యాసాలను, సంప్రదాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందని సహాయ మంత్రి శ్రీ శ్రీపాద నాయక్ తెలిపారు.
కేంద్ర ఓడరేవులు, నోకానిర్మాణం, జలమార్గాల శాఖ కార్యదర్శి శ్రీ సుదాన్ష్ పంత్ 'దేశంలోని పెద్ద పోర్టులలో నాలుగు దీన్ దయాళ్ పోర్టు, విశాఖపట్నం పోర్టు, న్యూ మంగళూరు పోర్టు మరియు విఓసి పోర్టు ఇదివరకే తమ అవసరాలకు మించి అక్షయ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని , ఇక ముందు పోర్టులు పర్యావరణ సంబంధ అంశాలలో పర్యావరణ సూచికలలో తమ సామర్ధ్యం ఏ మేరకు ఉందో అంచనావేయగలవని అన్నారు.
2022-23లో మంచి పనితీరు కనబరచిన పోర్టులకు 'సాగర్ శ్రేష్ఠ సమ్మాన్' అవార్డులు ఇచ్చారు. పెద్ద పోర్టుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని జనింపజేయడం ద్వారా రానున్న సంవత్సరాలలో మరింత బాగా పనిచేయడాన్ని ప్రేరేపించడానికి ఈ అవార్డులను ఏర్పాటు చేయడం జరిగింది.
వివిధ నిర్వహణ పరిమితులను సాధించి అసాధారణ ప్రతిభ కనబర్చిన పెద్ద పోర్టులు కాండ్లాలోని దీన్ దయాళ్ పోర్టు, జవహర్ లాల్ నెహ్రు పోర్టు , కామరాజర్ పోర్టు , పారదీప్ పోర్టు, మార్మగోవా పోర్టులకు అవార్డులు లభించాయి. ఉత్తమపోర్టుగా పారదీప్ పోర్టు ఎంపికైంది.
(Release ID: 1923286)
Visitor Counter : 231