జల శక్తి మంత్రిత్వ శాఖ
పారిశుద్ధ్య ప్రగతిలో మరో మైలురాయిని సాధించిన భారతదేశం- స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ II కింద ఓడిఎఫ్ ప్లస్‌గా మారిన 50 శాతం గ్రామాలు
దాదాపు 3 లక్షల గ్రామాలు తమను తాము ఓడిఎఫ్ ప్లస్‌గా ప్రకటించుకున్నాయి. 2024-25 నాటికి ఎస్‌బిఎం-జీ దశ II లక్ష్యాలను సాధించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు
అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలు/యూటీలు తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గోవా, అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేల్లి & డామన్ డయ్యూ మరియు లక్షద్వీప్‌లు
Posted On:
10 MAY 2023 12:57PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్‌బిఎ-జి) కింద దేశం మరో ప్రధాన మైలురాయిని సాధించింది. దేశంలోని మొత్తం గ్రామాలలో సగం అంటే 50 శాతం గ్రామాలు మిషన్ II కింద ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించాయి.ఓడిఎఫ్ ప్లస్ గ్రామం అంటే ఘన లేదా ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడంతో పాటు బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్) హోదాను పొందడం. ఇప్పటి వరకు 2.96 లక్షలకు పైగా గ్రామాలు తమను తాము ఓడిఎఫ్ ప్లస్‌గా ప్రకటించుకున్నాయి. ఇది 2024-25 నాటికి ఎస్‌బిఎం-జి దశ II లక్ష్యాలను సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
ఓడిఎఫ్ ప్లస్ గ్రామాల శాతం పరంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పెద్ద రాష్ట్రాలు తెలంగాణ (100%), కర్ణాటక (99.5%), తమిళనాడు (97.8%) ఉత్తరప్రదేశ్ (95.2%) మరియు చిన్న రాష్ట్రాల్లో గోవా (95.3%) సిక్కిం (69.2%) అగ్రగామిగా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో అండమాన్ & నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేల్లి & డామన్ డయ్యూ మరియు లక్షద్వీప్‌లు 100% ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలను కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు &యూటీలు ఓడిఎఫ్ ప్లస్ స్థితిని సాధించడంలో విశేషమైన పురోగతిని కనబరిచాయి మరియు ఈ మైలురాయిని చేరుకోవడంలో వారి ప్రయత్నాలు కీలకంగా ఉన్నాయి.
ఈ 2,96,928 ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలలో 2,08,613 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లేదా లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం ఏర్పాట్లను కలిగి ఉన్నాయి. 32,030 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ రైజింగ్ గ్రామాలు మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మరియు లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రెండింటికీ సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి మరియు 56,285 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామాలు.ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామం దాని ఓడిఎఫ్ స్థితిని కొనసాగిస్తోంది మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మరియు లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రెండింటికీ ఏర్పాట్లను కలిగి ఉంది; దృశ్య పరిశుభ్రతను గమనిస్తుంది. అంటే కనిష్ట చెత్త, తక్కువస్థాయిలో నిలిచే మురుగునీరు, బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను డంప్ చేయకపోవడం; మరియు ఓడిఎఫ్ ప్లస్ సమాచారం, విద్య & కమ్యూనికేషన్ (ఐఈసి) సందేశాలను ప్రదర్శిస్తుంది. ఇప్పటివరకు 1,65,048 గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు ఉండగా 2,39,063 గ్రామాల్లో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఏర్పాట్లు, 4,57,060 గ్రామాల్లో తక్కువస్థాయిలో నీరు నిలిచి ఉండగా, 4,67,384 గ్రామాల్లో అత్యల్ప చెత్త ఉంది.
2014-15 మరియు 2021-22 మధ్య కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ పథకానికి మొత్తం రూ.83,938 కోట్లు కేటాయించింది. 2023-24 సంవత్సరానికి రూ. 52,137 కోట్లు కేటాయించింది. ఎస్‌బిఎం(జి) నిధులతో పాటు పారిశుధ్యం కోసం 15వ ప్రణాళిక సంఘం నిధులను స్పష్టంగా కేటాయించారు. ఈ నిధులు పారిశుద్ధ్య ఆస్తులను నిర్మించడానికి, ప్రవర్తన మార్పును ప్రోత్సహించడానికి మరియు ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలను అమలు చేయడానికి ఉపయోగించబడ్డాయి.
ఈ ఏడాది స్వచ్ఛ భారత్ మిషన్‌కు 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 50% ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలను సాధించడం భారతదేశానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఎందుకంటే ఇది కేవలం మరుగుదొడ్ల నిర్మాణం మరియు వినియోగాన్ని దాటి పూర్తి మరియు సంపూర్ణ పరిశుభ్రత వైపు అంటే ఓడిఎఫ్ నుండి ఓడిఎఫ్ ప్లస్ వరకు ముందుకు సాగుతోంది.ఎస్‌బిఎం(జి) రెండో దశ ప్రధాన అంశాలు బహిరంగ మలవిసర్జన రహిత స్థితిని కొనసాగించడం (ఓడిఎఫ్-ఎస్), ఘన (బయో-డిగ్రేడబుల్) వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ (పిడబ్ల్యూఎం), ద్రవ వ్యర్థాల నిర్వహణ (ఎల్‌డబ్ల్యూఎం), మల బురద మేనేజ్‌మెంట్ (ఎఫ్‌ఎస్‌ఎం), గోబర్ధన్, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్/బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ (ఐఈసి/బిసిసి) మరియు కెపాసిటీ బిల్డింగ్ మొదలైనవి.ఎస్‌బిఎం-జి కార్యక్రమం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషించింది. గత కొన్ని సంవత్సరాలలో అనేక నివేదికలు ఎస్‌బిఎం-జి కార్యక్రమ క్షేత్రస్థాయి ప్రభావాన్ని చూపించాయి.
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్) ప్రభావం
స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బిఎం) ప్రాణాలను కాపాడుతుంది:డబ్ల్యూహెచ్‌ఓ 2018
2014తో పోలిస్తే 2019లో 3 లక్షల అతిసార మరణాలు నివారించబడ్డాయి
ఎస్‌బిఎం పోషణ మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది
బిఎంజిఎఫ్ 2017 - నాన్ ఓడిఎఫ్ ప్రాంతాల్లో
58% పిల్లలలో వృధా కేసులు ఎక్కువగా ఉన్నాయి
స్వచ్ఛత మహిళల భద్రత మరియు గౌరవాన్ని కాపాడుతుంది
యూనిసెఫ్ 2017 - 96% మంది మహిళలు ఇంట్లో మరుగుదొడ్డి ని పొందిన తర్వాత సురక్షితంగా భావించారు
ఎస్‌బిఎం కుటుంబానికి డబ్బు సంపాదిస్తుంది
యూనిసెఫ్ 2017 -మెరుగైన ఆరోగ్యం కారణంగా ఓడిఎఫ్ గ్రామంలో ప్రతి ఇల్లు
సగటున ప్రతి సంవత్సరం రూ.50,000 ఆదా అవుతుంది
ఎస్‌బిఎం పర్యావరణాన్ని కాపాడుతుంది
యూనిసెఫ్ 2019 -ఓడిఎఫ్ గ్రామాల్లో భూగర్భ జలాల కాలుష్యం 12.70 రెట్లు తక్కువ
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ పరంగా 831 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు మరియు 1,19,449 వ్యర్థాల సేకరణ & వేరుచేసే షెడ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్లాస్టిక్‌ను శుభ్రపరచడం, ముక్కలు చేయడం, బెయిల్ చేయడం మరియు రవాణా చేయడం మరియు సిమెంట్ కర్మాగారాల్లో ఇంధనం వలె ఉపయోగించడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్‌యుపి) నిషేధానికి 1 లక్షకు పైగా గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి.
206 జిల్లాల్లో 683 ఫంక్షనల్ బయో-గ్యాస్/సిబిజి ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి
3,47,094 కమ్యూనిటీ కంపోస్ట్ పిట్‌లను నిర్మించారు
గృహ స్థాయిలో బయో-డిగ్రేడబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కోసం కమ్యూనిటీ స్థాయిలో కంపోస్ట్ చేయడానికి ప్రజలు తమ పొడి మరియు తడి (సేంద్రీయ) వ్యర్థాలను మూలం వద్ద వేరు చేయడానికి ప్రోత్సహం అందించబడుతోంది. ఇప్పటి వరకు 3,47,094 కమ్యూనిటీ కంపోస్ట్ పిట్‌లను నిర్మించారు. గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-ఆగ్రో రిసోర్సెస్-ధన్‌కి ఉద్దేశించిన గోబర్ధన్, బయోడిగ్రేడబుల్ వ్యర్థాల పునరుద్ధరణ, వ్యర్థాలను వనరులుగా మార్చడం మరియు స్వచ్ఛమైన & పచ్చని గ్రామాన్ని సృష్టించడం కోసం ఒక చొరవ. ఇది 'వేస్ట్ టు వెల్త్' కార్యక్రమం. దీనిలో గ్రామాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలను బయో-గ్యాస్/సిబిజి అలాగే బయో-స్లర్రీ/బయో-ఎరువును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు మరియు ఇది భారతప్రభుత్వం యొక్క వృత్తాకార ఆర్థిక వ్యవస్థ మరియు మిషన్ లైఫ్ కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటుంది. 206 జిల్లాల్లో 683 ఫంక్షనల్ బయో-గ్యాస్/సిబిజి ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. పర్యావరణ అనుకూలమైన ఇంధన వనరు, నేల నాణ్యతను మెరుగుపరచడానికి మరియు రసాయనిక ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పోషకాలు అధికంగా ఉండే స్లర్రీ, శుభ్రమైన పరిసరాలు మరియు వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధులను నిర్మూలించడం,పారిశుద్ధ్యం మరియు ఆరోగ్య పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థిక వ్యయాలను ఆదా చేయడం, గ్రీన్ హౌస్ తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాయువుల (జిహెచ్‌జి) ఉద్గారాలు, ముడి చమురు దిగుమతి తగ్గింపు (ఫారెక్స్ సేవింగ్), స్థానిక కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు, వ్యవస్థాపకతను పెంపొందించడం మరియు గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించడం, సేంద్రీయ వ్యర్థాల నుండి రైతులు/స్థానిక గ్రామ సమాజం ఆదాయాన్ని పెంచడం మరియు వ్యవసాయ అవశేషాలపై జాగ్రత్తలు తీసుకోవడం వంటివి ఉన్నాయి.
గ్రే వాటర్‌ను నిర్వహించడానికి 22 లక్షల సోక్ పిట్‌లు (కమ్యూనిటీ & గృహాలు) నిర్మించబడ్డాయి
రోజువారీ ఇంటి పనుల ద్వారా ఉత్పన్నమయ్యే మురుగునీటితో పాటు ఇంటిని శుభ్రపరచడం, వంట చేయడం, స్నానం చేయడం మొదలైన కార్యక్రమాల ద్వారా ఉత్పత్తయ్యే నీటిని డ్రైనేజీ వ్యవస్థలు లేని గ్రామాల్లో సోక్ పిట్స్/లీచ్ పిట్‌లు లేదా ఇంటి మరియు సమాజ స్థాయిలో మ్యాజిక్ పిట్‌లు సమర్థవంతంగా శుద్ధి చేయగలవు. ఒక ప్రత్యేక కార్యక్రమం సుజ్లామ్ ద్వారా ఇది చేపట్టబడింది. గ్రే వాటర్ నిర్వహించడానికి సుమారు 2.2 మిలియన్ (22 లక్షలు) సోక్ పిట్‌లు (కమ్యూనిటీ & ఇంటి పిట్‌లు) తయారు చేయబడ్డాయి. ఇప్పుడు సంపూర్ణ మరియు కన్వర్జెంట్ గ్రేవాటర్ మేనేజ్‌మెంట్ కోసం సుజలామ్ 3.0 ప్రారంభించబడింది.
మరుగుదొడ్ల నుండి ఉత్పన్నమయ్యే మురుగునీరు అయిన ఫేకల్ స్లడ్జ్ కోసం ఎస్‌బిఎం(జి) మల బురద యొక్క సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారిస్తుంది. ఆన్-సైట్ శానిటేషన్ సిస్టమ్స్ యొక్క యాంత్రిక నిర్మూలనను బలోపేతం చేయడానికి మరియు మల బురదను సురక్షితంగా పారవేయడానికి ట్రీట్‌మెంట్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి జిల్లాలకు మద్దతు ఇస్తుంది.ఎఫ్‌ఎస్‌ఎం గృహ స్థాయిలో టాయిలెట్లను జంట పిట్ మరుగుదొడ్లు (లేదా ఇలాంటి వ్యవస్థలు)గా మార్చడం ద్వారా నిర్వహించబడుతుంది మరియు గ్రామాల కోసం పట్టణ ప్రాంతాలలో ఉన్న మురుగునీటి శుద్ధి కర్మాగారాలు (ఎస్‌టిపిలు)/ఫేకల్ స్లడ్జ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎఫ్‌ఎస్‌టిపిలు) వద్ద గ్రామ స్థాయిలో నిర్వహించబడుతుంది. పట్టణ ప్రాంతాలకు సామీపంలో ఇప్పటికే ఉన్న ట్రీట్‌మెంట్ సిస్టమ్‌లకు అనుసంధానం చేయలేని గ్రామాలకు ఎఫ్‌ఎస్‌టిపిలు మరియు ఎఫ్‌ఎస్‌టిపి సాధ్యపడని గ్రామాలు లేదా పెద్ద వివిక్త గ్రామం కోసం డీప్ రో ఎంట్రెంచ్‌మెంట్ ఉపయోగపడతాయి. ప్రస్తుతం 591 ఎఫ్‌ఎస్‌టిపిలు పనిచేస్తున్నాయి.
పారిశుధ్యం మరియు పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు సమిష్టిగా కృషి చేసినప్పుడు ఏం జరుగుతుందో చెప్పేందుకు ఎస్‌బిఎం(జి) ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. ఈ అపూర్వ విజయంపై అన్ని గ్రామాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు/యుటిలు అందించిన సహకారాన్ని జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన డ్రింకింగ్ వాటర్ & శానిటేషన్ విభాగం అభినందించింది మరియు ప్రశంసించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ - గ్రామీణ్ కింద తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ ఇటీవల చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి ఈ కింద క్లిక్ చేయండి
Click Here to Read about the recent Initiatives undertaken by Department of Drinking Water and Sanitation under Swachh Bharat Mission – Grameen
*****
(Release ID: 1923117)
Visitor Counter : 290