ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స‌క్ష‌మ్ లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Posted On: 10 MAY 2023 10:21AM by PIB Hyderabad

ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ‌కు సంబంధించిన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్టం (ఎల్ఎంఐఎస్ - విద్య నిర్వ‌హ‌ణ స‌మాచార వ్య‌వ‌స్థ‌) అయిన స‌క్ష‌మ్ (ఎస్ఎకెఎస్‌హెచ్ఎఎం - నిల‌క‌డైన ఆరోగ్య నిర్వ‌హ‌ణ కోసం అధునాత‌న విజ్ఞానానికి ప్రేర‌ణ‌) ను కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ భూష‌ణ్ ప్రారంభించారు. ఈ డిజిట‌ల్ విద్యా వేదిక‌ను న్యూఢిల్లీలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ జాతీయ సంస్థ (ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్ల్యు) అభివృద్ధి చేసింది.
దేశంలోని ఆరోగ్య/  వైద్య నిపుణులంద‌రికీ వైద్య విద్య‌ను, శిక్ష‌ణ‌ను అందించేందుకు అంకితం చేసిన ఐక్య‌వేదిక సక్ష‌మ్‌.  గ్రామీణ‌, మారుమూల ప్రాంతాల‌లో ఉన్న ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల నుంచి తృతీయ సంర‌క్ష‌ణ , న‌గ‌రాల‌లో ఉన్న కార్పొరేట్ ఆసుప‌త్రుల వ‌ర‌కు ఈ డిజ‌ట‌ల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ (విద్య వేదిక) ఆరోగ్య/  వైద్య‌ నిపుణుల‌ స‌మ్మిళిత సామ‌ర్ధ్య నిర్మాణానికి హామీ ఇస్తుంది. 
ప్ర‌స్తుతం స‌క్ష‌మ్ ః ఆన్‌లైన్ ప‌ద్ధ‌తి ద్వారా 200 ప్ర‌జారోగ్య‌, 100 క్లినిక‌ల్ కోర్సుల‌ను ఎల్ఎంఐఎస్ నిర్వ‌హిస్తోంది. ఈ కోర్సుల‌ను చేయాల‌నుకున్న ఆరోగ్య/  వైద్య‌ నిపుణులు పోర్ట‌ల్ యుఆర్ఎల్ః https://lmis.nihfw.ac.in/ అన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా న‌మోదు చేసుకొని, అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ‌ను పూర్తి చేసుకొని, అవ‌స‌ర‌మైన అంచ‌నా ప్ర‌మాణాల‌లో అర్హ‌త పొందిన త‌ర్వాత స‌ర్టిఫికేష‌న్‌ను పొంద‌వ‌చ్చు. 
ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి (ఆరోగ్యం) శ్రీ ఎస్‌. గోపాల‌కృష్ణ‌న్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి (ఆరోగ్యం) డాక్ట‌ర్ మాన‌శ్వి కుమార్‌, ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్ల్యు డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ధీర‌జ్ షా, ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్ల్యు  డిప్యూటీ డైరెక్ట‌ర్ నిధి కేస‌ర్‌వానీ, ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్ల్యు డీన్ డాక్ట‌ర్ వికె తివారీ, డాక్ట‌ర్ సంజ‌య్ గుప్తా, డాక్ట‌ర్ పుష్పాంజ‌లి స్వైన్‌, డాక్ట‌ర్ డికె యాద‌వ్‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌, ఎన్ఐహెచ్ఎఫ్‌డ‌బ్ల్యుకు చెందిన‌ సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. 

 

***
 


(Release ID: 1923112) Visitor Counter : 247