నౌకారవాణా మంత్రిత్వ శాఖ

సిట్వే ఓడరేవులో మొదటి కార్గో షిప్‌ను అందుకున్న శ్రీ సర్బానంద సోనోవాల్


సిట్వే పోర్ట్ అభివృద్ధితో కోల్‌కతా మరియు అగర్తల మరియు ఐజ్వాల్ మధ్య వస్తువుల రవాణా ఖర్చు అలాగే సమయం 50% ఆదా అవుతుంది

ఇది భారత్ మరియు మయన్మార్ ప్రజలకు వాణిజ్య కనెక్టివిటీని మరియు ప్రజల సంబంధాలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రభుత్వం యొక్క ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ కింద ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుంది: శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 09 MAY 2023 2:59PM by PIB Hyderabad

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరియు మయన్మార్ రిపబ్లిక్ ఆఫ్ యూనియన్‌కు చెందిన ఉప ప్రధాన మంత్రి మరియు రవాణా & కమ్యూనికేషన్ల మంత్రి అడ్మిరల్ టిన్ ఆంగ్ సాన్‌లు  ఈరోజు మయన్మార్‌లోని రఖైన్ స్టేట్‌లో సిట్వే పోర్ట్‌ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుండి ఫ్లాగ్ ఆఫ్ చేయబడిన మొదటి భారతీయ కార్గో షిప్‌కు వారు స్వాగతం పలికారు.

సిట్వే పోర్ట్ కార్యాచరణ ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుంది. పోర్ట్ అందించిన గ్రేటర్ కనెక్టివిటీ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మరియు మెరుగైన వృద్ధి అవకాశాలకు దారి తీస్తుంది.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి మాట్లాడుతూ భారతదేశం మరియు మయన్మార్‌ల మధ్య ముఖ్యంగా మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం మధ్య ఉన్న సన్నిహిత చారిత్రక, సాంస్కృతిక మరియు ఆర్థిక సంబంధాలను ఎత్తిచూపారు. సిట్వే పోర్ట్ వంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మయన్మార్ ప్రజల అభివృద్ధి మరియు శ్రేయస్సు పట్ల భారతదేశ  దీర్ఘకాల నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

మయన్మార్‌లోని కలదాన్ నది ద్వారా హల్దియా / కోల్‌కతాతో పాటు ఇతర భారతీయ ఓడరేవులతో మిజోరాంకు ప్రత్యామ్నాయ కనెక్టివిటీని అందించడానికి ఈ ప్రాజెక్ట్ రూపొందించబడింది. ప్రాజెక్ట్ మిజోరాం నుండి పలేత్వా (మయన్మార్) వరకు హైవే/రోడ్డు రవాణా, ఆ తర్వాత ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ (ఐడబ్లూటి) ద్వారా పలేత్వా నుండి సిట్వే (మయన్మార్) వరకు మరియు సిట్వే నుండి భారతదేశంలోని ఏదైనా ఓడరేవుకు సముద్ర షిప్పింగ్ ద్వారా అందించబడుతుంది. ప్రాజెక్ట్ క్రింది విభాగాలను కలిగి ఉంటుంది (ఇండెక్స్ మ్యాప్ కూడా జతచేయబడింది):

 

క్రమ సంఖ్య

స్ట్రెచ్

మోడ్

దూరం

(ఎ)

హల్దియా నుండి మయన్మార్‌లోని సిట్వే పోర్ట్

షిప్పింగ్

539 కి.మీ

(బి)

సిట్వే నుండి పలేత్వా (నది కలదాన్ )

ఐడబ్ల్యూటీ

158 కి.మీ

(సి)

పలేత్వా నుండి ఇండో-మయన్మార్ సరిహద్దు (మయన్మార్‌లో)

రోడ్డు

110 కి.మీ

(డి)

ఇండో-మయన్మార్ సరిహద్దు నుండి ఎన్‌హెచ్.54 (భారతదేశంలో)

రోడ్డు

100 కి.మీ


image.png

 

సిట్వే నౌకాశ్రయం కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (కెఎంటిటిపి)లో భాగంగా భారత ప్రభుత్వం నుండి  నిధులు సమకూర్చి అభివృద్ధి చేయబడింది.కెఎంటిటిపి జలమార్గం మరియు రహదారి భాగాలు పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత సిట్వే నౌకాశ్రయం ద్వారా భారతదేశ తూర్పు తీరాన్ని ఈశాన్య రాష్ట్రాలకు కలుపుతుంది.

image.png
image.png


 

*****



(Release ID: 1923013) Visitor Counter : 162