ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్య ప్రదేశ్ లోని ఖర్ గోన్ లో జరిగినరహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండిపరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు
Posted On:
09 MAY 2023 11:39AM by PIB Hyderabad
మధ్య ప్రదేశ్ లోని ఖర్ గోన్ లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,
‘‘ఖర్ గోన్ లో జరిగిన రహదారి దుర్ఘటన అత్యంత దుఃఖదాయకం. ఈ దుర్ఘటన లో ఆప్తుల ను కోల్పోయినటువంటి వ్యక్తుల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డవారంతా త్వరగా పునఃస్వస్థులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ లో స్థానిక పాలన యంత్రాంగం ఈ సమయం లో చేతనైన అన్ని విధాలు గాను సాయపడడం లో తలమునకలు గా ఉంది: ప్రధాన మంత్రి’’
‘‘మధ్య ప్రదేశ్ లోని ఖర్ గోన్ లో జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటన లో మృతుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. గాయపడ్డ వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
***
DS/SH
(Release ID: 1922732)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam