రైల్వే మంత్రిత్వ శాఖ
2023 ఏప్రిల్ నెలలో 126.46 ఎంటీల సరకు రవాణాతో రికార్డ్ సృష్టించిన రైల్వే శాఖ
2022 ఏప్రిల్ గణాంకాలతో పోలిస్తే 2023 ఏప్రిల్ నెలలో పెరిగిన లోడింగ్ 4.25 ఎంటీలు, ఇది 3.5% వృద్ధి
2022 ఏప్రిల్‌లోని సరకు రవాణా ఆదాయం రూ.13,011తో పోలిస్తే, 2023 ఏప్రిల్‌లో రూ.13,893 కోట్లు ఆర్జన, ఇది 7% వృద్ధి
प्रविष्टि तिथि:
08 MAY 2023 2:35PM by PIB Hyderabad
2023 ఏప్రిల్ నెలలో, నెలవారీ సరకు రవాణాలో 126.46 ఎంటీల రవాణాతో రైల్వే శాఖ రికార్డ్ సృష్టించింది. 2022 ఏప్రిల్ గణాంకాలతో పోలిస్తే 2023 ఏప్రిల్ నెలలో పెరిగిన లోడింగ్ 4.25 ఎంటీలు పెరిగింది, ఇది 3.5% వృద్ధి. 2022 ఏప్రిల్‌లోని సరకు రవాణా ఆదాయం రూ.13,011తో పోలిస్తే, 2023 ఏప్రిల్‌లో రూ.13,893 కోట్లు ఆర్జించింది, ఇది 7% వృద్ధి.
బొగ్గు రవాణాలో 2022 ఏప్రిల్‌లోని 58.35 ఎంటీలతో పోలిస్తే, 2023 ఏప్రిల్‌లో 62.39 ఎంటీల లోడ్ సాధించింది,. ఆ తర్వాత ఇనుప ఖనిజం 14.49 ఎంటీలు, సిమెంట్ 12.60 ఎంటీలు, ఇతర సరుకులు 9.03 ఎంటీలు, ఉక్కు 5.64 ఎంటీలు, ఆహార ధాన్యాలు 5.11 ఎంటీలు, ఖనిజ నూనెలు 4.05 ఎంటీలు, ఎరువులు 3.90 ఎంటీలు రవాణా చేసింది.
“హంగ్రీ ఫర్ కార్గో” నినాదంతో సులభతర వ్యాపారం కోసం, పోటీ ధరలతో డెలివరీ సేవలు అందించడానికి రైల్వే శాఖ నిరంతర ప్రయత్నాలు చేసింది. ఫలితంగా, సాంప్రదాయ & సాంప్రదాయేతర సరకు రవాణాలో కొత్త ఆర్డర్లు వస్తున్నాయి.
***
(रिलीज़ आईडी: 1922568)
आगंतुक पटल : 221