ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకలలోపాల్గొన్న ప్రధాన మంత్రి
‘‘స్వామి వివేకానంద హౌజ్ ఇంట్ ధ్యానం చేయడం చాలా ప్రత్యేకమైన అనుభవం; ఇప్పుడు నేను ప్రేరణ పొంది శక్తివంతంగా ఉన్నాను‘‘
'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తితోనే రామకృష్ణ మఠం పని చేస్తోంది‘
“స్వామి వివేకానంద సిద్ధాంతాల స్ఫూర్తితోనే మా పాలన సాగుతోంది‘‘
“స్వామి వివేకానంద తన దార్శనికతను నెరవేర్చడానికి భారతదేశం చేస్తున్న కృషిని సగర్వంగా చూస్తున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను‘‘
“"అమృత్ కాల్ ఐదు భావాలను- పాంచ్ ప్రాణ్ - ఇముడ్చుకోవడం చేయడం ద్వారా గొప్ప విషయాలను సాధించడానికి ఉపయోగపడుతుంది ‘‘
Posted On:
08 APR 2023 6:35PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో వివేకానంద హౌజ్ లో శ్రీ రామకృష్ణ మఠం 125వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. సభాస్థలికి చేరుకున్న ప్రధాని స్వామి వివేకానంద గదిలో పుష్పాంజలి ఘటించి పూజ, ధ్యానం చేశారు. ఈ సందర్భంగా పవిత్ర త్రయంపై రాసిన పుస్తకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
1897లో స్వామి రామకృష్ణానంద చెన్నైలో ప్రారంభించిన ఆధ్యాత్మిక సంస్థలు.- రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్- వివిధ రూపాల్లో మానవతా, సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, చెన్నైలో రామకృష్ణ మఠ్ సర్వీస్ 125వ వార్షికోత్సవానికి
హజరైనందుకు సంతోషంగా ఉందని, రామకృష్ణ మఠాన్ని తన జీవితంలో ఎంతో గౌరవిస్తానని అన్నారు.
తమిళులు, తమిళ భాష, తమిళ సంస్కృతి, చెన్నై వైబ్ పట్ల తనకున్న అభిమానాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తూ, పాశ్చాత్య దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత చెన్నైలోని స్వామి వివేకానంద ఇంటిని సందర్శించడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఈ ఇంట్లో ధ్యానం చేయడం తనకు చాలా ప్రత్యేకమైన అనుభవం అని, ఇప్పుడు తాను స్ఫూర్తి పొందానని, శక్తివంతునిగా మారినట్టు భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రాచీన ఆలోచనలను యువతరానికి చేరవేయడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు.
తిరువళ్లువార్ శ్లోకాన్ని ఉటంకిస్తూ, ఈ లోకంలోను, దేవుళ్ళ లోకంలోను దయను మించినది ఏదీ లేదని ప్రధాని వివరించారు. తమిళనాడులోని రామకృష్ణ మఠం సేవా రంగాల గురించి ప్రస్తావిస్తూ, విద్య, గ్రంథాలయాలు, కుష్టువ్యాధి అవగాహన , పునరావాసం, ఆరోగ్య సంరక్షణ, నర్సింగ్ ,గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఉదాహరణలను ప్రధాన మంత్రి వివరించారు. రామకృష్ణ మఠం సేవకు ముందు స్వామి వివేకానందపై తమిళనాడు చూపిన ప్రభావమే వెలుగులోకి వచ్చిందన్నారు. స్వామి వివేకానంద కన్యాకుమారిలోని ప్రసిద్ధ శిల వద్ద తన జీవిత లక్ష్యాన్ని కనుగొన్నారని, అది ఆయనను మార్చిందని, దాని ప్రభావాన్ని చికాగోలో చూడవచ్చని ఆయన వివరించారు. స్వామి వివేకానంద మొదట తమిళనాడులోని పవిత్ర భూమిలో కాలుమోపారని ఆయన గుర్తు చేశారు. రామనాడ్ రాజు ఆయనను తనను ఎంతో గౌరవంగా స్వాగతించారని, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెంచ్ రచయిత రొమైన్ రోలాండ్ ఈ సందర్భాన్ని పదిహేడు విజయ తోరణాలు ఏర్పాటు చేసి వారం రోజుల పాటు ప్రజా జీవనాన్ని నిలిపివేసిన పండుగగా అభివర్ణించారని ప్రధాని గుర్తు చేశారు.
స్వామి వివేకానంద బెంగాల్ కు చెందినవాడని, అయితే భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందే తమిళనాడులో ఆయనకు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్న ప్రధాన మంత్రి, వేలాది సంవత్సరాలుగా భారతదేశం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' భావనను ప్రతిబింబించే ఒక దేశంగా దేశ ప్రజలకు చాలా స్పష్టమైన భావన ఉందని ఉద్ఘాటించారు. రామకృష్ణ మఠం కూడా అదే స్ఫూర్తితో పని చేస్తోందని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే అనేక సంస్థలు భారతదేశం అంతటా విస్తరించి ఉన్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. కాశీ-తమిళ సంగమం విజయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. సౌరాష్ట్ర-తమిళ సంగమం కూడా జరగబోతోందని తెలియజేశారు.
"స్వామి వివేకానంద సిద్ధాంతాల నుండి స్ఫూర్తి పొంది మా పాలన సాగుతోంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. హక్కులు విచ్ఛిన్నమైనప్పుడు, సమానత్వం లభించినప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందన్న స్వామి వివేకానంద దార్శనికతను సారూప్యంగా చూపిస్తూ, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలన్నింటి లోనూ ఇదే దార్శనికత వర్తిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గతంలో కనీస సౌకర్యాలను సైతం సౌకర్యాలుగా భావించేవారని, కొద్దిమందికి లేదా చిన్న సమూహాలకు మాత్రమే వీటిని అనుమతించేవారని గుర్తు చేశారు.
కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ద్వారాలు తెరుచుకున్నాయని ప్రధాని అన్నారు. మన అత్యంత విజయవంతమైన పథకాలలో ఒకటైన ముద్ర యోజన నేడు 8వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని, ఈ పథకంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన తమిళనాడుకు చెందిన చిన్న పారిశ్రామికవేత్తల కృషిని ఆయన వివరించారు. "భారీ సంఖ్యలో మహిళలు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలతో సహా చిన్న పారిశ్రామికవేత్తలకు దాదాపు 38 కోట్ల పూచీకత్తు లేని రుణాలు ఇవ్వబడ్డాయి" అని ప్రధాన మంత్రి తెలియజేశారు. వ్యాపారం కోసం బ్యాంకు రుణం పొందడం గతంలో ఒక ప్రత్యేకత అని, కానీ ఇప్పుడు దాని ప్రాప్యతను పెంచామని ఆయన పునరుద్ఘాటించారు. అదేవిధంగా ఇల్లు, విద్యుత్, ఎల్పీజీ కనెక్షన్లు, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వస్తువులు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని ప్రధాని తెలిపారు.
'స్వామి వివేకానందకు భారతదేశం గురించి గొప్ప దార్శనికత ఉంది. ఈ రోజు, ఆయన తన దార్శనికతను నెరవేర్చడానికి భారతదేశం కృషి చేయడాన్ని సగర్వంగా చూస్తున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇది మన సమయం అని ప్రతి భారతీయుడు భావిస్తున్నారని, ఇది భారతదేశ శతాబ్దం అవుతుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. " మనం విశ్వాసం పరస్పర గౌరవంతో ప్రపంచంతో నిమగ్నమవుతాము", అని ఆయన అన్నారు.
మహిళలకు సహాయం చేయడానికి మనం ఎవరూ లేమని, సరైన వేదిక ఉన్నప్పుడు, మహిళలు సమాజాన్ని నడిపిస్తారని, సమస్యలను తామే పరిష్కరిస్తారన్న స్వామీజీ బోధనలను గుర్తు చేసిన ప్రధాన మంత్రి, నేటి భారతదేశం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని విశ్వసిస్తుందని ఉద్ఘాటించారు.
"స్టార్టప్ లు లేదా క్రీడలు, సాయుధ దళాలు లేదా ఉన్నత విద్య ఏదైనా సరే, మహిళలు అడ్డంకులను బద్దలు కొడుతున్నారు ,రికార్డులు సృష్టిస్తున్నారు" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు, ఫిట్ నెస్ కీలకమని స్వామిజీ విశ్వసించారని, నేడు సమాజం క్రీడలను కేవలం ఒక అదనపు కార్యకలాపంగా కాకుండా ప్రొఫెషనల్ ఎంపికగా చూడటం ప్రారంభించిందని ఆయన అన్నారు. యోగా, ఫిట్ ఇండియా ప్రజా ఉద్యమాలుగా మారాయని గుర్తు చేశారు. ప్రపంచ ఉత్తమ విధానాలను భారతదేశానికి తీసుకురావడానికి విద్యా రంగాన్ని సంస్కరించిన జాతీయ విద్యావిధానాన్ని ఆయన ప్రస్తావించారు విద్య ద్వారా సాధికారత సాధించవచ్చన్న స్వామిజీ నమ్మకాన్ని , సాంకేతిక, శాస్త్రీయ విద్య ఆవశ్యకతను ప్రస్తావించారు.నేడు స్కిల్ డెవలప్ మెంట్ కు అపూర్వమైన మద్దతు లభించింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సాంకేతిక, శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థలలో మనది ఒకటి "అని ఆయన అన్నారు.
ఐదు భావాలను ఆకళింపు చేసుకుని వాటితో సంపూర్ణంగా జీవించడం కూడా చాలా శక్తివంతమైనదని స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తు చేసిన ప్రధాన మంత్రి, మనం కేవలం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకున్నామని, రాబోయే 25 సంవత్సరాలను అమృత్ కాలంగా మార్చడం పై దేశం దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. "పంచ ప్రాణ్ ‘ అనే ఐదు భావాలను సమ్మిళితం చేయడం ద్వారా ఈ అమృత్ కాల్ గొప్ప విషయాలను సాధించడానికి ఉపయోగపడుతుంది. వలసవాద మనస్తత్వ ఆనవాళ్లను తొలగించడం, మన వారసత్వాన్ని జరుపుకోవడం, ఐక్యతను బలోపేతం చేయడం ,మన విధులపై దృష్టి పెట్టడం అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాలు" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రసంగాన్ని ముగిస్టూ, ప్రధాని ఈ ఐదు సూత్రాలను అనుసరించాలని ప్రతి ఒక్కరూ సమిష్టిగా, వ్యక్తిగతంగా సంకల్పించాలని కోరారు. 140 కోట్ల మంది ప్రజలు ఇటువంటి సంకల్పం చేస్తే, 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి , సమ్మిళిత భారతదేశాన్ని నిర్మించగలం" అని అన్నారు.
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, రామకృష్ణ మఠం ఉపాధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఎల్.మురుగన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1922472)
Visitor Counter : 162
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam