రక్షణ మంత్రిత్వ శాఖ
సుడాన్ నుంచి దాదాపు 24 గంటల నిరవధిక ప్రయాణంతో ఐఏఎఫ్ సి-17 ద్వారా వ్యూహాత్మక సహాయక ఆపరేషన్
Posted On:
06 MAY 2023 9:55AM by PIB Hyderabad
భారత వైమానిక దళానికి చెందిన సి-17 గ్లోబ్ మాస్టర్ విమానం ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి సమయంలో హిందాన్ నుంచి బయలు దేరింది, రాత్రంతా ప్రయాణించి సౌదీ అరేబియాలోని జెడ్డాలో తెల్లవారుజామున దిగింది. యుద్ధ ప్రభావిత సూడాన్ చిక్కుకున్న భారతీయులను తిరిగి భారతదేశానికి తీసుకు రావడానికి, జెడ్డా వద్దే ఇంధనాన్ని నింపుకుంది. సూడాన్‌లో ఇంధనం అందుబాటులో లేకపోవడం, ఇంధనం నింపడంలో ఆలస్యాన్ని నివారించడానికి జెడ్డా వద్దే అదనపు ఇంధనాన్ని తీసుకుంది. ఈ విమానంలో 192 మంది ప్రయాణీకులు ఉన్నారు, వాళ్లలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు. వారంతా ఎన్‌ఆర్‌ఐలు, విదేశీ పౌరులు, ఓసీఐలు (భారతదేశ విదేశీ పౌరులు). వారిని జెడ్డాకు తీసుకెళ్లడం సాధ్యం కాదు, నిరవధిక ప్రయాణం ద్వారా నేరుగా భారతదేశానికి తరలించాల్సిన అవసరం ఉంది.
సూడాన్ వద్ద, ఈ భారీ జెట్‌ను ల్యాండ్ చేయడానికి యుద్ధ దాడి విధానాన్ని అనుసరించింది. ఎందుకంటే, ఆ ప్రదేశం నుంచి త్వరగా తిరిగి వెళ్లిపోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
ఈ ఆపరేషన్ సమయంలో, ప్రయాణీకుల్లో ఒకరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని ముందుగా ఊహించకపోయినా, విమాన సిబ్బంది దానిని సమర్థవంతంగా నిర్వహించారు. అతని ఆరోగ్య పరిస్థితి కుదుటబడే వరకు సంపూర్ణ ఆక్సిజన్ అందించారు.
విమానం ఈ నెల 4వ తేదీ సాయంత్రం తర్వాత అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయింది, అదే రోజు అర్థరాత్రి హిందాన్‌లో దిగింది. సూడాన్‌లో చిక్కుకుపోయిన స్వదేశీయుల్లో చివరి వ్యక్తిని కూడా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి వైమానిక దళ సిబ్బంది దాదాపు 24 గంటల పాటు నిరవధిక విధుల్లో ఉన్నారు.
***
(Release ID: 1922281)
Visitor Counter : 212