హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రకాశ్ సింగ్ బాదల్ 'అంతిమ్ అర్దాస్'లో పాల్గొని పంజాబ్ లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ వద్ద ఆయనకు తుది నివాళులు అర్పించిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి ఒక్క పంజాబ్ కే కాదు యావత్ దేశ రాజకీయ, సామాజిక నాయకత్వానికి తీరని లోటు: అమిత్ షా

శ్రీ బాదల్ మరణంతో సిక్కు సమాజం నిజమైన సైనికుడిని కోల్పోయింది, దేశం ఒక దేశభక్తుడిని కోల్పోయింది, రైతులు నిజమైన సానుభూతిపరుని కోల్పోయారు. రాజకీయాలు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన గొప్ప వ్యక్తిని కోల్పోయాయి: అమిత్ షా

శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ తో సమావేశాల నుంచి ఎంతో నేర్చుకున్నాను; ఆయన ఎల్లప్పుడూ నిజమైన మార్గాన్ని చూపడానికి ప్రయత్నించారు; శ్రీ బాదల్ వంటి గొప్ప వ్యక్తి తప్ప మరెవరూ రాజకీయ జీవితంలో అంత పారదర్శకతతో సలహాలు ఇవ్వలేరు; కేంద్ర హోం మంత్రి

‘శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ కొత్త పంజాబ్ కు పునాది వేశారు, ఆయన మరణంతో సోదరభావం కలిగిన సర్దార్ మనకు దూరమయ్యారు; ఆయన తన జీవితమంతా హిందూ-సిక్కు ఐక్యతకు అంకితం చేశారు’

‘రాజకీయాల్లో అనేక వ్యతిరేకతలను ఎదుర్కొన్నప్పటికీ, బాదల్ సాహెబ్ ఎల్లప్పుడూ అందరినీ ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నించారు, ప్రజా రాజకీయ జీవితంలో అలాంటి వ్యక్తిని కనుగొనడం అసాధ్యం’

‘ఎమర్జెన్సీ సమయంలో, శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి గట్టిగా నిలబడ్డా

Posted On: 04 MAY 2023 3:58PM by PIB Hyderabad

కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ 'అంతిమ్ అర్దాస్'లో పాల్గొని, పంజాబ్ లోని శ్రీ ముక్త్సర్ సాహిబ్ వద్ద ఆయనకు అంతిమ నివాళులు అర్పించారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001U30J.jpg

 

శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ మరణంతో పంజాబ్ మాత్రమే కాకుండా యావత్ దేశ రాజకీయ, సామాజిక నాయకత్వానికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని శ్రీ అమిత్ షా అన్నారు.శ్రీ బాదల్ మరణంతో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడం చాలా కష్టమని ఆయన అన్నారు. శ్రీ బాదల్ మరణంతో సిక్కు సమాజం నిజమైన సైనికుడిని కోల్పోయిందని, దేశం ఒక దేశభక్తుడిని కోల్పోయిందని, రైతులు నిజమైన సానుభూతిపరుడిని కోల్పోయారని, రాజకీయాలు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన గొప్ప వ్యక్తిని కోల్పోయాయని శ్రీ షా అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002D723.jpg

 

ప్రకాశ్ సింగ్ బాదల్ కు 70 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితం ఉందని, బాదల్ సాహెబ్ తప్ప మరెవరూ ప్రత్యర్ధులు లేకుండా అలాంటి జీవితాన్ని గడపలేరని కేంద్ర హోంమంత్రి అన్నారు. శ్రీ బాదల్ తో  సమావేశం నుండి తాను ఎల్లప్పుడూ నేర్చుకున్నానని, ఆయన  ఎల్లప్పుడూ నిజమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నించారని శ్రీ షా అన్నారు.రాజకీయ జీవితంలో బాదల్ లాంటి మహానుభావులు తప్ప మరెవరూ పారదర్శకతతో సలహాలు ఇవ్వలేరని అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HB3V.jpg

 

శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ శాసనసభలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి అని, శ్రీ బాదల్ 5 సార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేసి న్యూ పంజాబ్ కు పునాది వేశారని శ్రీ అమిత్ షా అన్నారు. ‘ఆయన మరణంతో సోదర భావం కలిగిన సర్దార్ మనకు దూరమయ్యారు. శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ తన జీవితమంతా హిందూ-సిక్కు ఐక్యతకు అంకితం చేశారు . రాజకీయాల్లో అనేక వ్యతిరేకతలను ఎదుర్కొన్నప్పటికీ, బాదల్ సాహెబ్ ఎల్లప్పుడూ అందరినీ ఐక్యంగా ఉంచడానికి ప్రయత్నించారు’ అని శ్రీ షా అన్నారు. ప్రజా, రాజకీయ జీవితంలో ఆయన అరుదైన నాయకుడని శ్రీ షా అన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L62O.jpg

 

1970 నుంచి నేటి వరకు దేశం తరఫున నిలబడే అవకాశం వచ్చినప్పుడల్లా బాదల్ సాహెబ్ వెనక్కి తగ్గలేదని కేంద్ర హోం మంత్రి అన్నారు. సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్ సిద్ధాంతాలు, మతాల కోసం పోరాడారని, తన ప్రజా జీవితంలో ఎక్కువ కాలం జైలులో గడిపారని ఆయన అన్నారు. ‘ఎమర్జెన్సీ సమయంలో, శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి గట్టిగా నిలబడ్డారు, అది కార్గిల్ యుద్ధం కావచ్చు లేదా ఉగ్రవాదంపై పోరాటం కావచ్చు, ప్రతి అంశంలో బాదల్ సాహెబ్ ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు కవచంలా నిలిచారు’ అని అన్నారు. బాదల్ సాహెబ్ మృతి యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. శ్రీ ప్రకాశ్ సింగ్ బాదల్  జీవితం నుండి మనమందరం స్ఫూర్తి పొందాలని, ఆయన మార్గంలో నడవడానికి వాహెగురు మనకు శక్తిని ఇవ్వాలని శ్రీ అమిత్ షా అన్నారు.

 

*****


(Release ID: 1922215) Visitor Counter : 149