యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్‌లో రేపు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2022 లోగో, మస్కట్, జెర్సీ మరియు గీతాన్ని విడుదల చేయనున్న శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు శ్రీ యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోతో పాటు వారణాసి, నోయిడా మరియు గోరఖ్‌పూర్‌లో జరగనున్న క్రీడలు
Posted On:
04 MAY 2023 3:27PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ మే 5న లక్నో గోమతినగర్‌లో గల ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 (కెఐయూజీ 2021)లోగో, జెర్సీ, మస్కట్ మరియు గీతాన్ని ఆవిష్కరించనున్నారు.
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 3వ ఎడిషన్ మే 23 నుండి జూన్ 3 వరకు జరుగుతుంది; లక్నోలోని బాబు బనారసి దాస్ యూనివర్సిటీలో మే 25న ప్రారంభోత్సవం జరగనుంది.
యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్, ఉత్తరప్రదేశ్ క్రీడల మంత్రి శ్రీ గిరీష్ చంద్ర యాదవ్ సహా ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
కెఐయూజీ రాబోయే ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాల నుండి 4700 కంటే ఎక్కువ మంది అథ్లెట్లు పాల్గొంటారని అంచనా వేయబడింది. మొత్తం భాగస్వామ్యం 7000కి చేరుకుంటుంది. ఈ ఎడిషన్‌లో ప్రదర్శించాల్సిన క్రీడా విభాగాల సంఖ్య 21. యూనివర్శిటీ గేమ్స్ చరిత్రలో ఇదే అత్యధికం. రోయింగ్ కూడా మొదటిసారిగా ప్రవేశపెట్టబడుతుంది.
లక్నో రాష్ట్ర రాజధానితో పాటు వారణాసి, నోయిడా మరియు గోరఖ్‌పూర్‌లలో ఈ క్రీడలు జరుగుతాయి. షూటింగ్ పోటీని న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా, రోయింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో భాగంగా ఉంటాయి. మల్లాఖంబ్ మరియు యోగాసన అనే రెండు స్వదేశీ క్రీడా విభాగాలు కర్ణాటకలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ యొక్క చివరి ఎడిషన్‌లో భాగంగా ఉన్నాయి మరియు ఈ ఎడిషన్‌లో కూడా భాగంగా ఉంటాయి. గేమ్‌లు డీడీ స్పోర్ట్స్ &ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.
***
(Release ID: 1921957)
Visitor Counter : 209