ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదహారో సివిల్ సర్వీసెస్ డే సంబంధి కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

Posted On: 21 APR 2023 1:26PM by PIB Hyderabad

పదహారో సివిల్ సర్వీసెస్ డే సందర్భం లో ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో ప్రభుత్వ ఉద్యోగుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చే ప్రధాన మంత్రి పురస్కారాల ను కూడా ఆయన ఈ సందర్భం లో ప్రదానం చేశారు. కొన్ని పుస్తకాల ను ఆయన ఆవిష్కరించారు.

 

సభికు లను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘సివిల్ సర్వీసెస్ డే’ ను పురస్కరించుకొని ప్రతి ఒక్కరి కీ అభినందనల ను తెలియ జేశారు. దేశం స్వాతంత్య్రం తాలూకు 75 సంవత్సరాల ను పూర్తి చేసుకోవడం తో పాటుగా అభివృద్ధి చెందినటువంటి ఒక భారతదేశం తాలూకు లక్ష్యాల ను, ఉద్దేశ్యాల ను సాధించడం కోసం ముందుకు సాగిపోవడాన్ని మొదలు పెట్టిన కారణం గా ఈ సంవత్సరం లో సివిల్ సర్వీసెస్ డే ఘట్టం మరింత విశిష్టం గా మారిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. 15-25 సంవత్సరాల కిందట ఉద్యోగం లో చేరిన ప్రభుత్వోద్యోగుల తోడ్పాటు ను ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. దీనితో పాటు ‘అమృత కాలం’ లో భాగం అయిన రాబోయే 25 సంవత్సరాల లో దేశ నిర్మాణ దిశ లో తోడ్పాటు ను అందించగల యువ అధికారుల పాత్ర ను గురించి ఆయన నొక్కిచెప్పారు. ఈ అమృత కాలం లో దేశ ప్రజల కు సేవ చేసే యువ అధికారులు అత్యంత సౌభాగ్యవంతులు అంటూ ప్రధాన మంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘‘దేశాని కి చెందిన ప్రతి ఒక్క స్వాతంత్య్ర యోధుని/ స్వాతంత్ర్య యోధురాలి యొక్క కలల ను పండించే బాధ్యత ప్రతి ఒక్కరి భుజస్కందాల పైన ఉంది’’ అంటూ ప్రధాన మంత్రి అభివర్ణించారు. కాలానికి కొదువ ఉంది గాని దేశం లో దక్షత , ధైర్యం మరియు సాహసాలు సమృద్ధం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.

 

 

గడచిన 9 సంవత్సరాల లో జరిగిన పనుల కారణం గా దేశం ఉవ్వెత్తున ఎగసేందుకు సిద్ధం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకు మునుపు ఉన్నటువంటి ఉద్యోగిస్వామ్యం మరియు సిబ్బంది ల ద్వారానే భిన్నమైన ఫలితాల ను పొందడం జరుగుతున్నది అని ఆయన అన్నారు. ప్రపంచ రంగస్థలం మీద దేశం యొక్క ప్రతిష్ట వృద్ధి చెందుతూ ఉండడం లో కర్మయోగుల భూమిక ను ఆయన గుర్తించారు. అలాగే, ‘సుశాసన్’ (సుపరిపాలన) పట్ల నిరుపేదల లో వృద్ధి చెందుతున్న విశ్వాసాన్ని గురించి మరియు దేశ అభివృద్ధి లో ఒక క్రొత్త గతి ని గురించి ఆయన ప్రస్తావించారు. ప్రపంచం లో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం పురోగమిస్తోంది అని ఆయన అన్నారు. డిజిటల్ ట్రాన్సాక్శన్స్ లో భారతదేశం అగ్రస్థానం లో ఉంటూ, ఫిన్ టెక్ రంగం లో ముందుకు సాగిపోతోంది; మొబైల్ డాటా చాలా చౌక గా ఉన్న దేశాల లో ఒక దేశం గా భారతదేశం ఉంది. ప్రపంచం లో మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ భారతదేశం లో ఉంది అని ఆయన అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో, రేల్ వేల లో, హైవేస్ లో , నౌకాశ్రయాల సామర్థ్యం పెంపుదల లో మరియు విమానాశ్రయాల సంఖ్య లో పరివర్తన ప్రధానమైనటువంటి మార్పు లు చోటుచేసుకొన్నాయి అని ఆయన అభివర్ణించారు. ఈ రోజు న ఇచ్చిన అవార్డు లు కర్మయోగుల తోడ్పాటు కు మరియు సేవా స్ఫూర్తి కి అద్దం పడుతున్నాయి అని ఆయన అన్నారు.

 

 

కిందటి ఏడాది ఆగస్టు 15 వ తేదీ నాడు ఎర్ర కోట బురుజుల నుండి ప్రధాన మంత్రి తాను ఇచ్చిన ఉపన్యాసాన్ని గుర్తు కు తీసుకు వస్తూ, ‘పాంచ్ ప్రణ్’ ను గురించి మరో మారు ప్రస్తావించారు. ఆ అయిదు అంశాల లో ‘వికసిత్ బారత్’ లేదా అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క ఆవిష్కారం; బానిస మనస్తత్వాన్ని బద్దలు కొట్టడం; భారతదేశం యొక్క వారసత్వాన్ని చూసుకొని గర్వించడం; దేశం లో ఏకత్వాన్ని మరియు భిన్నత్వాన్ని బలపరచడం తో పాటు గా వ్యక్తుల కర్తవ్యాల ను మిగతా అన్ని విషయాల కంటే మిన్న గా భావన చేయడం భాగం గా ఉన్నాయి అని ఆయన వివరించారు. ఈ అయిదు సంకల్పాల నుండి పుట్టేటటువంటి శక్తి దేశాన్ని ప్రపంచం లో తనదైన స్థానాని కి తీసుకు పోతుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ఈ సంవత్సరం లో సివిల్ సర్వీస్ డే కు తీసుకొన్న ఇతివృత్తం ‘వికసిత్ భారత్’ అనే ఆలోచన ఆధారం గా రూపుదిద్దుకొంది అని ప్రధాన మంత్రి చెప్తూ, వికసిత్ భారత్ అనే భావన ఆధునిక మౌలిక సదుపాయాల కే పరిమితం కాదు అన్నారు. ‘‘భారతదేశ ప్రభుత్వ వ్యవస్థ అనేది దేశం లోని ప్రతి ఒక్క వ్యక్తి తాలూకు మహత్వాకాంక్షల ను సమర్థించడం తో పాటుగా దేశం లో ప్రతి ఒక్కరు వారి వారి కలల ను నెరవేర్చుకోవడం లో ప్రతి ఒక్క ప్రభుత్వోద్యోగి సహాయం చేయడం అనేది కూడాను వికసిత్ భారత్ ఆవిష్కారాని కి ముఖ్యమైనటువంటిది అవుతుంది, మరి మునుపటి సంవత్సరాల వ్యవస్థ తో పెనవేసుకొన్నటువంటి ప్రతికూల స్థితి ఇక సకారాత్మకం గా మారిపోతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

భారతదేశం స్వాతంత్య్రం సంపాదించుకొన్న తరువాత దశాబ్దాల తరబడి గడించిన అనుభవాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ప్రభుత్వ పథకాల అమలు లో చివరి లబ్ధిదారు వరకు చేరుకోవడాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. గత కాలపు ప్రభుత్వాల విధానాల వల్ల వచ్చిన ఫలితాల తాలూకు ఉదాహరణల ను ఆయన చెప్తూ, నాలుగు కోట్ల కు పైగా అక్రమ గ్యాస్ కనెక్షన్ లు ఉండేవి; నాలుగు కోట్ల కు పై చిలుకు దొంగ రేశన్ కార్డు లు ఉండేవి; మహిళ లు మరియు బాల ల వికాసం మంత్రిత్వ శాఖ ద్వారా కల్పిత మహిళ లు మరియు బాల లు ఒక కోటి మంది కి సమర్థన ను ఇవ్వడం జరిగింది, దాదాపు గా 30 లక్షల మంది యువతీయువకుల కు అల్పసంఖ్యక వర్గాల మంత్రిత్వ శాఖ ద్వారా బూటకపు స్కాలర్ శిప్ లను ఇవ్వడం జరిగింది. జాడ లేనటువంటి శ్రమికుల కు ఎమ్ జిఎన్ఆర్ఇజిఎ లో భాగం గా ప్రయోజనాల ను బదలాయించడానికని లక్ష ల కొద్ది నకిలీ ఖాతాల ను తెరవడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విధమైన నకిలీ లబ్ధిదారుల ను సాకు గా చూపుతూ దేశం లో ఒక అవినీతిమయమైన వ్యవస్థ తల ఎత్తింది అని ఆయన అన్నారు. సుమారు గా 3 లక్షల కోట్ల రూపాయలు అనర్హుల చేతుల లోకి వెళ్ళిపోకుండా ఒక మార్పు ను తీసుకువచ్చిన ఖ్యాతి ప్రభుత్వోద్యోగుల కు దక్కుతుంది అని ఆయన అన్నారు. అదే ధనాన్ని ప్రస్తుతం పేద ప్రజల సంక్షేమం కోసం ఉపయోగించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి చెప్పారు.

 

 

 

కాలం పరిమితం గా ఉన్న వేళ లో ఏ పని ని చేయాలి, మరి ఆ పని ని ఎలా చేయాలి అనేది నిర్ణయించడం చాలా ముఖ్యమైంది గా మారుతుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘ఇవాళ్టి సవాలు ఏమిటి అంటే అది దక్షత ను గురించి న దాని కంటే లోటుపాటుల ను గుర్తించడం, మరి వాటి ని తొలగించడం ఎలాగ అన్నదే’’ అని ఆయన అన్నారు. లోపం యొక్క ముసుగు లో చిన్న అంశాన్ని అయినా సరే నియంత్రించాలి అని యత్నించిన కాలం అంటూ ఒకటి ఉండింది అని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ప్రస్తుతం అదే లోపాన్ని సామర్థ్యం గా మార్చుతూ ఉండడం మరియు వ్యవస్థ లో అడ్డంకు లను తీసి వేయడం జరుగుతోంది అని ఆయన చెప్పారు. ‘‘ఇంతకు ముందు, ప్రభుత్వమే అంతా చేస్తుంది అనే ఆలోచన విధానం అంటూ ఉండింది. ఇప్పుడు ఉన్న ఆలోచన విధానం ఏమిటి అంటే అది ప్రభుత్వం అందరి కోసం పని చేస్తుంది అనేదే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కాలాన్ని మరియు వనరుల ను అందరి కి సేవ చేయడం కోసం సమర్థమైన పద్ధతుల లో ఉపయోగించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ‘నేశన్ ఫస్ట్ - సిటిజన్ ఫస్ట్’ (‘దేశాని కి అగ్రతాంబులం, పౌరుల కు అగ్ర ప్రాధాన్యం’) అనేది ప్రభుత్వ ధ్యేయం గా ఉంది. వర్తమానం లో ప్రభుత్వం యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే అది ఆదరణ కు నోచుకోని వర్గాల వారి కి పెద్ద పీట ను వేయడం అనేదే అని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రభుత్వం మహత్వాకాంక్షయుక్త జిల్లా ల వరకు మరియు మహత్వాకాంక్షయుక్త బ్లాకు ల వరకు తరలి వెళ్తోంది అని ఆయన అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం సరిహద్దు ప్రాంత పల్లెల ను ఆఖరి గ్రామాల వలె గాక, మొట్టమొదటి గ్రామాలు గా చూస్తోంది అని ఆయన అన్నారు. ఏదైనా ఒక పథకం యొక్క ఫలాలు దేశ జనాభా లో లక్షిత వర్గాలు అన్నిటి కి అందాలి అంటే గనక మనం మరింత కఠోరం గా శ్రమించడం తో పాటుగా క్రొత్త క్రొత్త పరిష్కారాల ను కూడా అన్వేషించవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. నిరభ్యంతర పత్రాల (ఎన్ఒసి స్) కోసం అడుగుతున్న విభాగాలు మరియు వ్యవస్థ లో ఏదో ఒక చోట అందుబాటు లో ఉన్న సమాచారం తాలూకు ఉదాహరణల ను ఆయన ప్రస్తావించారు. ‘జీవించడం లో సౌలభ్యం’ మరియు ‘వ్యాపారం చేయడం లో సౌలభ్యం’.. వీటి ని సాధించాలి అంటే మనం తత్సంబంధి పరిష్కార మార్గాల ను కనుగొనాలి అని ఆయన అన్నారు.

లాగే దేశంలో కొనసాగే ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విషయంలోనైనా అన్ని గణాంక అంచెలనూ ఒకేచోట అందించే వేదికగా ‘పీఎం గతిశక్తి బృహత్‌ ప్రణాళిక’ను ఉదాహరిస్తూ ప్రధానమంత్రి వివరించారు. అందువల్ల సామాజిక రంగంలో మెరుగైన ప్రణాళికలు, వాటి అమలుకు ఈ వేదికను గరిష్ఠంగా వాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పౌర అవసరాల గుర్తింపు, విద్యారంగంలో తలెత్తే భవిష్యత్‌ సమస్యల పరిష్కారంలో వివిధ విభాగాలు, జిల్లాలు, సమితుల మధ్య సమాచార ఆదానప్రదానం మెరుగుసహా భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకూ ఇదెంతో ఉపయుక్తం కాగలదని ఆయన అన్నారు.

   అమృత కాలం మనకు గొప్ప అవకాశాలతోపాటు ఎన్నో సవాళ్లనూ మోసుకొచ్చిందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అయితే, వ్యవస్థలలో మార్పుల కోసం ఎక్కువ కాలం వేచి చూసే ధోరణి నేటి ఆకాంక్షభరిత పౌరులలో లేదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మనం సకల శక్తులూ కూడదీసుకుని కృషి చేయడం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు అంతర్జాతీయంగానూ భారత్‌పై అంచనాలు అనూహ్యంగా పెరిగినందున సత్వర నిర్ణయాలు-వాటి అమలు అత్యంత కీలకంగా మారిందని చెప్పారు. భారత శక్తిసామర్థ్యాల ప్రదర్శనకు ఇదే తరుణమని ప్రపంచం భావిస్తున్నందున దేశ అధికార యంత్రాంగం ఇక ఎంతమాత్రం సమయం వృథాచేసే పరిస్థితి లేదన్నారు. “దేశం మిమ్మల్ని ఎంతో విశ్వసిస్తోంది.. దాన్ని నిలబెట్టుకునేలా మీరు పనిచేయండి. మీ ప్రతి నిర్ణయానికీ సదా జాతీయ ప్రయోజనమే పరమావధి కావాలి” అని ఆయన నొక్కిచెప్పారు.

   ప్రజాస్వామ్యంలో విభిన్న సిద్ధాంతాలుగల రాజకీయ పార్టీల ప్రాధాన్యం, అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును అధికారంలోగల పార్టీ దేశ ప్రయోజనాల కోసం వెచ్చిస్తున్నదో/లేదో మూల్యాంకనం వేయాల్సిన అవసరాన్ని అధికార యంత్రాంగానికి నొక్కిచెప్పారు. “దేశ పాలన పగ్గాలు చేపట్టిన రాజకీయ పార్టీ పన్ను చెల్లింపుదారుల సొమ్మును తమ సొంత సంస్థ కోసం వాడుకుంటున్నదో లేక దేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నదో విశ్లేషించడం అధికార యంత్రాంగం కర్తవ్యం” అని విశదీకరించారు. “అది ఓటు బ్యాంకును సృష్టించుకోవడానికి ఆ సొమ్మును వాడుతున్నదా లేక పౌర జీవన సౌలభ్యం కోసం వెచ్చిస్తున్నదా; ప్రభుత్వ నిధులతో సొంత ప్రతిష్ట పెంచుకునే ప్రకటనలు ఇస్తున్నదా లేక ప్రజల్లో అవగాహన కోసం ప్రకటనలిస్తున్నదా; వివిధ సంస్థల్లో తమ పార్టీ కార్యకర్తలను నియమిస్తున్నదా లేక పారదర్శక నియామక ప్రక్రియను అనుసరిస్తున్నదా?” తదితరాలను కూడా విశ్లేషించాలని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా  పౌరసేవా యంత్రాంగాన్ని సర్దార్‌ పటేల్‌ ‘భారతదేశ ఉక్కు చట్రం’గా అభివర్ణించడాన్ని గుర్తుచేశారు. ఆ మేరకు అంచనాలకు తగినట్లుగా విధులు నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తదనుగుణంగా పన్ను చెల్లింపుదారుల సొమ్ము సద్వినియోగంతోపాటు యువత కలలు ఛిద్రం కాకుండా చూసే బాధ్యత వారిపై ఉందని స్పష్టం చేశారు.

   ప్రభుత్వ ఉద్యోగులకు జీవితం ముందుకు నడవడంలో రెండు పద్ధతులుంటాయని ప్రధానమంత్రి అన్నారు. వాటిలో ఒకటి- అన్నీ సవ్యంగా చేయడం కాగా, రెండోది- ఏదైతే అది అవుతుందనే ధోరణిలో వదిలేయడమని ప్రధాని వ్యాఖ్యానించారు. మొదటిది... క్రియాశీల ధోరణి కాగా, రెండోది నిష్క్రియాపరత్వాన్ని సూచిస్తుందని తెలిపారు. ఏదిఏమైనా పని పూర్తి కావాలనే పట్టుదల గలవారు క్రియాశీల పద్ధతిలో కర్తవ్య నిర్వహణకు సిద్ధమై తమ జట్లకు చోదకశక్తిగా మారుతారని తెలిపారు. “ప్రజా జీవనంలో మార్పు తేవాలన్న ఈ తపనతోనే మీరు చిరస్మరణీయ వారసత్వాన్ని అందించగలరు. మీ కోసం మీరు చేసే పనులకన్నా ప్రజా జీవనంలో మీరు తెచ్చిన మార్పులను బట్టి మిమ్మల్ని అందరూ అంచనా వేస్తారు” అని ప్రధానమంత్రి కర్మయోగులకు హితవు పలికారు. కాబట్టి, “సుపరిపాలన కీలకం. ప్రజాకేంద్రక పాలన అన్ని సమస్యలనూ పరిష్కరించి, మెరుగైన ఫలితాలిస్తుంది” అని ఆయన అన్నారు. సుపరిపాలన, శక్తిమంతులైన యువ అధికారుల కృషి ఫలితంగా అనేక అభివృద్ధి కొలబద్దల రీత్యా ఇతర జిల్లాలతో పోలిస్తే మెరుగ్గా పనిచేస్తున్న ఆకాంక్షాత్మక జిల్లాల గురించి ఈ సందర్భంగా ఆయన ఉదాహరించారు. ప్రజల భాగస్వామ్యంపై దృష్టి సారిస్తే ప్రజల్లో యాజమాన్య భావన ఏర్పడి, అద్భుత ఫలితాలిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్, అమృత సరోవర్, జల్ జీవన్ మిషన్‌ వంటివి ఇందుకు నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు.

   జిల్లా ప్రణాళికలు@100 రూపకల్పనను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ పంచాయతీల స్థాయి వరకూ ఇలాంటి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఆ మేరకు పంచాయతీలు, సమితులు, జిల్లాలుసహా రాష్ట్రంలో ఏయే రంగాలపై దృష్టి సారించాలి; పెట్టుబడులు రప్పించేందుకు ఏ మార్పులు చేయాలి; ఎగుమతుల కోసం ఎలాంటి ఉత్పత్తుల తయారీ చేపట్టాలి; వగైరాలన్నిటిపైనా విస్పష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా ‘ఎంఎస్‌ఎంఇ’ స్వయం-సహాయ సమూహాల గొలుసును అనుసంధానించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అలాగే “స్థానిక ప్రతిభను ప్రోత్సహించడం, స్థానిక వ్యవస్థాపకతను, అంకుర సంస్కృతిని ప్రోత్సహించడం మీకందరికీ చాలా ముఖ్యం” అని ప్రధాని స్పష్టం చేశారు.

   రెండు దశాబ్దాలకుపైగా తాను ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న నేపథ్యంలో పౌర సేవా యంత్రాంగంతో కలసి పనిచేసే అవకాశం లభించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. సామర్థ్య వికాసం గురించి నొక్కిచెబుతూ- పౌరసేవా యంత్రాంగం సిబ్బందిలో ‘మిషన్ కర్మయోగి’ భారీ ఉద్యమంగా రూపొందిందని చెప్పారు. సామర్థ్య వికాస కమిషన్‌ ఈ ఉద్యమాన్ని శక్తివంచన లేకుండా ముందుకు నడిపిస్తున్నదని తెలిపారు. “సివిల్ సర్వెంట్ల సంపూర్ణ సామర్థ్య వినియోగమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం” అని ఆయన స్పష్టం చేశారు. ప్రతిచోటా నాణ్యమైన శిక్షణ సరంజామా అందుబాటులో ఉండేలా ‘ఐగాట్‌’ (iGOT) వేదిక రూపొందిందని తెలిపారు. అయితే, శిక్షణ-అభ్యాసం ఏదో కొన్ని నెలలపాటు సాగే మొక్కుబడి తంతుగా మారకూడదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “ప్రస్తుతం నియామకం పొందినవారంతా ‘కర్మయోగి ప్రారంభ్‌’ పునశ్చరణ మాడ్యూల్‌ ద్వారా ‘ఐగాట్‌’ వేదికపై శిక్షణ పొందుతున్నారు” అని శ్రీ మోదీ తెలిపారు.

   ధికార సోపానక్రమం విధానాన్ని తొలగించే దిశగా ప్రభుత్వ కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, శిక్షణలోగల అధికారులను తాను నిరంతరం కలుస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. కొత్త ఆలోచనల సృష్టి ధ్యేయంగా ఆయా విభాగాల్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం పెంపు నిమిత్తం నిర్వహిస్తున్న మేధోమథన శిబిరాలను ఆయన ఉదాహరించారు. తొలినాళ్లలో అధికారులు రాష్ట్రాల్లో పనిచేసిన తర్వాతే డిప్యుటేషన్‌పై కేంద్ర ప్రభుత్వంలో పని అనుభవం పొందాల్సిన పరిస్థితి ఉండేదని ప్రధాని గుర్తుచేశారు. ఈ సమస్య పరిష్కారం దిశగా ‘అసిస్టెంట్ సెక్రటరీ కార్యక్రమం’ చేపట్టామని ఆయన తెలిపారు. తద్వారా యువ ఐఎఎస్‌లు నేడు తమ ఉద్యోగ జీవితం తొలినాళ్లలోనే కేంద్రంలో పనిచేసే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు.

   రాబోయే 25 ఏళ్ల అమృత ప్రయాణాన్ని ‘కర్తవ్య సమయం’గా పరిగణిస్తామని ప్రధానమంత్రి చెప్పారు. “విధి నిర్వహణకు మనం అగ్ర ప్రాధాన్యం ఇచ్చినప్పుడే స్వాతంత్ర్య శతాబ్దం దేశానికి స్వర్ణ శతాబ్ది కాగలదు. కర్తవ్యమంటే మనకో ఎంపిక కాదు... అదొక దృఢ సంకల్పం” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “ఇది సత్వర మార్పుల సమయం. ఆ మేరకు మీ పాత్రేమిటో మీ హక్కుల ద్వారా కాకుండా విధులు-వాటి నిర్వహణ తీరును బట్టి నిర్ణయించబడుతుంది. నవ భారతంలో దేశ పౌరుల శక్తే కాకుండా మొత్తంగా దేశం శక్తి కూడా ఇనుమడించింది. ఈ నవ, వర్ధమాన భారతంలో కీలక పాత్ర పోషించే అవకాశం మీకు లభించింది” అన్నారు.

    చివరగా- స్వాతంత్ర్య శతాబ్దిలో దేశం సాధించిన విజయాల చరిత్ర విశ్లేషణలో తమ ప్రాధాన్యాన్ని అంతర్భాగం చేయగల అవకాశం యువ పౌరసేవా అధికారులు నేడు పొందుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. “దేశం కోసం కొత్త వ్యవస్థల రూపకల్పనలో, ఉన్నవాటిని మెరుగుపరచడంలో నా వంతు పాత్రను నేను పోషించానని మీరు సగర్వంగా చెప్పగలరు. ఆ మేరకు దేశ నిర్మాణంలో మీ పాత్రను మీరు కచ్చితంగా మరింత విస్తృతం చేయగలరని నేను విశ్వసిస్తున్నాను” అని శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో కేంద్ర సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి శ్రీ పి.కె.మిశ్రా, కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా, పాలన సంస్కరణలు-ప్రజా ఫిర్యాదుల శాఖ కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.

నేపథ్యం

   దేశ ప్రగతిలో పౌరసేవా యంత్రాంగం సహకారాన్ని ప్రధానమంత్రి నిరంతరం ప్రశంసిస్తుంటారు. ఈ నేపథ్యంలో తన ప్రసంగం ద్వారా వారు మరింత అంకితభావంతో శ్రమించేలా స్ఫూర్తి రగిలించారు. దేశమంతటాగల పౌరసేవా అధికారులకు ప్రేరణనివ్వడంలో ఈ కార్యక్రమం ప్రధానమంత్రి ఓ సముచిత వేదికగా నిలిచింది. తద్వారా ప్రస్తుత అమృత కాలం కీలక సమయంలో వారు అదే ఉత్సాహంతో దేశ సేవకు నిబద్ధులవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పరిపాలనలో విశిష్ట సేవలందించిన అధికారులను ‘ప్రధానమంత్రి పురస్కారం’తో ప్రధాని సత్కరించారు. సామాన్య పౌరుల సంక్షేమం లక్ష్యంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా జిల్లాలు-సంస్థల పరిధిలోని కొనసాగుతున్న కృషిని గుర్తించి, గౌరవించడమే ఈ పురస్కారం ఉద్దేశం.

    పురస్కారం కింద నాలుగు గుర్తింపు పొందిన కార్యక్రమాల అమలుకు చేసిన కృషి ప్రాతిపదికగా విజేతలను ఎంపిక చేశారు. అవేమిటంటే- “హర్‌ఘర్‌ జల్‌ యోజన ద్వారా పరిశుభ్ర నీటి సరఫరా; ఆరోగ్య-శ్రేయో కేంద్రాల ద్వారా స్వచ్ఛభారత్‌కు ప్రోత్సాహం; సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా సమీకృత-సమాన తరగతి గది పర్యావరణంతో విద్యకు ప్రోత్సాహం; ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం ద్వారా సంపూర్ణ ప్రగతి; మొత్తంమీద సంతృప్త స్థాయిలో పథకాల అమలుపై దృష్టి సారించి ముందుకు సాగడం పరమావధిగా ఉంటుంది. తదనుగుణంగా ఈ నాలుగు కార్యక్రమాలకు సంబంధించి 8 పురస్కారాలతోపాటు వినూత్న ఆవిష్కరణలకు మరో 7 పురస్కారాలను ప్రధానమంత్రి అందజేశారు.

 

*****

 



(Release ID: 1921139) Visitor Counter : 189