ఆయుష్
మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఆయుష్‌కు సానుకూల స్పందన .. శ్రీ సర్బానంద సోనోవాల్
'ఆయుష్ రంగంపై మన్ కీ బాత్ ప్రభావం' అనే అంశంపై ప్రత్యేక సంచిక ప్రచురించిన జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్
Posted On:
28 APR 2023 3:13PM by PIB Hyderabad
'ఆయుష్ రంగంపై మన్ కీ బాత్ ప్రభావం' అనే అంశంపై సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సంచికను ప్రచురించింది. ఆయుష్, ఓడరేవులు, నౌకా రవాణా జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రధానమంత్రి నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల ఆయుష్ రంగానికి సానుకూల స్పందన లభించిందని అన్నారు. వినూత్నంగా ప్రజలతో మమేకం అవుతూ ప్రధానమంత్రి నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని శ్రీ సోనోవాల్ అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రస్తావించిన ఆయుష్ అంశాలతో ప్రత్యేక సంచిక రూపొందిందన్నారు.
దాదాపు 37 “మన్ కీ బాత్” ఎపిసోడ్‌లలో ఆయుష్ అంశాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, యోగాను అభ్యసించాలని , ఆయుర్వేదాన్ని అవలంబించాలని, ఆయుర్వేదంలో ప్రస్తావించిన జీవన విధానాన్ని అనుసరించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక సార్లు సూచించారు. ప్రధానమంత్రి ప్రసంగాల నుంచి స్ఫూర్తి పొందిన దేశ ప్రజలు ఆయుష్ వైద్య విధానం పట్ల మొగ్గు చూపుతున్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సంప్రదాయ భారతీయ వైద్య విధానాల ప్రయోజనాలపై అవగాహన పెరిగింది.
గత 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయుష్ ను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాల ఆధారంగా ప్రత్యేక సంచిక రూపొందింది. జాతీయ ఆరోగ్య విధానం, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఆయుష్ పోషిస్తున్న పాత్రను సంచికలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య విధానం- ప్రజారోగ్యం, శాస్త్రం-సాక్ష్యం, వైద్య విద్య- అవగాహన, యోగ-స్వస్థవృత్తా (జీవనశైలి, వ్యాయామం, ఆహారం, పోషకాహారం),కరోనా నిర్మూలనకు అమలు చేసిన కార్యక్రమం,పరిశ్రమ-విద్యా రంగాల సహకారం, ప్రపంచీకరణ- అంతర్జాతీయ సహకారం అంశాల ఆధారంగా ప్రత్యేక సంచిక రూపొందింది.
ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్ ప్రత్యేక సందేశాలు,ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా, ప్రముఖ విద్యావేత్తలు (డాక్టర్ బిఎన్ గంగాధర్, ఎన్‌ఎంసి,మాజీ డైరెక్టర్ నిమ్హాన్స్), పరిశ్రమ (పతంజలికి చెందిన ఆచార్య బాలకృష్ణ లాగా, ఇమామీ కి చెందిన డాక్టర్ సి కె కటియార్), పరిశోధన (సిఎస్‌ఐఆర్-టికెడిఎల్ కి చెందిన డాక్టర్ విశ్వజనని సత్తిగేరిL), వైద్యులు, నిపుణులు (డా. రాజేంద్ర ఎ బద్వే, డైరెక్టర్, టాటా మెమోరియల్ సెంటర్, ముంబై), బయోటెక్నాలజీ నిపుణులు (కల్పనా జోషి, ప్రొఫెసర్ మరియు హెడ్ బయోటెక్నాలజీ, సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయం), అంతర్జాతీయ నిపుణులు, ఆయుష్ రంగానికి చెందిన నిపుణులు (జర్మనీ, స్వీడన్ ,అమెరికా) రాసిన వ్యాసాలను సంచికలో పొందుపరిచారు.
జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ప్రచురిస్తోంది. శాస్త్ర రంగానికి చెందిన నిపుణులు జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ను ఆదరిస్తున్నారు. యూజీసీ-కేర్ గుర్తించిన జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ను మూడు నెలలకు ఒకసారి వెలువడే జర్నల్ ప్రింట్ , ఆన్‌లైన్ విధానంలో లభిస్తుంది. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, సిద్ధ, హోమియోపతి రంగాల్లో జరుగుతున్న పరిశోధన పత్రాలు జర్నల్ లో ప్రచురిస్తారు. వోల్టర్స్ క్లూవర్ హెల్త్‌లో భాగంగా జర్నల్‌ను మెడ్‌క్నో ప్రచురిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 450 కి మించి మెడికల్ జర్నల్‌లను ప్రచురిస్తున్న సంస్థగా మెడ్‌క్నో గుర్తింపు పొందింది.
***
(Release ID: 1920911)
Visitor Counter : 148