ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 వ సంవత్సరం ఏప్రిల్ 30 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 100 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 30 APR 2023 11:47AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ఈ రోజు న జరుగుతున్నది ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) (‘మనసు లో మాట’ కార్యక్రమం) వందో భాగం. మీ వద్ద నుండి వేల కొద్దీ ఉత్తరాలు అందాయి. లక్షల సందేశాలు వచ్చాయి. వీలైనన్ని ఎక్కువ ఉత్తరాల ను చదవడానికి, చూడడానికి మరియు సందేశాల ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ లేఖల ను చదువుతున్నప్పుడు చాలా సారు లు ఉద్వేగాని కి గురి అయ్యాను. భావోద్వేగాల తో నిండిపోయాను. భావోద్వేగాల లో మునిగిపోయాను. నన్ను నేను సంబాళించుకున్నాను. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) 100 వ భాగం సందర్భం లో మీరు నన్ను అభినందించారు. కానీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను.. నిజాని కి అభినందనల కు అర్హులు మీరు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) యొక్క శ్రోత లు.. మన దేశ వాసులు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కోట్ల కొద్దీ భారతీయుల ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం). వారందరి భావాల వ్యక్తీకరణ.

 

మిత్రులారా, 2014 వ సంవత్సరం లో అక్టోబర్ 3 వ తేదీ న విజయదశమి పండుగ. మనం అందరం కలసి ఆ విజయ దశమి రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) యాత్ర ను ప్రారంభించాం. విజయదశమి అంటే చెడు పై మంచి- విజయం సాధించిన పండుగ. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కూడా దేశ ప్రజల ఉత్తమ కార్యాలు, సకారాత్మకత ల యొక్క ప్రత్యేకమైనటువంటి పండుగ గా మారింది. ప్రతి నెలా వచ్చే పండుగ. దాని కోసం అందరం ఎదురుచూస్తాం. మనం ఇందులో సకారాత్మకత ను, ప్రజల భాగస్వామ్యాన్ని ఉత్సవం గా జరుపుకొంటాం. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఇన్ని నెలల ను, ఇన్ని సంవత్సరాల ను పూర్తి చేసుకొంది అంటే కొన్ని సారు లు నమ్మడం కష్టం. ప్రతి భాగం ప్రత్యేకమైంది గా మారింది. ప్రతి సారి క్రొత్త ఉదాహరణ ల నూతనత్వం. ప్రతి సారి దేశవాసుల కొత్త విజయాల విస్తరణ. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో దేశం లోని నలు మూలల ప్రజలు, అన్ని వయస్సు ల వారు చేరారు. బేటీ బచావో- బేటీ పఢావో అంశం కానివ్వండి. స్వచ్ఛ్ భారత్ ఉద్యమం కానివ్వండి. ఖాదీ పై ప్రేమ లేదా ప్రకృతి పై ప్రేమ కానివ్వండి. స్వాతంత్ర్య అమృత మహోత్సవం లేదా అమృత సరోవర్ కానివ్వండి. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో ప్రస్తావించిన ఏ అంశం అయినా ప్రజా ఉద్యమం గా మారిపోయింది. అలా మీరు చేశారు. నేను అప్పటి అమెరికా అధ్యక్షుడు శ్రీ బరాక్ ఒబామా విషయాన్ని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో పంచుకొన్నప్పుడు అది ప్రపంచవ్యాప్తం గా చర్చనీయాంశం అయింది.

 

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) నాకు ఇతరుల ఉత్తమ గుణాల ను ఆరాధించడం లాంటిది. నాకు ఒక మార్గదర్శకుడు ఉండే వారు. ఆయనే శ్రీ లక్ష్మణరావు జీ ఇనామ్‌దార్. ఆయన ను వకీల్ సాహెబ్ అని మేం పిలిచే వారం. ఎదుటి వారి గుణాల ను పూజించాలి అని ఆయన ఎప్పుడూ చెప్తుండే వారు. ఎదుటి వారు వారు ఎవరైనా సరే- మీ మిత్రులు అయినా సరే, మీ ప్రత్యర్థులు అయినా సరే. వారి మంచి గుణాల ను తెలుసుకొని వారి నుండి నేర్చుకొనేందుకు ప్రయత్నించాలి. ఆయన చెప్పిన ఈ విషయం నాకు ఎప్పుడూ స్ఫూర్తి ని ఇస్తుంది. ఇతరుల గుణాల నుండి నేర్చుకొనేందుకు గొప్ప మాధ్యం గా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) మారిపోయింది.

 

ప్రియమైన నా దేశప్రజలారా, ఈ కార్యక్రమం మీ నుండి నన్ను ఎప్పటికీ దూరం కానివ్వలేదు. నాకు జ్ఞ‌ాపకం ఉంది- నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అక్కడి సామాన్య ప్రజల ను కలుసుకోవడం, వారితో మమేకం కావడం సహజం గా జరిగేది. ముఖ్యమంత్రి పని తీరు, పదవీకాలం ఇలాగే ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ 2014 లో దిల్లీ కి వచ్చిన తరువాత ఇక్కడి జీవితం చాలా భిన్నం గా ఉంటుంది అని తెలుసుకొన్నాను. పని స్వభావం వేరు. బాధ్యత వేరు. పరిస్థితుల బంధనాలు. భద్రత కవచాలు. కాలపరిమితులు. తొలి రోజుల్లో ఏదో భిన్నం గా అనిపించింది. ఖాళీ- ఖాళీ గా అనిపించింది. ఏభయ్ సంవత్సరాల క్రిందట నేను నా ఇంటి ని ఎందుకు వీడలేదు అంటే ఒక నాడు నా స్వదేశం లోని ప్రజల తోనే సంబంధం కష్టం అయిపోతుంది కాబట్టి అని. ఏ దేశ ప్రజలయితే నా సర్వస్వమో నేను వారి నుండి వేరు పడి జీవించ లేను. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) నాకు ఈ సవాలు ను ఎదురొడ్డేందుకు ఒక పరిష్కారాన్ని అందించింది. సామాన్య మానవుల తో భేటీ అయ్యే దారి ర్గాన్ని చూపించింది. కార్యాలయ భారాలు, ప్రోటోకాల్ వ్యవస్థ కే పరిమితం అయ్యాయి. ప్రజల ఉద్వేగాలు, కోట్ల కొద్దీ జనుల తోడు .. వీటి తో నా మనోభావాలు ప్రపంచం లోని విడదీయ రానటువంటి భాగాలు అయ్యాయి. ప్రతి నెలా నేను దేశ ప్రజల నుండి వేలకొద్దీ సందేశాల ను చదువుతాను. ప్రతి నెలా నేను దేశవాసుల ఒక అద్భుతమైన స్వరూపాన్ని చూస్తాను. దేశప్రజల తపస్సు, త్యాగాల తాలూకు పతాక స్థాయి ని నేను గమనిస్తున్నాను, అనుభూతి చెందుతున్నాను. నేను మీకు కొద్దిగా కూడా దూరం గా ఉన్నాననే భావన నా లో ఎంత మాత్రం లేదు. నా దృష్టి లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కేవలం ఒక కార్యక్రమం కాదు. నాకు ఇది విశ్వాసం, ఆరాధన, వ్రతం. దైవ పూజ కు వెళ్లినప్పుడు ప్రజలు ప్రసాదం పళ్లేన్ని తీసుకు పోతారు. అలాగే నా దృష్టి లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ప్రజా దేవుళ్ల చరణాల లో అర్పించే ప్రసాదం లాంటిది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) నా మనసు లోని ఆధ్యాత్మిక యాత్ర గా మారిపోయింది.

 

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) వ్యక్తి నుండి సమష్టి దశ కు సాగే ప్రయాణం.

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) అహం నుండి సామూహిక చేతన సాగే కు ప్రస్థానం.

ఇదయితే నేను కాదు- మీరే దీనికి సంస్కార సాధన గా ఉన్నారు అని చెప్పాలి.

 

మీరు ఊహించండి. నా దేశవాసులు కొందరు 40-40 సంవత్సరాలు గా జనావాసం లేని కొండల పైన, బంజరు భూముల లోను మొక్కల ను నాటుతున్నారు. చాలా మంది ప్రజలు 30-30 సంవత్సరాలు గా జల సంరక్షణ కోసం మెట్ల బావులను, చెరువుల ను తవ్విస్తున్నారు, వాటి ని శుభ్రం చేస్తున్నారు. కొందరు 25-30 ఏళ్లు గా పేద పిల్లల కు పాఠాలు బోధిస్తున్నారు. మరికొందరు పేదల చికిత్స లో సహాయం చేస్తున్నారు. ఈ విషయాల ను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో చాలా సారు లు ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యాను. ఆకాశవాణి సహచరులు దీని ని చాలా సారు లు మళ్ళీ మళ్ళీ రికార్డు చేయవలసి వచ్చింది. ఈ రోజు న గతం కళ్ల ఎదుట కనిపిస్తున్నది. దేశప్రజల ఈ ప్రయాస లు నన్ను నిరంతరం శ్రమించేటట్టు గా ప్రేరణ ను ఇచ్చాయి.

 

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో మనం ప్రస్తావించే వ్యక్తులంతా ఈ కార్యక్రమాన్ని సజీవం గా మార్చినటువంటి మన వీరులు అని చెప్పుకోవాలి. ఈ రోజు న మనం వందో ఎపిసోడ్ మైలురాయి ని చేరుకొన్న సందర్భం లో ఈ హీరో ల ప్రయాణాన్ని గురించి తెలుసుకోవడానికి మనం మరో సారి వారి దగ్గర కు వెళ్లాలి అనేదే నా కోరిక. ఈ రోజు న కొంతమంది మిత్రుల తో మాట్లాడేందుకు మనం ప్రయత్నిద్దాం. హరియాణా కు చెందిన సోదరుడు సునీల్ జగ్ లాన్ గారు ఈ రోజు న మన తో జత పడుతున్నారు. హరియాణా లో పురుషులు, మహిళల నిష్పత్తి పైన చాలా చర్చ జరిగేది. నేను కూడా 'బేటీ బచావో-బేటీ పఢావో' ప్రచారాన్ని హరియాణా నుండే ప్రారంభించాను. అందువల్లే సునీల్ జగ్ లాన్ గారు నా మనస్సు పైన ఎంతో ప్రభావాన్ని చూపారు. సునీల్ గారి ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను కూడా ఆయన దగ్గర నేర్చుకొని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో చేర్చాను. కొద్ది కాలం లోనే కూతురు తో సెల్ఫీ ప్రపంచ స్థాయి ప్రచారోద్యమం గా రూపుదాల్చింది. మరి ఇందులో ముఖ్య విషయం సెల్ఫీ కాదు, అలాగని సాంకేతికత కూడా కాదు. దీని లో కూతురు కు పెద్దపీట ను వేయడమైంది. జీవనం లో కుమార్తె యొక్క స్థానం ఎంత ప్రధానమైందనేది సైతం ఈ ప్రచార ఉద్యమం ద్వారా వెల్లడి అయింది. ఇటువంటి అనేక ప్రయాస ల ఫలితం గా ప్రస్తుతం హరియాణా లో స్త్రీ, పురుష నిష్పత్తి మెరుగు పడింది. రండి, ఈ రోజు న సునీల్ గారి తో కొన్ని ఊసులు ఆడుదాం.

 

ప్రధాన మంత్రి గారు: నమస్కారం సునీల్ గారు..

 

సునీల్ గారు: నమస్కారం సర్. మీ మాట విన్న తరువాత నా ఆనందం చాలా పెరిగింది సర్.

 

ప్రధాన మంత్రి గారు: సునీల్ గారూ... ‘సెల్ఫీ విత్ డాటర్’ అందరికీ గుర్తుంది. ఇప్పుడు మళ్లీ దాని ని గురించి చర్చిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?

 

సునీల్ గారు: ప్రధాన మంత్రి గారూ... నిజాని కి అమ్మాయి ల ముఖాల లో చిరునవ్వుల ను నింపేందుకు మా రాష్ట్రం హరియాణా నుండి ప్రారంభించి, దేశం అంతటికీ విస్తరించిన నాలుగో పానీపత్ యుద్ధం నాతో పాటు గా ప్రతి ఒక్క ఆడపిల్లల తండ్రి కి కూడాను చాలా ముఖ్యమైంది. పుత్రికల ను ప్రేమించే తండ్రుల కు ఇది పెద్ద విషయం.

ప్రధాన మంత్రి గారు: సునీల్ జీ.. మీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజుల్లో ఏం చేస్తోంది?

 

సునీల్ గారు: సర్. నా కూతుళ్లు ఇద్దరు.. నందిని, యాచిక. ఒకరు 7 వ తరగతి, ఒకరు 4 వ తరగతి చదువుతున్నారు. మీకు వీరాభిమానులు సర్. ‘థాంక్ యు ప్రైం మినిస్టర్’ అంటూ తమ క్లాస్ మేట్స్ తో మీకు లేఖల ను కూడా వాళ్ళు వ్రాయించారు సర్.

 

ప్రధాన మంత్రి గారు: వహ్వా! మీ అమ్మాయిల కు మా తరఫు న, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోత ల తరఫు న బోలెడన్ని ఆశీర్వాదాల ను అందించండి.

సునీల్ గారు: చాలా చాలా ధన్యవాదాలు సర్. మీ వల్ల దేశం లోని ఆడపిల్లల వదనాల లో చిరునవ్వులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

 

ప్రధాన మంత్రి గారు: చాలా ధన్యవాదాలు సునీల్ జీ..

 

సునీల్ గారు: అయ్యా ధన్యవాదాలండి.

 

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో దేశం లోని నారీ శక్తి కి సంబంధించిన వందల కొద్దీ స్పూర్తిదాయకమైనటువంటి కథనాల ను ప్రస్తావించినందుకు నేను చాలా సంతృప్తి చెందాను. మనం ఛత్తీస్‌గఢ్‌లోని దేవుర్ గ్రామ మహిళల ను గురించి చర్చించినట్టుగానే మన సైన్యం అయినా, క్రీడా ప్రపంచం అయినా -నేను మహిళ ల కార్యసాధనల ను గురించి మాట్లాడినపుడల్లా అనేక ప్రశంస లు వచ్చాయి. ఈ దేవుర్ గ్రామ మహిళ లు స్వయం సహాయ సమూహాల ద్వారా గ్రామ కూడళ్ల ను, రహదారుల ను, దేవాలయాల ను శుభ్రం చేయడానికి ప్రచారాన్ని నిర్వహిస్తారు. అదే విధం గా వేల కొద్దీ పర్యావరణ హిత టెర్రకోట కప్స్ ను ఎగుమతి చేసిన తమిళ నాడు ఆదివాసి మహిళ ల నుండి దేశం చాలా ప్రేరణ ను పొందింది. తమిళ నాడు లోనే 20 వేల మంది మహిళ లు ఏకమై వేలూరు లోని నాగ నది ని పునరుజ్జీవింపజేశారు. ఈ తరహా అనేక ప్రచారాల కు మన నారీ శక్తి నాయకత్వాన్ని వహించింది. వారి ప్రయత్నాల ను తెర ముందు కు తీసుకు రావడానికి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) వేదిక గా మారింది.

 

మిత్రులారా, ఇప్పుడు మనతో ఫోన్ లైన్‌ లోకి మరో ఉత్తములు వచ్చి ఉన్నారు. ఆయన పేరు మంజూర్ అహమద్ గారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో జమ్ము- కశ్మీర్ పెన్సిల్ స్లేట్స్ ను గురించి తెలియజెప్తున్న సందర్భం లో మంజూర్ అహ్మద్ గారి ప్రస్తావన వచ్చింది.

 

ప్రధాన మంత్రి గారు: మంజూర్ జీ.. మీరు ఎలా ఉన్నారు?

మంజూర్ గారు : థాంక్యూ సర్.. చాలా బాగున్నాం సర్.

ప్రధాన మంత్రి గారు: ఈ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) యొక్క వందో భాగం లో మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది అనిపిస్తోంది.

 

మంజూర్ గారు: థాంక్యూ సర్.

 

ప్రధాన మంత్రి గారు: పెన్సిల్-స్లేట్‌ ల పని ఎలా నడుస్తోంది?

 

మంజూర్ గారు: చాలా బాగా జరుగుతోంది సర్. మీరు మా గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో చెప్పారు అప్పటి నుండి పని చాలా పెరిగిపోయింది సర్. మరి ఇతరుల కు కూడా ఉపాధి ఇక్కడ చాలా పెరిగింది ఈ పని లో.

 

ప్రధాన మంత్రి గారు: ఎంత మంది కి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందంటారు?

మంజూర్ గారు: ఇప్పుడు నా దగ్గర రెండు వంద ల మంది కి పైగా ఉన్నారు..

ప్రధాన మంత్రి గారు: భలే! నాకు చాలా సంతోషం గా ఉంది.

 

మంజూర్ గారు: అవును సర్.. మరండీ .. ఇప్పుడు నేను ఇంకా ఒకటి రెండు నెలల్లో దీనిని పెంచాలనుకొంటున్నాను. మరో 200 మంది కి ఉపాధి లభిస్తుంది సర్.

 

ప్రధాన మంత్రి గారు: వావ్! చూడండి మంజూర్ గారూ..

మంజూర్ గారు: సర్..

ప్రధాన మంత్రి గారు: నాకు బాగా గుర్తుంది.. దీని వల్ల మీ పని కి గాని, మీకు గాని ఎటువంటి గుర్తింపూ లేదు అని మీరు చెప్పడం. మీరు చాలా బాధ లు, ఇబ్బందులు పడవలసి వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు గుర్తింపు కూడా వచ్చింది. రెండు వందల మంది కి పైగా ఉపాధి ని కల్పిస్తున్నారు.

మంజూర్ గారు: అవును సర్... అవును సర్.

 

ప్రధాన మంత్రి గారు: మీరు క్రొత్త విస్తరణల తో, 200 మంది కి బ్రతుకుదెరువు ను చూపుతున్నారు. ఎంతో గొప్ప సంతోషకరమైన కబురు ను చెప్పారు మీరు.

మంజూర్ గారు: ఇక్కడ ఉన్న రైతుల కు కూడా అప్పటి నుండి చాలా ప్రయోజనం కలిగింది సర్. ఒకప్పుడు 2000 రూపాయలు విలువ చేసే చెట్టు విలువ ఇప్పుడు 5000 రూపాయల కు చేరింది సర్. అప్పటి నుండి ఇందులో డిమాండ్ చాలా పెరిగింది. ఇది దాని సొంత గుర్తింపు గా కూడా మారింది సర్. ఇప్పుడు నాకు చాలా ఆర్డర్‌ లు ఉన్నాయి సర్. ఇప్పుడు నేను ఒకటి, రెండు నెలల్లో మరింత విస్తరించాలనుకొంటున్నాను. ఇక్కడి రెండు నుండి నాలుగు ఊళ్ళ లో రెండొందల నుండి రెండున్నర వందల మంది యువతీ యువకుల కు జీవనోపాధి ని కూడా కల్పించవచ్చు సర్.

ప్రధాన మంత్రి గారు: చూడండి మంజూర్ జీ.. వోకల్ ఫార్ లోకల్ శక్తి ఎంత అద్భుతమైందో మీరు చేతల లో నిరూపించారు.

మంజూర్ గారు: మరే సర్.

ప్రధాన మంత్రి గారు: మీకు మరియు గ్రామం లోని రైతులు అందరి కి, ఇంకా మీ తో కలసి పని చేస్తున్నటువంటి సహచరులు అందరి కి నా తరఫు న అనేకానేక శుభాకాంక్ష లు. ధన్యవాదాలు సోదరా.

మంజూర్ గారు: ధన్యవాదాలు సర్.

 

మిత్రులారా, మన దేశం లో ఎంతో మంది ప్రతిభావంతులు వారి శ్రమ శక్తి తో విజయ శిఖరాల కు చేరుకొన్నారు. నాకు జ్ఞ‌ాపకం ఉంది- విశాఖపట్నం నుండి వెంకట్ మురళీ ప్రసాద్ గారు ఆత్మ నిర్భర్ భారత్ చార్ట్ ను శేర్ చేసిన విషయం. ఆయన భారతీయ ఉత్పత్తుల ను మాత్రమే ఎలా గరిష్ఠం గా ఉపయోగిస్తారో చెప్పారు. బేతియా కు చెందిన ప్రమోద్ గారు ఎల్‌ఇడి బల్బు ను తయారు చేసేందుకు చిన్న యూనిటు ను ఏర్పాటు చేసినప్పుడు, గఢ్ ముక్తేశ్వర్‌ కు చెందిన సంతోష్ గారు చాపల ను తయారు చేయడం ప్రారంభించినప్పుడు వారి ఉత్పత్తుల ను అందరి ముందుకు తీసుకు రావడానికి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) మాధ్యం గా మారింది. మేక్ ఇన్ ఇండియా నుండి స్పేస్ స్టార్ట్ అప్‌ స్ వరకు చాలా ఉదాహరణల ను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో చర్చించాం.

 

మిత్రులారా, మణిపుర్ కు చెందిన ఓ సోదరి విజయశాంతి దేవి గారి ని గురించి కూడా ను నేను కొన్ని ఎపిసోడ్‌ ల క్రితం ప్రస్తావించడం మీకు గుర్తుండే ఉంటుంది. విజయశాంతి గారు తామర పీచు తో వస్త్రాల ను తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన పర్యావరణ అనుకూల ఆలోచన ను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో చర్చించాం. దాంతో వారి పని మరింత ప్రజాదరణ పొందింది. ఈరోజు న విజయశాంతి గారు ఫోన్‌ లో మనతో ఉన్నారు.

ప్రధాన మంత్రి గారు: నమస్తే విజయశాంతి గారూ..! మీరు ఎలా ఉన్నారు?

విజయశాంతి గారు: సర్.. నేను బాగున్నాను.

ప్రధాన మంత్రి గారు: మీ పని ఎలా జరుగుతోంది?

విజయశాంతి గారు: సర్… ఇప్పటికీ 30 మంది మహిళల తో కలసి పనిచేస్తున్నాను.

ప్రధాన మంత్రి గారు: ఇంత తక్కువ సమయం లో మీరు 30 మంది వ్యక్తుల బృంద స్థాయి కి చేరుకొన్నారు.

విజయశాంతి గారు: అవును సర్. ఈ సంవత్సరం కూడా మా ప్రాంతం లో 100 మంది మహిళల తో మరింత విస్తరిస్తున్నాను.

ప్రధాన మంత్రి గారు: కాబట్టి మీ లక్ష్యం 100 మంది మహిళలన్నమాట.

విజయశాంతి గారు: అవును సర్! 100 మంది మహిళ లు.

ప్రధాన మంత్రి గారు: ఇప్పుడు ప్రజల కు ఈ తామర కాండం ఫైబర్ ను గురించి బాగా తెలుసు

విజయశాంతి గారు: అవును సర్. భారతదేశం అంతటా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కార్యక్రమం ద్వారా అందరికీ తెలుసు.

ప్రధాన మంత్రి గారు: ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందింది.

విజయశాంతి గారు: అవును సర్.. ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లోటస్ ఫైబర్ గురించి తెలుసు.

ప్రధాన మంత్రి గారు: అంటే ఇప్పుడు బజారు ను కూడా ఏర్పరచుకొన్నారనుకుంటాను?

విజయశాంతి గారు: అవును సర్. నాకు యుఎస్ఎ నుండి మార్కెటు ఆర్డర్ లభించింది. వారు పెద్ద మొత్తం లో, చాలా పరిమాణం లో కొనుగోలు చేయాలని అనుకొంటున్నారు. అయితే నేను ఈ సంవత్సరం నుండి యుఎస్ఎ కు కూడా పంపాలనుకొంటున్నాను.

ప్రధాన మంత్రి గారు: ఓ. ఇక మీరు ఎగుమతిదారు అన్నమాట?

విజయశాంతి గారు: అవును సర్. ఈ సంవత్సరం నుండి నేను మన ఉత్పాదన అయినటువంటి మేడ్ ఇన్ ఇండియా లోటస్ ఫైబర్ ను ఎగుమతి చేస్తాను.

ప్రధాన మంత్రి గారు: అది, నేను వోకల్ ఫార్ లోకల్ అన్నానంటే ఇప్పుడు అది లోకల్ ఫార్ గ్లోబల్ అయిందా ఏమిటి.

విజయశాంతి గారు: అవును సర్. నేను నా ఉత్పాదన తో ప్రపంచం అంతటి కి చేరుకోవాలి అని అనుకొంటున్నాను.

ప్రధాన మంత్రి గారు: అభినందనలు. విష్ యూ బెస్టాఫ్ లక్.

విజయశాంతి గారు: ధన్యవాదాలు సర్

ప్రధాన మంత్రి గారు: ధన్యవాదాలు, ధన్యవాదాలు విజయశాంతి గారూ..

విజయశాంతి గారు: థాంక్ యు సర్

 

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాని కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ద్వారా అనేక ప్రజా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి, జోరు ను అందుకొన్నాయి. ఉదాహరణ కు మన ఆటబొమ్మ ల పరిశ్రమ ను తిరిగి ఉన్నత స్థాయి లో స్థాపించే లక్ష్యం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)తో మాత్రమే మొదలైంది. భారతీయ జాతి శునకాలు, మన దేశీయ కుక్కల ను గురించిన అవగాహన కల్పించడం కూడా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) తో ప్రారంభమైంది. నిరుపేద చిన్న దుకాణదారుల తో బేరాలు ఆడం అని, గొడవ లు పెట్టుకోబోం అని మరో ప్రచారాన్ని మొదలుపెట్టాం. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం ప్రారంభమైనప్పుడు కూడా ఈ సంకల్పం తో దేశప్రజల ను జోడించడం లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) చక్కటి పాత్ర ను పోషించింది. ఇటువంటి ప్రతి ఉదాహరణ సమాజం లో మార్పునకు కారణం అయింది. ఇలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే పని ని ప్రదీప్ సాంగ్ వాన్ గారు కూడా చేపట్టారు. ప్రదీప్ సాంగ్ వాన్ గారి 'హీలింగ్ హిమాలయాస్' ప్రచారాన్ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో చర్చించాం. ఆయన ఇప్పుడు ఫోన్ లైన్‌ లో మన తో చేరారు.

 

మోదీ గారు: ప్రదీప్ గారూ.. నమస్కారం.

ప్రదీప్ గారు: సర్ జయ్ హింద్.

మోదీ గారు: జయ్ హింద్, జయ్ హింద్, సోదరా. ఎలా ఉన్నారు మీరు?

ప్రదీప్ గారు: చాలా బాగున్నాను సర్. మీ మాటల ను విని, ఇంకా బాగున్నాను సర్.

మోదీ గారు: మీరు హిమాలయాల ను బాగు చేయాలి అని తలచారు.

ప్రదీప్ గారు: అవును సర్.

మోదీ గారు: ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఈ రోజుల్లో మీ ఉద్యమం ఎలా సాగుతోంది?

ప్రదీప్ గారు: సర్... చాలా బాగా జరుగుతోంది. మనం గతం లో ఐదేళ్ల లో చేసే పని 2020 నుండి ఒక ఏడాది లో పూర్తి అయిపోతోంది సర్.

మోదీ గారు: ఓహ్!

ప్రదీప్ గారు: అవును.. అవును సర్. మొదట్లో నేను చాలా కంగారు పడ్డాను. జీవితాంతం ఇలా చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను. కానీ కొంత సహకారం లభించింది. 2020 వ సంవత్సరం వరకు చాలా కష్టపడ్డాం. ప్రజలు చాలా తక్కువ గా చేరారు. సహకరించని వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా మా ప్రచారం పైన ఏమంత శ్రద్ధ చూపలేదు. కానీ 2020 లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో ప్రస్తావించిన తరువాత చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు సంవత్సరాని కి 6-7 క్లీనింగ్ డ్రైవ్‌ల ను చేసే వారం. 10 క్లీనింగ్ డ్రైవ్‌లను చేసే వారం. ఇప్పుడు మేం ప్రతి రోజూ వేరు వేరు ప్రదేశాల నుండి ఐదు టన్ను ల చెత్త ను సేకరిస్తున్నాం.

మోదీ గారు: వాహ్!

ప్రదీప్ గారు: సర్.. నేను ఒకానొక సమయం లో దాదాపు ఈ పని ని వదలుకొనే దశ లో ఉన్నానంటే నమ్మండి సర్. ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో ప్రస్తావించిన తరువాత నా జీవనం లో చాలా మార్పు లు చోటుచేసుకొన్నాయి. ఊహించనంత వేగం గా మార్పులు జరిగాయి. మీరు మా వంటి వ్యక్తుల ను ఎలా కనుగొంటారో తెలియదు. నేను నిజం గా కృతజ్ఞుడి ని. ఇంత మారుమూల ప్రాంతం లో ఎవరు పని చేస్తారు? మేం హిమాలయ ప్రాంతం లో పని చేస్తున్నాం. ఇంత ఎత్తైన ప్రాంతం లో పని చేస్తున్నాం. అయినా మీరు మమ్మల్ని అక్కడ కనుగొన్నారు. మా పని ని ప్రపంచం ముందుంచారు. మన దేశ ప్రథమ సేవకుల తో మాట్లాడగలగడం ఆ రోజు, ఈ రోజు కూడా ఉద్వేగభరిత క్షణాలే. ఇంతకు మించిన అదృష్టం నాకు మరొకటి ఉండదు.

మోదీ గారు: ప్రదీప్ గారూ.. మీరు వాస్తవమైన అర్థం లో హిమాలయాల శిఖరాల పై సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీ పేరు వినగానే పర్వతాల పరిశుభ్రత ప్రచారం లో మీరు ఎలా పాల్గొంటున్నారో ప్రజలు గుర్తు పెట్టుకొంటారు అని నాకు కచ్చితం గా తెలుసును.

ప్రదీప్ గారు: అవును సర్.

మోదీ గారు: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక పెద్ద బృందం ఏర్పడుతోంది. మీరు ప్రతి రోజూ ఇంత భారీ స్థాయి లో పని చేస్తున్నారు.

ప్రదీప్ గారు: అవును సర్.

మోదీ గారు: నాకు పూర్తి నమ్మకం ఉంది.. మీ ప్రయత్నాలు, వాటిపై చర్చ ల కారణం గా ఇప్పుడు చాలా మంది పర్వతారోహకులు పరిశుభ్రత కు సంబంధించిన ఫోటోల ను పోస్టు చేయడం మొదలుపెట్టారు అని.

 

ప్రదీప్ గారు: అవును సర్! అనేకం.

మోదీ గారు: మీ వంటి మిత్రుల కృషి వల్ల వ్యర్థాలు కూడా సంపదే అనే సందేశం ఇప్పుడు ప్రజల మనస్సుల లో నాటుకు పోవడం మంచి విషయం. పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోంది. మనం గర్వించే హిమాలయాలు కూడా ఇప్పుడు రక్షణ ను పొందుతున్నాయి. ఇందులో సామాన్యులు కూడా కలుస్తున్నారు. ప్రదీప్ గారూ.. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు సోదరా.

ప్రదీప్ గారు: ధన్యవాదాలు సర్. థాంక్ యు సో మచ్. జయ్ హింద్.

 

మిత్రులారా, దేశం లో పర్యటన రంగం చాలా వేగం గా అభివృద్ధి చెందుతోంది. మన సహజ వనరులు కావచ్చు, నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, చెరువులు కావచ్చు లేదా మన పుణ్యక్షేత్రాలు కావచ్చు. వాటిని పరిశుభ్రం గా అట్టిపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇది పర్యటన రంగాని కి ఎంతగానో దోహదపడుతుంది. టూరిజం లో పరిశుభ్రత తో పాటు ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఉద్యమాన్ని గురించి కూడా చాలా సారు లు చర్చించుకున్నాం. ఈ ఉద్యమం కారణం గా ప్రజలు వారి చుట్టూ ఉన్న ఎన్నో ప్రదేశాల ను గురించి మొదటి సారి తెలుసుకొన్నారు. విదేశాల లో పర్యటన కు వెళ్లే ముందు మన దేశం లోని కనీసం 15 పర్యటక ప్రాంతాల ను తప్పక సందర్శించాలి అని నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఈ ప్రాంతాలు మీరు నివసించే రాష్ట్రం లోవి కాకూడదు. మీ రాష్ట్రం వెలుపల ఏ ఇతర ప్రాంతం లో అయినా ఉండాలి. అదే విధం గా స్వచ్ఛ్ సియాచిన్, సింగిల్ యూస్ ప్లాస్టిక్, ఇ-వేస్ట్ వంటి ముఖ్యమైన అంశాల ను గురించి మనం నిరంతరం గా మాట్లాడుకొన్నాం. ప్రస్తుతం యావత్తు ప్రపంచం ఆందోళన చెందుతున్న పర్యావరణ సమస్య ను పరిష్కరించడం లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) చేసిన ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైనటువంటిది గా ఉంది.

 

మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)పై నాకు ఈ సారి మరో ప్రత్యేక సందేశం యూనెస్కో డైరెక్టర్ జనరల్ ఔద్రే ఆజులే గారి నుండి వచ్చింది. వంద ఎపిసోడ్‌ ల ఈ అద్భుత ప్రయాణం పై దేశప్రజలందరి కి ఆమె శుభాకాంక్షల ను తెలియ జేశారు. అలాగే, ఆమె కొన్ని ప్రశ్నల ను కూడా అడిగారు. రండి, ముందుగా యూనెస్కో డిజి మనసు లో మాట ను విందాం.

 

#ఆడియో (యూనెస్కో డైరెక్టర్ జనరల్)#

 

డైరెక్టర్ జనరల్ యూనెస్కో: నమస్తే ఎక్స్ లన్సి, ప్రియమైన ప్రధాన మంత్రి గారూ.. ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) రేడియో ప్రసారం వందో ఎపిసోడ్‌ లో పాలుపంచుకొనే అవకాశాన్ని ఇచ్చినందుకు యూనెస్కో తరపు న మీకు ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. యూనెస్కో కు, భారతదేశాని కి సుదీర్ఘమైన ఉమ్మడి చరిత్ర ఉంది. విద్య, విజ్ఞానశాస్త్రం, సంస్కృతి, సమాచార రంగాల లో యూనెస్కో కు, భారతదేశాని కి బలమైన భాగస్వామ్యం ఉంది. విద్య ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడడానికి నేను ఈ రోజు న ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. 2030 వ సంవత్సరం కల్లా ప్రపంచం లోని ప్రతి ఒక్కరి కి నాణ్యమైన విద్య అందుబాటు లో ఉండేలా యూనెస్కో తన సభ్యత్వ దేశాల తో కలసి పనిచేస్తోంది. ప్రపంచం లోనే అత్యధిక జనాభా ఉన్నందువల్ల ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం అనుసరిస్తున్న మార్గాన్ని దయచేసి వివరించగలరా? సంస్కృతి లో సహకారాని కి, వారసత్వ పరిరక్షణ కు కూడా యూనెస్కో పని చేస్తుంది. ఈ సంవత్సరం జి-20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు ప్రపంచ నేత లు దిల్లీ కి వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ లన్సి, అంతర్జాతీయ అజెండా లో సంస్కృతి ని, విద్య ను భారతదేశం ఎలా అగ్రస్థానం లో ఉంచాలని కోరుకొంటోంది? ఈ అవకాశాని కి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం ప్రజల కు మీ ద్వారా నా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. త్వరలో కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.

 

ప్రధాన మంత్రి మోదీ: ధన్యవాదాలు, ఎక్స్ లన్సి. 100 వ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) కార్యక్రమం లో మీతో సంభాషించడం నాకు సంతోషం గా ఉంది. విద్య కు, సంస్కృతి కి సంబంధించిన ముఖ్యమైన అంశాల ను మీరు ప్రస్తావించినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను.

 

మిత్రులారా, యూనెస్కో డైరెక్టర్ జనరల్ గారు విద్య కు, సాంస్కృతిక పరిరక్షణ కు సంబంధించి భారతదేశం యొక్క కృషి ని గురించి తెలుసుకోదలచారు. ఈ రెండు అంశాలు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో ఇష్టమైన అంశాలు గా ఉన్నాయి.

 

విషయం విద్య కు సంబంధించినది కావచ్చు. లేదా సంస్కృతి కి దాని సంరక్షణ కు సంబంధించింది కావచ్చు. లేదా సంస్కృతి సంవర్ధన కు సంబంధించింది కావచ్చు. ఇది భారతదేశం యొక్క ప్రాచీన సంప్రదాయం గా ఉంటూ వచ్చింది. ఈ దిశ లో ఇవాళ దేశం చేస్తున్న కృషి నిజం గా అభినందనీయం. జాతీయ విద్య విధానం కావచ్చు. లేదా ప్రాంతీయ భాష లో చదివే ఎంపిక కావచ్చు. విద్య లో సాంకేతికత అనుసంధానం కావచ్చు. మీరు ఇటువంటి అనేక ప్రయత్నాల ను చూస్తారు. కొన్ని సంవత్సరాల కిందట గుజరాత్ లో 'గుణోత్సవ్’, ‘శాలా ప్రవేశోత్సవ్' వంటి కార్యక్రమాలు మెరుగైన విద్య ను అందించడం లో, బడి మధ్య లోనే మాని వేసే విద్యార్థినీవిద్యార్థుల సంఖ్య ను తగ్గించడం లో ప్రజల భాగస్వామ్యాని కి అద్భుతమైన ఉదాహరణలు గా మారాయి. విద్య కోసం నిస్వార్థం గా పనిచేస్తున్నటువంటి చాలా మంది వ్యక్తుల యొక్క ప్రయత్నాల కు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో మనం ప్రాధాన్యాన్ని ఇచ్చాం. మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మనం ఒడిశా లో బండి పైన చాయ్ అమ్మే దివంగత డి. ప్రకాశరావు గారు పేద బాలల కు చదువు చెప్పే కృషి లో నిమగ్నం అయిన సంగతి ని గురించి చర్చించుకొన్నాం. ఝార్ ఖండ్‌ లోని పల్లెల లో డిజిటల్ లైబ్రరి ని నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ గారు కావచ్చు, కోవిడ్ కాలం లో ఇ-లర్నింగ్ ద్వారా చాలా మంది పిల్లల కు సహాయం చేసిన హేమలత ఎన్‌కె గారు కావచ్చు, ఇటువంటి అనేక మంది ఉపాధ్యాయుల ఉదాహరణల ను మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో ప్రస్తావించుకొన్నాం. మనం సాంస్కృతిక పరిరక్షణ సంబంధి ప్రయాస లు సైతం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)లో నిరంతరం చోటు చేసుకొన్నాయి.

 

లక్షద్వీప్ కు చెందిన కుమ్మెల్ బ్రదర్స్ చాలింజర్స్ క్లబ్ కావచ్చు, లేదా కర్నాటక కు చెందిన 'క్వేమ్‌శ్రీ' గారి 'కళా చేతన' వంటి వేదిక కావచ్చు. దేశం లో ప్రతి మూల నుండి ప్రజలు లేఖల్లో నాకు అటువంటి ఉదాహరణల ను పంపారు. దేశభక్తి పై ‘గీత్’, ‘లోరీ’ , ‘రంగోలి’ కి సంబంధించిన మూడు పోటీల ను గురించి కూడా మనం మాట్లాడుకొన్నాం. మీకు గుర్తుండవచ్చు.. ఒక సారి మనం భారతీయ విద్య విధానం లో కథా కథన మాధ్యం వినియోగం పై దేశవ్యాప్తం గా గల కథకుల తో చర్చించాం. సమష్టి కృషి తో అతి పెద్ద మార్పు తీసుకు రాగలమని నాకు అచంచలమైన నమ్మకం ఉంది. స్వాతంత్ర్య స్వర్ణ యుగం లో ముందుకు సాగుతున్న ఈ సంవత్సరం మనం జి-20 కి కూడా అధ్యక్షత వహిస్తున్నాం. విద్య తో పాటు విభిన్న ప్రపంచ సంస్కృతుల ను సమృద్ధం చేయడం కోసం మన సంకల్పం మరింత దృఢం గా మారిందంటే ఇది కూడా ఒక కారణం.

 

ప్రియమైన నా దేశవాసులారా, మన ఉపనిషత్తు ల నుండి ఒక మంత్రం శతాబ్దాలు గా మన మనస్సుల కు ప్రేరణ ను అందిస్తూ వస్తోంది.

చరైవేతి చరైవేతి చరైవేతి

కొనసాగించు - కొనసాగించు – కొనసాగించు

ఈ రోజు న మనం ఇదే చరైవేతి చరైవేతి భావన తో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) వందో భాగాన్ని పూర్తి చేస్తున్నాం. ప్రతి పూస ను ఒకదాని తో మరొకటి అంటిపెట్టుకునే పూల దారం వలెనే భారతదేశం సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేయడం లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ప్రతి మనస్సు ను జోడిస్తోంది. ప్రతి ఎపిసోడ్‌ లో దేశవాసుల సేవ, సామర్థ్యం ఇతరుల కు స్ఫూర్తి ని ఇచ్చాయి. ఈ కార్యక్రమం లో ప్రతి దేశస్థుడు ఇతర దేశస్థుల కు ప్రేరణ ను ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలి అంటే మన్ కీ బాత్‌’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లోని ప్రతి ఎపిసోడ్ తరువాతి ఎపిసోడ్‌ కు రంగాన్ని సిద్ధం చేస్తుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ఎల్లప్పుడూ సద్భావన, సేవాభావం, కర్తవ్య భావన లతో ముందుకు సాగింది. ఈ సానుకూలత స్వాతంత్ర్య అమృత కాలంలో దేశాన్ని ముందుకు తీసుకు పోతుంది. కొత్త శిఖరాల కు తీసుకు పోతుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)తో మొదలైన ఈ కృషి నేడు దేశం లో ఒక కొత్త సంప్రదాయం గా మారుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రయత్నాల స్ఫూర్తి ని మనం చూసే సంప్రదాయమిది.

 

మిత్రులారా, ఈ పూర్తి కార్యక్రమాన్ని ఎంతో ఓపిక తో రికార్డు చేసే ఆకాశవాణి సహచరుల కు కూడా ఈ రోజు న నేను ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. ‘మన్ కీ బాత్’ ను (‘మనసు లో మాట’ కార్యక్రమాన్ని) చాలా తక్కువ సమయం లో చాలా వేగం తో వివిధ ప్రాంతీయ భాషల లోకి అనువదించే అనువాదకుల కు కూడా నేను కృతజ్ఞుడి ని. దూర్ దర్శన్, మై గవ్ సహచరుల కు కూడాను ధన్యవాదాల ను వ్యక్తం చేస్తున్నాను. కమర్షియల్ బ్రేక్స్ లేకుండా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) చూపించే దేశవ్యాప్తం గా ఉన్న అన్ని టీవీ ఛానల్స్ , ఇలెక్ట్రానిక్ మీడియా వారి కి నేను నా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను. చివర గా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం)పై ఆసక్తి ని చూపినటువంటి దేశప్రజల కు, భారతదేశం పై విశ్వాసం ఉన్న ప్రజల కు కూడా నా ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను. ఇది అంతాను మీ స్ఫూర్తి, బలం ల వల్లే సాధ్యపడింది.

 

మిత్రులారా, ఈ రోజు న నేను చాలా చెప్పవలసి ఉంది. కానీ సమయం తక్కువ గా ఉంది. మాట లు తక్కువ పడుతున్నాయి. అయితే మీరంతా నా ఆలోచనల ను అర్థం చేసుకొంటారని, నా భావనల ను గ్రహిస్తారని నాకు విశ్వాసం ఉంది. మీ కుటుంబంలోనే ఒక సభ్యుని గా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) సహాయం తో మీ మధ్యన ఉన్నాను, ఉంటాను. వచ్చే నెల లో మళ్ళీ కలుద్దాం. కొత్త విషయాల తో, కొత్త సమాచారం తో దేశప్రజల సాఫల్యాల ను ఉత్సవం గా జరుపుకొందాం. అప్పటి దాకా నాకు వీడుకోలు పలకండి. మరి మిమ్మల్ని, ఇంకా మీ ప్రియతములను బాగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

***


(Release ID: 1920875) Visitor Counter : 377