వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2022-23లో చేసిన సేకరణను అధిగమించి, కొనసాగుతున్న ఆర్ఎంఎస్ కాలంలో 195 ఎల్ఎంటిల గోధుమల సేకరణ
పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌ల నుంచి ప్రధాన తోడ్పాటు
సజావుగా సాగుతున్న బియ్యం సేకరణ
Posted On:
27 APR 2023 3:25PM by PIB Hyderabad
రబీ మార్కెటింగ్ కాలం (ఆర్ఎంఎస్) 2023-24లో గోధుమ సేకరణ ఇప్పటికే ఆర్ఎంఎస్2022-23లో మొత్తం సేకరణను అధిగమించింది.
ఆర్ఎంఎస్ 2022-23లో, 188ఎల్ఎంటిల సేకరణ జరిగింది. అయితే, 26 ఏప్రిల్ 2023వరకు ఆర్ఎంఎస్ 2023-24లో గోధుమ సేకరణ 195 ఎల్ఎంటిలుగా ఉంది. ఇది రైతులకు ఎంతో మేలు చేకూర్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న గోధుమ సేకరణ కార్యకలాపాల సందర్భంగా దాదాపు 14.96 లక్షల మంది రైతులకు రూ. 41148 కోట్లను కనీస మద్దతు ధరను చెల్లించారు.
ముఖ్యంగా, ప్రధాన పాలు వరుసగా 89.79 ఎల్ఎంటి, 54.26 ఎల్ఎంటిలు, 49.47ఎల్ఎంటిల సేకరణతో మూడు గోధుమ సేకరణ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌ల నుంచి వచ్చింది.
ఈ ఏడాది పెరుగుతున్నసేకరణకు దోహదపడుతున్న ప్రధాన కారకాల్లో ఒకటి, అకాల వర్షాల కారణంగా మెరుపు నష్టపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని, గోధుమల సేకరణ నాణ్యత నిర్దేశాలలో భారత ప్రభుత్వం సడలింపులను మంజూరు చేయడం. దీనితో, రైతులకు నష్టాలు తగ్గి, తక్కువ ధరలకు అమ్మకునే దుస్థితిని నిరోధించవచ్చు.
అలాగే, గ్రామ/ పంచాయతీ స్థాయిల్లో సేకరణ కేంద్రాలను తెరిచేందుకు, మరింత మెరుగ్గా రైతులను చేరుకునేందుకు వీలుగా ఉనికిలో ఉన్న నిర్ధిష్ట సేకరణ కేంద్రాలకు అదనంగా సహకార సంఘాలు/ గ్రామ పంచాయతీలు/ అర్హతియాలు తదితరాల ద్వారా సేకరణను కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
దీనికి తోడుగా, బియ్యం సేకరణ కూడా సజావుగా సాగుతోంది. కెఎంఎస్ 2022-23లో ఖరీఫ్ పంట సందర్భంగా 26.04.2023వరకు 354 ఎల్ఎంటి బియ్యాన్ని సేకరించారు. ఇంకా 140 ఎల్ఎంటి ఇంకా సేకరించవలసి ఉంది. అంతేకాకుండా, కెఎంఎస్ 2022-23 రబీ పంట సందర్భంగా 106 ఎల్ఎంటి బియ్యాన్ని సేకరించాలన్నది అంచనా.
కేంద్ర పూల్ లో గోదుమ, బియ్యపు సంయుక్త స్టాక్ పరిస్థితి 510 ఎల్ఎంటిని దాటిపోయింది. ఇది ఆహార ధాన్యాల అవసరాలను తీర్చేందుకు దేశాన్ని సౌకర్యవంతమైన పరిస్థితిలో ఉంచింది. ప్రస్తుతం కొనసాగుతున్న గోధుమ, బియ్యపు సేకరణతో, ప్రభుత్వ ధాన్యాగారాలలో ఆహార ధాన్యాల స్టాక్ స్థాయి పెరుగుతోంది.
***
(Release ID: 1920337)
Visitor Counter : 191