కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో 254 4జీ టవర్లు జాతికి అంకితం; 336 గ్రామాలకు అంతరాయం లేని టెలికాం కనెక్టివిటీ


యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యుఎస్‌ఓఎఫ్) కింద టవర్ల నిర్మాణం

భారత ప్రభుత్వం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల సమిష్టి కృషితో పాటు అన్ని శాఖలు మరియు జిల్లాలు సమన్వయంతో పనిచేశాయి

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇటీవల అన్ని రంగాల్లో అపారమైన పురోగతిని సాధించింది - ఇటీవల డోనీ పోలో విమానాశ్రయం ప్రారంభోత్సవం, భారత్ గౌరవ్ రైళ్ల కనెక్టివిటీ ప్రారంభం

ఇటానగర్‌లో ఇటీవల 5జీ సేవలు ప్రారంభించబడ్డాయి - త్వరలో ఇతర ప్రాంతాలకు విస్తరించబడతాయి

Posted On: 22 APR 2023 5:25PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రజల స్పందనపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  “అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు అసాధారణమైనవారు. వారు తమ దేశభక్తి స్ఫూర్తిలో తిరుగులేనివారు. ఈ గొప్ప రాష్ట్రం కోసం పనిచేయడం మరియు ఇది నిజమైన సంభావ్యతను గుర్తించడంలో సహాయపడటం గౌరవంగా భావిస్తున్నాను." అని చెప్పారు.

భారత ప్రభుత్వం మరియు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త ప్రయత్నంలో భాగంగా 254 4జీ మొబైల్ టవర్లు ఏప్రిల్ 22, 2023న కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వేలు మరియు ఎలక్ట్రానిక్స్ & ఐటీశాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సమక్షంలో జాతికి అంకితం చేయబడ్డాయి; కార్యక్రమంలో కేంద్ర న్యాయ మరియు న్యాయ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు; అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండూ, కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి శ్రీ దేవుసిన్ చౌహాన్ మరియు అరుణాచల్ ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మెయిన్‌తో పాటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఈ టవర్లు 336 గ్రామాలను కవర్ చేస్తాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని వేలాది మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుస్తాయి. లబ్ధిదారులు విద్య, ఆరోగ్యం, ఇ-కామర్స్ మరియు వ్యవసాయం వంటి రంగాల్లో సామాజిక ఆర్థిక అభివృద్ధికి దారితీసే వివిధ డిజిటల్ సేవలను నిర్ధారించే  హై-స్పీడ్ నెట్‌వర్క్ కనెక్టివిటీని యాక్సెస్ చేయగలరు.

భారత్ నెట్ పథకం కింద 1,310 గ్రామ పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించబడ్డాయి మరియు డిజిటల్ చేరికను తీసుకురావడానికి మరో 1,156 టవర్లు ప్రణాళిక చేయబడ్డాయి. ఇటానగర్‌లో ఇటీవల 5జీ సేవలు ప్రారంభించబడ్డాయి.అవి ఇతర ప్రాంతాలకు విస్తరించబడతాయి.

లబ్దిదారుల్లో ఒకరు దిగువ దిబాంగ్ వ్యాలీలోని గ్రామం నుండి వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు. టెలికాం కనెక్టివిటీపై సంతోషం వ్యక్తం చేశారు

అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ చౌనా మెయిన్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలలో భారత ప్రభుత్వ ప్రయత్నాలు రైల్వేలు, రహదారి మరియు టెలికమ్యూనికేషన్‌లకు గొప్ప కనెక్టివిటీని తీసుకువచ్చాయని తద్వారా రాష్ట్రం మొత్తం కనెక్టివిటీ లభించిందని ప్రశంసించారు.

అన్ని సవాళ్లను అధిగమించి కనెక్టివిటీని తీసుకురావడానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు, అలాగే ఇటానగర్‌లో జాతీయ పోస్టల్ హబ్‌ను ఏర్పాటు చేయడం మరియు రాష్ట్రంలో పోస్టల్ కనెక్టివిటీని తీసుకురావడానికి వివిధ కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించారు.

కేంద్ర కమ్యూనికేషన్ల సహాయ మంత్రి శ్రీ దేవుసిన్ చౌహాన్ మాట్లాడుతూ అన్ని సవాళ్లను అధిగమించి కనెక్టివిటీని తీసుకురావడానికి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అలాగే ఇటానగర్‌లో జాతీయ పోస్టల్ హబ్‌ను ఏర్పాటు చేయడం మరియు రాష్ట్రంలో పోస్టల్ కనెక్టివిటీని తీసుకురావడానికి చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి కూడా ప్రస్తావించారు.

ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు అని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. పెమా ఖండూ పేర్కొన్నారు. 2014 నుంచి అరుణ్‌చహల్‌ప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన జరిగిందని, దాని ఫలితంగా మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అవినీతిని తొలగించడం మరియు ఇ-గవర్నెన్స్‌ను మెరుగుపర్చడంతో డిజిటల్ వ్యవస్థ దోహదపడిందన్నారు. ప్రస్తుతం 100% ఇ-ఆఫీస్‌ను ఉపయోగిస్తున్నారని, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఇ-విధాన్ ప్రాజెక్ట్‌ను అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. టైమ్‌లైన్‌కు ముందు మిగిలిన సైట్‌లను కవర్ చేయడం ద్వారా పూర్తి చేయడానికి ఫోకస్డ్ కోఆర్డినేషన్ మరియు ఆల్ అవుట్ ప్రయత్నాలు అవసరమని ఆయన అన్నారు. వన్‌ ప్లస్ వన్‌ని రెండుగా కాకుండా పదకొండుగా మార్చే నమూనాపై దృష్టి సారించాలన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌ను సూర్యోదయ భూమిగా మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న భూమిగా కూడా పేర్కొన్నారు.

కేంద్ర న్యాయ మరియు న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ అన్ని ప్రాజెక్టుల అమలు కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఉమ్మడి కృషి అవసరమయ్యే మొత్తం ప్రభుత్వ విధానంపై ఉద్ఘాటించారు." యూఎస్‌ఓఎఫ్ కింద ప్లాన్ చేసిన మిగిలిన 1,156 4జీ టవర్ల కోసం లొకేషన్‌లు ఇప్పటికే గుర్తించబడ్డాయి. మరొక స్కీమ్‌లో భాగంగా అంటే 4జీ సంతృప్త పథకం కింది 2,424 4జీ  సైట్‌లను ఇన్‌స్టాల్ చేయాలి, ఇందులో ఓఎఫ్‌సీ ద్వారా 270 సైట్‌లు, మైక్రోవేవ్ ద్వారా 1,237 సైట్‌లు మరియు మరింత కనెక్టివిటీని తీసుకురావడానికి విశాట్ ద్వారా 917 సైట్‌లు వీటిలో ఉన్నాయి. ఇంకా, సరైన కనెక్టివిటీ కోసం శాటిలైట్ కమ్యూనికేషన్‌లు కూడా ఉపయోగించబడతాయి. వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రామ్ మరియు సరిహద్దు రహదారి సమగ్ర అభివృద్ధిని తీసుకువస్తాయని మరియు పౌరుల జీవితాలను మారుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. మార్చి, 2024 నాటికి ఏ గ్రామం అనుసంధానం లేకుండా మిగిలిపోకుండా మిషన్ మోడ్‌లో పని చేయాలని కోరారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథాన్ని సాధించడానికి సరిహద్దు ప్రాంతాలు ప్రధాన పాత్ర
పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.


కేంద్ర కమ్యూనికేషన్లు, రైల్వేలు మరియు ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ తన ప్రసంగంలో ఈ టవర్లను కష్టతరమైన భూభాగంలో ఏర్పాటు చేయడం, ఆచరణాత్మక ఇబ్బందులు సబ్‌కా ప్రయాస్‌కు స్పష్టమైన ఉదాహరణ అని తెలియజేశారు. కమ్యూనికేషన్స్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెరిచిన తలుపులు మరియు అవకాశాలు అని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో ఇతర దేశాల్లోని లబ్ధిదారులకు ప్రయోజనాలను అందించడం ఎంత కష్టమయిందో కూడా ఆయన ప్రస్తావించారు. అయితే భారతదేశంలో ఇండియా స్టాక్‌ను సమర్థవంతంగా ఉపయోగించడంతో యూపిఐ, ఆధార్, టెలికాం నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పంపిణీ మరియు అన్ని ఇతర సేవలు డిజిటల్‌గా మరియు ఒక క్లిక్‌లో నిర్వహించబడ్డాయన్నారు. తవాంగ్‌లో 12600 అడుగుల ఎత్తులో టవర్‌ను ఏర్పాటు చేసిన ఉదాహరణను ఉటంకిస్తూ కష్టతరమైన భూభాగాల సవాళ్లను అధిగమించడంపై ఆయన ఉద్ఘాటించారు.ఈ ఘనత సాధించిన రక్షణ బలగాలు, జిల్లా యంత్రాంగం, సర్వీస్ ప్రొవైడర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వివిధ ఏజెన్సీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన తన ప్రసంగం ముగించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతి మారుమూల గ్రామానికి మరియు ప్రతి వ్యక్తికి ప్రపంచ స్థాయి కనెక్టివిటీని అందించడానికి భారత ప్రభుత్వం “సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్”కు అనుగుణంగా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.


 

*****


(Release ID: 1918808) Visitor Counter : 222