కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇఎస్ఐ పథకం కింద ఫిబ్రవరి 2023లో 16.03 లక్షల నూతన ఉద్యోగుల జోడింపు
ఇఎస్ఐ పథకం కింద ఫిబ్రవరి 2023లో నమోదు చేసుకున్న దాదాపు 11,000 నూతన సంస్థలు
Posted On:
18 APR 2023 11:13AM by PIB Hyderabad
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి- ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్) విడుదల చేసిన తాత్కాలిక వేతనదారుల పట్టీ డాటా ప్రకారం ఫిబ్రవరి, 2023లో 16.02 లక్షల మంది కొత్త ఉద్యోగులను ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకంలో జోడించడం జరిగింది. ఈ డాటా ప్రకారం, ఫిబ్రవరి మాసం 2023లో 11,000 నూతన సంస్థలు తమ ఉద్యోగుల సామాజిక భద్రతకు హామీ ఇచ్చేందుకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీం కింద నమోదు చేసుకున్నాయి. కొత్తగా చేసిన నమోదులో మెజారిటీ ఉద్యోగులు 25 సంవత్సరాల వయోవర్గంలో ఉన్నవారు. నెలలో జోడించిన మొత్తం ఉద్యోగులలో దాదాపు 46% అంటే 7.42 లక్షల మంది ఉద్యోగులు ఈ వయోవర్గానికి చెందినవారే. దేశంలో యువతకు మంచి ఉపాధి అవకాశాలు వస్తున్నాయనే విషయాన్నిఈ సమాచారం వెల్లడిస్తోంది.
ఇక, ఫిబ్రవరి, 2023 నాటి వేతనదారుల పట్టిక జెండర్ వారీ విశ్లేషణ ప్రకారం, ఇఎస్ఐ పథకం కింద 3.12 లక్షల మంది మహిళా సిబ్బందిని జోడించడం జరిగింది. అలాగే, ఫిబ్రవరి 2023లో మొత్తం 49 ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులు కూడా ఇఎస్ఐ పథకం కింద నమోదు చేసినట్టు డాటా వెల్లడిస్తోంది. సమాజంలోని ప్రతి వర్గానికి తన ప్రయోజనాలను అందించాలని ఇఎస్ఐసి కట్టుబడిన విషయాన్ని ఇది తెలుపుతోంది.
ఈ వేతనదారుల పట్టిక డాటా అనేది నిరంతరం జరిగే పని అయినందున ఈ డాటా తాత్కాలికం.
***
(Release ID: 1917789)
Visitor Counter : 180