ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నాగాలాండ్‌లోని వన్సోయ్‌ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 15 APR 2023 10:16AM by PIB Hyderabad

   నాగాలాండ్‌లోని వన్సోయ్‌ గ్రామ ప్రజలు లింగ సమానత్వం విషయంలో ప్రగతిశీల విధానాలు పాటిస్తుండటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు వన్సోయ్‌ గ్రామ మహిళలు తొలిసారి మోరంగ్‌ (యువ సమ్మేళనం)లో ప్రవేశించి, లాగ్‌డ్రమ్‌ వాద్యం వాయించేందుకు అనుమతించబడ్డారని, ఇప్పటిదాకా ఎన్నడూ వారికి ఈ వేడుకలలో ప్రవేశం ఉండేది కాదని రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి ఎస్‌.ఫాంగ్‌నాన్‌ కొన్యాక్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ద్వారా పంపిన సందేశంలో:

“ఇది చాలా కీలక ముందడుగు. మహిళల ఆత్మగౌరవానికి, సాధికారతకు ఊపునిచ్చే నిర్ణయం. వన్సోయ్‌ గ్రామ ప్రజానీకానికి హృదయపూర్వక అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST


(रिलीज़ आईडी: 1917069) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam