యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఎన్‌సీవోయీ హమీర్‌పూర్‌లో బ్యాడ్మింటన్ కోర్టు మ్యాట్‌లు, జూడో హాల్, బాక్సింగ్ హాల్ ప్రారంభించిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
14 APR 2023 3:20PM by PIB Hyderabad
హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లోని శాయ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (ఎన్‌సీవోయీ) వివిధ క్రీడా సౌకర్యాలను కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రారంభించారు. ఎన్‌సీవోయీ హమీర్‌పూర్‌లో బాక్సింగ్ హాల్, జూడో హాల్‌తో పాటు ఫ్లోరింగ్‌తో కూడిన బ్యాడ్మింటన్ కోర్ట్ మ్యాట్‌లను భారత క్రీడల ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసింది.
నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హమీర్‌పూర్‌ను 2022 మార్చిలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో స్థాపించారు. ప్రస్తుతం, 91 మంది క్రీడాకారులు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, జూడో, హాకీ, రెజ్లింగ్ వంటి 6 విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం, ఆ ప్రాంగణంలో క్రీడాకారులకు వసతి ఏర్పాట్లు లేవు. ఎన్‌సీవోయీ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో అంతర్జాతీయ క్రీడా మైదానం, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్ సహా 300 పడకల వసతి గృహాన్ని నిర్మిస్తారు.
తక్కువ సమయంలో కోర్టులను విజయవంతంగా ఏర్పాటు చేసిన శాయ్ కృషిని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. “ఈ శాయ్ ఎన్‌సీవోయీ పూర్తి కావడానికి కేవలం 10 నెలల సమయం పట్టింది. డాక్టర్ అంబేడ్కర్ జయంతి రోజున కొత్త బ్యాడ్మింటన్ కోర్టులు, కొత్త లైట్ల వ్యవస్థ, రెజ్లింగ్, జూడో హాళ్లు ప్రారంభిస్తున్నాం. రికార్డు సమయంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. ఈ ఎన్‌సీవోయీకి మరిన్ని సౌకర్యాలు వస్తాయి. డాక్టర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో మనమందరం నడుద్దాం, మన కలల సాధనకు కృషి చేద్దాం" అని చెప్పారు.
“ఎన్‌సీవోయీలో చాలా మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారు. ఇక్కడ పొందే శిక్షణ నైపుణ్యాలు వాళ్ల క్రీడా జీవితాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఇది చాలా సంతృప్తికరంగా ఉంది, హిమాచల్‌ప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధికి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ ప్రాంతాన్ని భారతదేశంలో తదుపరి పెద్ద క్రీడల కేంద్రంగా మార్చాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని శ్రీ ఠాకూర్ చెప్పారు.
****
(Release ID: 1916821)
Visitor Counter : 157