వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫ్రాన్స్ మంత్రి శ్రీ ఒలివర్ బెచ్ట్ తో సమావేశమైన కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్
- విదేశీ వాణిజ్యం, పెట్టుబడులను ఆకర్షించడం, విదేశాలలోని ఫ్రెంచ్ జాతీయుల సంక్షేమ శాఖ మంత్రిని కలిసిన శ్రీ పీయూష్ గోయల్
Posted On:
12 APR 2023 8:45AM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తన పర్యటనలో భాగంగా నిన్న గత రాత్రి ఫ్రాన్స్ విదేశీ వాణిజ్యం, పెట్టుబడులను ఆకర్షించడం, విదేశాలలోని ఫ్రెంచ్ జాతీయుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఒలివియర్ బెచ్ట్‌ను కలిశారు. ఈ ఇరువురి సమావేశంలో భాగంగా వారివారి దేశాలలోని ఆర్థిక స్థితిని మంత్రులు చర్చించారు; ఇతర ఈయు దేశాల సగటులో సగం అయిన యూరో జోన్‌లో ఫ్రాన్స్ అత్యల్ప ద్రవ్యోల్బణం 5.2 శాతాన్ని కలిగి ఉందని బెచ్ట్ ప్రధానం వెల్లడించారు. ఇక్కడ నిరుద్యోగం 7 శాతంగా ఉందని తెలిపారు. 2022లో జీడీపీ వృద్ధి 2.6 శాతం వద్ద నిలిచిందని తెలిపారు; ఈ ఏడాది 0.6-1% వృద్ధిని అంచనా వేస్తున్నట్టుగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని పేర్కొన్నారు. భారతదేశం రెండంకెల ద్రవ్యోల్బణానికి అలవాటుపడి తాజాగా ఇప్పుడు మనం 6 - 6.5% వద్ద నిలిచిందని తెలిపారు. ఈ ఏడాది వృద్ధి జీడీపీలో 6.8 శాతంగానూ, నామమాత్రపు రేట్ల వద్ద 13 శాతం వృద్ధిని నమోదు చేసిందని ఆయన వివరించారు. దేశపు వాణిజ్యం పెరుగుతోందని, ఇంకా చాలా చేయవచ్చని ఆయన తెలిపారు. రాఫెల్ కొనుగోలు మరియు ఇటీవలి ఎయిర్‌బస్ ఆర్డర్‌తో ఇరువురి భాగస్వామ్యానికి మరింత విలువ జోడించబడిందన్నారు. 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్యం 15.1 బిలియన్లన అమెరికన్ డాలర్లుగా నిలిచిందని అన్నారు, గత దశాబ్దంలో రెండింతలు పెరిగిందని మిస్టర్ బెచ్ట్ పేర్కొన్నారు; భారతదేశంలో అగ్ర విదేశీ పెట్టుబడిదారుగా ఫ్రాన్స్ ఉందని.. ఇక్కడి నుంచి 10 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నమోదయ్యాయని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రెంచ్ కంపెనీల నుంచి సంకల్పం ఉందని ఆయన తెలిపారు. భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో పెట్టుబడులను పెంచుతున్నాయని, ప్రస్తుతం దాదాపు 300 మిలియన్ యూరోల పెట్టుబడులు ఉన్నాయని ఆయన పంచుకున్నారు. భాషా అవరోధాలను అధిగమించడం ద్వారా వాణిజ్యాన్ని మరింత విస్తరించవచ్చని శ్రీ గోయల్ ప్రధానంగా తెలిపారు. మార్కెట్ యాక్సెస్‌కు సంబంధించిన సమస్యలు చర్చించబడిన భారత్ – ఈయు ఎఫ్టీఏ చర్చలకు సంబంధించిన ప్రాధాన్యతా రంగాలపై మంత్రులు చర్చించారు. వచ్చే 10 ఏళ్లలో 2000 కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయాలని భారతదేశం చూస్తోందని, దేశీయ మరియు అంతర్జాతీయ డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశంలో వాణిజ్య విమానాలను తయారు చేయడానికి భారీ అవకాశం ఉందని శ్రీ గోయల్ హైలైట్ చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థలో పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై మంత్రులు చర్చించారు. బెచ్ట్ భారతదేశంలో ఫ్రెంచ్ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులపై మరింత దృష్టి పెడుతూ మాట్లాడారు. మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, చలనశీలతలో పరస్పర అవకాశాలు ఉన్నాయని పంచుకున్నారు. కొచ్చి, నాగ్‌పూర్ మరియు అహ్మదాబాద్‌లలో పబ్లిక్ ప్రాజెక్ట్‌లకు ఫ్రాన్స్ మద్దతు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆగస్టు, 2023లో జరిగిన జీ20 వాణిజ్య మంత్రుల సమావేశానికి ఫ్రెంచ్ సంఘంతో పాటు మిస్టర్ బెచ్‌ను శ్రీ గోయల్ భారతదేశానికి ఆహ్వానించారు.
***
(Release ID: 1916063)
Visitor Counter : 177