ప్రధాన మంత్రి కార్యాలయం
బందీపూర్.. ముదుమలై పులుల అభయారణ్యాలను సందర్శించిన ప్రధాని
Posted On:
09 APR 2023 2:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పరిధిలోని బందీపూర్, ముదుమలై పులుల అభయారణ్యాలను సందర్శించారు. అలాగే ముదుమలై అభయారణ్యంలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని కూడా ఆయన సందర్శించారు. అక్కడి మావటులు, వారి సహాయకులతో కాసేపు సంభాషించడంతోపాటు ఏనుగులకు ఆహారం అందించారు. అంతేకాకుండా ఆస్కార్ పురస్కారం గెలుచుకున్న డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో కనిపించిన ఏనుగుల సంరక్షకులు బొమ్మన్, బెల్లిలతో కూడా ప్రధానమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు.
ఈ సందర్శనపై వరుస ట్వీట్లద్వారా ఇచ్చిన సందేశాల్లో:
“ఈ ఉదయం అందమైన బందీపూర్ పులుల అభయారణ్యంలో కొద్దిసేపు గడిపాను. ఈ సందర్భంగా భారతదేశ వన్యప్రాణులు, సహజ సౌందర్యం, వైవిధ్యాన్ని ఆస్వాదించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అనంతరం అక్కడి చిత్రాలను ప్రజలతో పంచుకుంటూ:
“ఇదిగో బందీపూర్ పులుల అభయారణ్యం నుంచి మరికొన్ని చిత్రాలు.”
“ముదుమలై పులుల అభయారణ్యం వద్ద ఠీవిగా కనిపిస్తున్న ఏనుగులతో నేను.”
“ఏనుగులు రఘు, బొమ్మితోపాటు వాటి సంరక్షకులు బొమ్మన్, బెల్లిలతో కాసేపు గడపడం అద్భుత అనుభూతినిచ్చింది” అంటూ తన మనోభావాలను పంచుకున్నారు.
అంతకుముందు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా:
“ప్రధాని నరేంద్ర మోదీ బెందీపూర్, ముదుమలై పులుల అభయారణ్యాల సందర్శనకు వెళ్తున్నారు” అని సమాచారమిచ్చింది.
***
DS/TS
(Release ID: 1915121)
Visitor Counter : 210
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam