ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి
Posted On:
08 APR 2023 6:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమ వేదిక వద్దకు చేరుకోగానే వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రధాని పరిశీలించారు. అలాగే రైలును నడిపే సిబ్బందితోపాటు బాలలో కాసేపు ముచ్చటించారు.
దీనిపై ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఈ వందే భారత్ ఎక్స్’ప్రెస్’తోను తమిళనాడుకు తలమానికమైన చెన్నై, కోయంబత్తూర్ నగరాల మధ్య అనుసంధానం మరింత మెరుగవుతుంది. ఈ రైలును జెండా ఊపి సాగనంపడంతోపాటు ఇక్కడి యువ మిత్రులను కూడా నేను కలుసుకున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, కేంద్ర రైల్వేశాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ కూడా పాల్గొన్నారు.
***
DS/TS
(Release ID: 1915119)
Visitor Counter : 151
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil