ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ


వాకథాన్ కు నేతృత్వం వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సిడి)లను దూరంగా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యం పై సానుకూల ప్రభావాలను చూపడానికి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పించే చొరవ

ప్రతి వాటాదారునికి సహాయం చేయడంలో భారతదేశం ముందంజలో ఉంది; ఈ స్ఫూర్తితో, భారతదేశం తన పౌరులు, ప్రపంచ ఆరోగ్యం కోసం పనిచేస్తోంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

నడక (వాకథాన్) అయినా, యోగా అయినా, ఇతర వ్యాయామాలైనా మన యువత ఉత్సాహంగా ఈ శారీరక శ్రమను తమ జీవితంలో భాగం చేసుకుంటున్నాయి: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 07 APR 2023 10:19AM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో వాకథాన్ నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ వాకథాన్ కు నేతృత్వం వహించారు.

అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్ సిడి)లను దూరంగా ఉంచడానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యం పై సానుకూల ప్రభావాలను కలిగించే ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పించడం ఈ వాకథాన్ ఉద్దేశం. విజయ్ చౌక్ నుంచి కర్తవ్య పథ్ మీదుగా ప్రారంభమైన ఈ వాక్ ధాన్ ఇండియా గేట్ మీదుగా నిర్మాణ్ భవన్ కు చేరుకుంది. మెరుగైన ఆరోగ్యం కోసం నడక సాగిస్తున్న 350 మందికి పైగా ఔత్సాహికులు వాక్ ధాన్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్తపోటు, మధుమేహం, మానసిక అనారోగ్యం , క్యాన్సర్ వంటి జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు / వ్యాధులను నివారించడానికి, నియంత్రించడానికి ఆరోగ్యకరమైన చురుకైన జీవనాన్ని అవలంబించాలని వారు ప్రతిజ్ఞ చేశారు.

 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఒక ట్వీట్ లో, , ఆరోగ్యకరమైన భారతదేశం కోసం గౌరవ ప్రధాన మంత్రి దార్శనికత ను పునరుద్ఘాటించారు.

Image

ఈ సందర్భంగా డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, వాక్ థాన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. వసుధైక కుటుంబం  భారతీయ తత్వంగా మిగిలిపోయిందని, ఇక్కడ మనం కేవలం వ్యక్తిగతంగా కాకుండా అందరి పురోగతి గురించి ఆలోచిస్తామని ఆయన అన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో, భారతదేశం ఎటువంటి వాణిజ్య లాభాలను పరిగణనలోకి తీసుకోకుండా అవసరమైన దేశాలకు వ్యాక్సిన్లు, వైద్య సామాగ్రిని అందించినప్పుడు ఈ వసుధైక కుటుంబం తత్వం మరింత గుర్తింపు పొందిందని అన్నారు. ప్రతి వాటాదారునికి సహాయం చేయడంలో భారతదేశం ముందంజలో ఉందని, ఈ స్ఫూర్తితో, భారతదేశం తన పౌరులు,  ప్రపంచ ఆరోగ్యం కోసం పనిచేస్తోందని అన్నారు.

 

దేశ అభివృద్ధిలో ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ, "ప్రధాన మంత్రి నాయకత్వంలో, భారతదేశం ఆరోగ్యాన్ని అభివృద్ధితో అనుసంధానించింది‘‘ అని

డాక్టర్ మాండవీయ అన్నారు.

‘‘ఆరోగ్యవంతులైన పౌరులు మాత్రమే ఆరోగ్యకరమైన సమాజాన్ని, అభివృద్ధి చెందిన దేశాన్ని సృష్టించగలరు. ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో, అభివృద్ధి చెందిన ,ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించడానికి అందరం కలిసి పనిచేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను‘‘ అన్నారు.

 

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్  మాట్లాడుతూ, వాకథాన్, యోగా లేదా ఇతర వ్యాయామాలు ఏదైనా సరే, మన యువత ఉత్సాహంగా ఈ శారీరక ఆరోగ్య ప్రక్రియలను తమ జీవితంలో అలవరచుకుంటున్నారని పేర్కొన్నారు.

ఆరోగ్యవంతుడు తమ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా సానుకూలంగా దోహదం చేస్తాడనే వాస్తవం నుండి "అందరికీ ఆరోగ్యం" భావన ఉద్భవించిందని ఆమె అన్నారు. ప్రవర్తనా మార్పులు, శారీరకంగా చురుకైన జీవనశైలిని ప్రోత్సహించే ఆరోగ్యకరమైన భారతదేశం కోసం గౌరవ ప్రధాన మంత్రి నాయకత్వంలో దేశం బలమైన సంకల్పాన్ని తీసుకుందని ఆమె పేర్కొన్నారు.

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మంచి ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందేశాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ఘాటిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, సైక్లింగ్ పట్ల ఆయన  ఉత్సాహానికి గానూ "గ్రీన్ ఎంపి" గా పేరు పొందారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించమని ఆయన పౌరులను ప్రోత్సహిస్తున్నారు.

 

ప్రస్తుతం దేశంలోని మొత్తం మరణాలలో 63% కంటే ఎక్కువ ఎన్ సి డి లు  ఉన్నాయని తెలిసిందే. పొగాకు వాడకం (ధూమపానం , ధూమపానం కానిది), మద్యపానం, పేలవమైన ఆహారపు అలవాట్లు, తగినంత శారీరక శ్రమ లేకపోవడం , వాయు కాలుష్యం వంటి ప్రధాన ప్రవర్తనా ప్రమాద కారకాలతో బలంగా సంబంధం కలిగి ఉన్నాయి.

 

ఎన్ సి డి ల అభివృద్ధికి ప్రధాన ప్రమాద కారకాలలో ఒకటి శారీరక నిష్క్రియాత్మకత. నేషనల్ ఎన్సీడీ మానిటరింగ్ సర్వే (ఎన్ఎన్ఎంఎస్) (2017-18) ప్రకారం, 41.3% మంది భారతీయులు శారీరకంగా నిష్క్రియాత్మకంగా ఉన్నారు. శారీరక శ్రమ గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి ఎన్సిడిల ప్రమాదాన్ని తగ్గించడమే కాదు.  మానసిక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావాలను చూపుతుంది, చిత్తవైకల్యం ప్రారంభాన్ని ఆలస్యం చేస్తుంది.

 

ఎం ఒ హెచ్ ఎఫ్ డబ్ల్యూ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్, డబ్ల్యూహెచ్ వో ఆగ్నేయాసియా రీజియన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్, డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి డాక్టర్ రోడెరికో హెచ్ ఆఫ్రిన్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, సఫ్దర్ జంగ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా (ఆర్ ఎంఎల్) హాస్పిటల్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బంది, విద్యార్థులు కూడా వాకథాన్ లో పాల్గొన్నారు.

 

****



(Release ID: 1914604) Visitor Counter : 151