ఆర్థిక మంత్రిత్వ శాఖ

మార్చి 2023కి రూ.1,60,122 కోట్ల స్థూల జీఎస్‌టీ రాబడి


ఏప్రిల్ 2022లో వచ్చిన సేకరణ తర్వాత ఇది రెండవ అత్యధిక మొత్తం

వరుసగా 12 నెలల పాటు నెలవారీ జీఎస్‌టీ ఆదాయం రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువ,
జీఎస్‌టీ ప్రారంభమైనప్పటి నుండి రూ. 1.6 లక్షల కోట్లు దాటడం 2వ సారి

జీఎస్‌టీ రాబడులు సంవత్సరానికి 13% వృద్ధిని సాధించాయి

2022-23లో మొత్తం స్థూల సేకరణ రూ.18.10 లక్షల కోట్లు; మొత్తం సంవత్సరానికి
సగటు స్థూల నెలవారీ వసూళ్లు రూ. 1.51 లక్షల కోట్లు

2022-23 లో స్థూల రాబడి గత సంవత్సరం కంటే 22% ఎక్కువ

Posted On: 01 APR 2023 4:01PM by PIB Hyderabad

మార్చి 2023 నెలలో సేకరించిన స్థూల  జీఎస్‌టీ రాబడి రూ.1,60,122 కోట్లుగా కేంద్రం ప్రకటించింది. అందులో సిజీఎస్‌టీ రూ.29,546 కోట్లు, ఎస్జీఎస్‌టీ రూ.37,314 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.82,907 కోట్లు ( వస్తువుల దిగుమతిపై వచ్చిన రూ.42,503 కోట్లతో సహా), సుంకం కింద 10,355 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన ₹960 కోట్లతో సహా) సేకరించారు. ఈ సారి జీఎస్‌టీ సేకరణ పలు రికార్డులను నెలకొల్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల  జీఎస్‌టీ వసూళ్లు ₹1.5 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాల్గవసారి,  జీఎస్‌టీ అమలు తర్వాత అత్యధిక వసూళ్లను నమోదు చేయడం ఇది రెండో సారి. ఈ నెలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఐజీఎస్‌టీ సేకరణ కూడా నమోదయింది. 

ప్రభుత్వం ఐజీఎస్‌టీ నుండి సిజీఎస్‌టీకి రూ.33,408 కోట్లు, ఎస్జీఎస్‌టీకి రూ.28,187 కోట్లు రెగ్యులర్ సెటిల్‌మెంట్‌గా సెటిల్ చేసింది. ఐజీఎస్‌టీ సెటిల్‌మెంట్ తర్వాత మార్చి 2023 నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం రూ.62,954 కోట్లు సిజీఎస్‌టీగాను, రూ.65,501 కోట్లు ఎస్జీఎస్‌టీగాను నమోదయింది. 

మార్చి 2023కి వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన  జీఎస్‌టీ ఆదాయాల కంటే 13% ఎక్కువ. నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 8% ఎక్కువగా ఉన్నాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయం కంటే 14% ఎక్కువగా ఉన్నాయి. మార్చి 2023లో రిటర్న్ ఫైలింగ్ గతంలో ఎన్నడూ లేనంతగా ఉంది. ఫిబ్రవరిలో ఇన్‌వాయిస్‌ల స్టేట్‌మెంట్‌లో 93.2% ( జీఎస్‌టీఆర్ -1లో), 91.4% రిటర్న్‌లు  జీఎస్‌టీఆర్ -3బి లో) మార్చి 2023 వరకు దాఖలు అయ్యాయి, గత ఏడాది ఇదే నెలలో వరుసగా 83.1% మరియు 84.7% ఉన్నాయి.

2022-23లో మొత్తం స్థూల సేకరణ రూ.18.10 లక్షల కోట్లు, పూర్తి సంవత్సరానికి సగటు నెలవారీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23లో స్థూల రాబడి గత సంవత్సరం కంటే 22% ఎక్కువ. మొదటి, రెండవ, మూడవ త్రైమాసికాల్లో వరుసగా  రూ.1.51 లక్షల కోట్లు, 1.46 లక్షల కోట్లు, రూ.1.49 లక్షల కోట్ల సగటు నెలవారీ సేకరణ నమోదయింది.  2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.55 లక్షల కోట్లు సేకరణ అయింది.  

దిగువ పట్టిక ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల  జీఎస్‌టీ ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. మార్చి 2022తో పోల్చితే 2023 మార్చి నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జీఎస్‌టీ రాష్ట్రాల వారీ గణాంకాలను పట్టిక చూపుతుంది.

 

రాష్ట్రాల వారీగా 2021 మర్చి లో జీఎస్‌టీ రెవెన్యూ:

(రూ. కోట్లలో)

 క్రమ సంఖ్య  

రాష్ట్రం 

మర్చి -2022

మర్చి -2023

వృద్ధి (%)

1

జమ్మూ కాశ్మీర్ 

368

477

29.42

2

హిమాచల్ ప్రదేశ్ 

684

739

8.11

3

పంజాబ్ 

1,572

1,735

10.37

4

చండీగఢ్ 

184

202

10.09

5

ఉత్తరాఖండ్ 

1,255

1,523

21.34

6

హర్యానా 

6,654

7,780

16.93

7

ఢిల్లీ 

4,112

4,840

17.72

8

రాజస్థాన్ 

3,587

4,154

15.80

9

ఉత్తర ప్రదేశ్ 

6,620

7,613

15.01

10

బీహార్ 

1,348

1,744

29.40

11

సిక్కిం 

230

262

14.11

12

అరుణాచల్ ప్రదేశ్ 

105

144

37.56

13

నాగాలాండ్ 

43

58

35.07

14

మణిపూర్ 

60

65

9.37

15

మిజోరాం 

37

70

91.16

16

త్రిపుర 

82

90

10.21

17

మేఘాలయ 

181

202

11.51

18

అస్సాం 

1,115

1,280

14.87

19

పశ్చిమ బెంగాల్ 

4,472

5,092

13.88

20

ఝార్ఖండ్ 

2,550

3,083

20.92

21

ఒడిశా 

4,125

4,749

15.14

22

ఛత్తీస్గఢ్ 

2,720

3,017

10.90

23

మధ్యప్రదేశ్ 

2,935

3,346

14.01

24

గుజరాత్ 

9,158

9,919

8.31

25

దామన్ దయ్యు 

 

 

 

26

దాద్రా నాగర్ హవేలీ 

284

309

8.99

27

మహారాష్ట్ర 

20,305

22,695

11.77

29

కర్ణాటక 

8,750

10,360

18.40

30

గోవా 

386

515

33.33

31

లక్షద్వీప్ 

2

3

30.14

32

కేరళ 

2,089

2,354

12.67

33

తమిళనాడు 

8,023

9,245

15.24

34

పుదుచ్చేరి 

 

 

***

 
 


(Release ID: 1913087) Visitor Counter : 226