ప్రధాన మంత్రి కార్యాలయం
నేశనల్ మేరిటైమ్ వీక్ ప్రారంభం అయిన సందర్భంలో అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి
Posted On:
31 MAR 2023 9:13AM by PIB Hyderabad
ఓడరేవు లు కేంద్ర స్థానం లో నిలబెడుతూ చోటు చేసుకొనేటటువంటి అభివృద్ధి ప్రయాసల కు మరియు ఆర్థిక సమృద్ధి కోసం సముద్రతీర ప్రాంతాల ను ఉపయోగించుకొనే ప్రయాసల కు నేశనల్ మేరిటైమ్ వీక్ మరింత బలాన్ని జోడిస్తుందన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
నేశనల్ మేరిటైమ్ వీక్ మొదలైన సందర్భం లో ప్రధాన మంత్రి కోటు కు తొలి మేరిటైమ్ ఫ్లాగ్ యొక్క నమూనా ను అలంకరించిన సంగతి ని గురించి కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ఒక ట్వీట్ లో తెలియజేయగా, ఆ ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరాన్ని ఇచ్చారు.
నేశనల్ మేరిటైమ్ డే ను ఏప్రిల్ 5 వ తేదీ న పాటించడం జరుగుతుంటుంది. మరి ఆ రోజు న భారతదేశం యొక్క సముద్ర సంబంధి సంప్రదాయం తాలూకు గౌరవశాలి చరిత్ర ను ఉత్సవం గా జరుపుకొంటారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన సమృద్ధమైనటువంటి సముద్ర సంబంధి చరిత్ర తో మనకు గల అనుబంధాన్ని నేశనల్ మేరిటైమ్ వీక్ గాఢతరం చేయు గాక. నౌకాశ్రయాల ను కేంద్ర స్థానం లో నిలబెడుతూ జరిగే అభివృద్ధి కి మరియు ఆర్థిక సమృద్ధి కై సముద్రతీర ప్రాంతాల ను ఉపయోగించుకొనే ప్రయాసల కు ఈ నేశనల్ మేరిటైమ్ వీక్ తో మరింత బలం లభించు గాక.’’ అని పేర్కొన్నారు.
****
DS
(Release ID: 1912541)
Read this release in:
Bengali
,
English
,
Gujarati
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam