ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

10 లక్షల మంది రోగులకు ఏ బీ హెచ్ ఏ ఆధారిత స్కాన్ & షేర్ సేవ ఆసుపత్రి క్యూలలో గడిపే సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది

Posted On: 29 MAR 2023 7:22AM by PIB Hyderabad

నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) తన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) పథకం కింద ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సామర్థ్యాన్ని తీసుకురావడానికి డిజిటల్ సాంకేతకపరమైన సేవలను ప్రారంభిస్తోంది. పాల్గొనే ఆసుపత్రులలోని ఒ పి డీ  (అవుట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్) బ్లాక్‌లలో రోగులకు తక్షణ రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించే స్కాన్ మరియు షేర్ అటువంటి సేవ. సేవల వినియోగం ప్రారంభించిన ఆరు నెలల్లోపే 10 లక్షల మంది రోగుల రిజిస్ట్రేషన్‌లను దాటింది. ఈ సేవ గత ఒక్క నెల లో (23 ఫిబ్రవరి 2023) మాత్రమే 5 లక్షల మంది రోగుల రిజిస్ట్రేషన్‌లను పూర్తి చేయడం గమనార్హం. స్కాన్ మరియు షేర్ సేవ యొక్క ప్రభావం  ఆమోదం సంఖ్యల పెరుగుదలలో స్పష్టంగా కనిపిస్తుంది.

 

స్కాన్ అండ్ షేర్ సర్వీస్ గురించి సీఈఓ, ఎన్ హెచ్ ఏ మాట్లాడుతూ – “ఏ బీ డీ ఎం డిజిటల్ సాంకేతకతను ఉపయోగించి నిరంతర ఆరోగ్య సంరక్షణ సేవల ఆవరణాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్కాన్ మరియు షేర్ ఫీచర్‌తో, ఆసుపత్రులకు రోగులు వారి ఏ బీ హెచ్ ఏ ప్రొఫైల్‌ను నేరుగా  పంపడం ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ సేవలను అందిస్తున్నాయి. ఇది రోగులు క్యూలలో నిలబడకుండా మరియు అనేక వివరాలను నమోదు చేయకుండా తక్షణ రిజిస్ట్రేషన్ టోకెన్లను పొందడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం, రోజుకు సగటున 25,000 ఒ పి డీ  టోకెన్లు ఇస్తున్నారు. త్వరలో రోజుకు 1 లక్ష టోకెన్‌లను దాటాలని మేము భావిస్తున్నాము. ఇంకా, రోగులు మరియు హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఇతర పరస్పర అనుసంధాన చర్యల కోసం ఫీచర్‌ను విస్తరించాలని మేము ప్లాన్ చేస్తున్నాము.

 

స్కాన్ మరియు షేర్ సేవ క్యూఆర్-కోడ్ ఆధారిత ప్రత్యక్ష సమాచార మార్పడి సాధారణ పద్ధతిలో పని చేస్తుంది. పాల్గొనే ఆసుపత్రులు వారి ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను వారి పేషెంట్ రిజిస్ట్రేషన్ కౌంటర్లలో ప్రదర్శిస్తాయి. సేవ కోసం మద్దతు ఉన్న మొబైల్ యాప్‌ని (ప్రస్తుతం ఏ బీ హెచ్ ఏ యాప్, ఆరోగ్య సేతు, డ్రిఫ్‌కేస్, పేటీఎం, బజాజ్ హెల్త్ మరియు ఎకాకేర్‌లో అందుబాటులో ఉంది) ఉపయోగించి క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయడానికి రోగులు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తారు. రోగి అప్పుడు వారి ఏ బీ హెచ్ ఏ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఖాతా)ని సృష్టిస్తాడు లేదా వారి ప్రస్తుత ఏ బీ హెచ్ ఏ ఖాతాకు లాగిన్ అవుతాడు.లాగిన్ అయిన తర్వాత, రోగి ఫారమ్‌ను భౌతికంగా పూరించాల్సిన అవసరం లేకుండా వారి రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి వారి ఏ బీ హెచ్ ఏ ప్రొఫైల్‌ను నేరుగా ఆసుపత్రితో పంచుకోవచ్చు. ఈ పేపర్‌రహిత రిజిస్ట్రేషన్ ఫలితంగా తక్షణ టోకెన్ ఉత్పత్తి అవుతుంది, తద్వారా రోగి వారి ఏ బీ హెచ్ ఏ ని ఉపయోగించడం ద్వారా దీర్ఘ క్యూను దాటవేయడంలో సహాయపడుతుంది.

 

ఈ సేవను ఎన్ హెచ్ ఏ  6 అక్టోబర్ 2022న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీలోని శ్రీమతి సుచేతా కృప్లానీ హాస్పిటల్ హాస్పిటల్ ప్రారంభించారు. అప్పటి నుండి, 147 జిల్లాల్లోని 443 ఆసుపత్రులు ఈ సేవను స్వీకరించాయి మరియు రోగులు ప్రతిరోజూ ఒ పి డీ  రిజిస్ట్రేషన్ క్యూలలో గడిపే సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతున్నాయి. ఎయిమ్స్ - రాయ్‌పూర్, ఎన్ డీ ఎం సీ చరక్ పాలికా హాస్పిటల్ - న్యూఢిల్లీ, ఎల్ హెచ్ ఎం సీ, ఎస్ ఎస్ కే హెచ్, న్యూఢిల్లీ, సర్ సీ వీ రామన్ జనరల్ హాస్పిటల్ - బెంగళూరు మరియు ఎల్ బీ ఆర్ ఎన్ జాయింట్ హాస్పిటల్, కాన్పూర్ రోడ్ - లక్నోలో ఏ బీ హెచ్ ఏ ఆధారిత స్కాన్ మరియు షేర్ ఫంక్షనాలిటీని ఉపయోగించి ప్రతిరోజూ 25,000 మంది రోగులకు సహాయం చేస్తున్నారు. స్కాన్ మరియు షేర్ సేవ అమలుకు సంబంధించిన మరిన్ని గణాంకాలు ఏ బీ డీ ఎం పబ్లిక్ డాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

https://dashboard.abdm.gov.in/abdm/

 

ఆసుపత్రులు మరియు డిజిటల్ సొల్యూషన్ కంపెనీలు (DSCలు) వారి సాంకేతికతలో ఏ బీ హెచ్ ఏ-ఆధారిత స్కాన్ మరియు షేర్ సేవను  మరింత ప్రోత్సహించడానికి  ఏ బీ డీ ఎం డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ (DHIS) కింద అందిస్తున్న స్కాన్ మరియు షేర్ ను కూడా చేర్చింది. ఆరోగ్య సౌకర్యాలు అందించే సంస్థలు వారు సాధించిన ఏ బీ హెచ్ ఏ-ఆధారిత డిజిటల్ ఆరోగ్య సేవల సంఖ్య ఆధారంగా కూడా డీ హెచ్ ఐ ఎస్ కింద రూ. 4 కోట్లువరకు ప్రోత్సాహకాలను గెలుచుకునే అవకాశం ఉంది. డీ హెచ్ ఐ ఎస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి:

 

https://abdm.gov.in/DHIS

***



(Release ID: 1911802) Visitor Counter : 131