ప్రధాన మంత్రి కార్యాలయం
కలబురగి లో పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు కు గాను కర్నాటక కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 MAR 2023 5:50PM by PIB Hyderabad
కలబురగి లో పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్కు స్థాపన కు గాను కర్నాటక ప్రజల కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ-
‘‘కలబురగి లో పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్స్ పార్క్ స్థాపన కు గాను కర్నాటక లోని నా సోదరీమణుల కు మరియు నా సోదరుల కు ఇవే అభినందన లు. ఈ పార్కు కర్నాటక యొక్క సంపన్న జౌళి సంప్రదాయాన్ని ఒక వేడుక గా జరుపుకోవడం తో పాటు ప్రజల కు ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పించనుంది. #PragatiKaPMMitra” అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
“ಕಲಬುರಗಿಯಲ್ಲಿ ಪಿಎಂ ಮಿತ್ರ ಮೆಗಾ ಜವಳಿ ಪಾರ್ಕ್ ಸ್ಥಾಪನೆಗಾಗಿ ಕರ್ನಾಟಕದ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ ಅಭಿನಂದನೆಗಳು. ಈ ಪಾರ್ಕ್ ಕರ್ನಾಟಕದ ಶ್ರೀಮಂತ ಜವಳಿ ಪರಂಪರೆಯನ್ನು ಸಂಭ್ರಮಾಚರಿಸುತ್ತದೆ ಮತ್ತು ರಾಜ್ಯದ ಜನರಿಗೆ ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳನ್ನು ಸೃಷ್ಟಿಸುತ್ತದೆ.
#PragatiKaPMMitra”
లోక్ సభ ఎంపి డాక్టర్ శ్రీ ఉమేశ్ జి. జాదవ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబు ఇస్తూ, దేశం యొక్క వస్త్ర సంబంధి వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే శక్తి మెగా టెక్స్ టైల్స్ పార్కు కు ఉంది అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఇది కర్నాటక కు మరీ ముఖ్యం గా కలబురగి కి నిజంగా ఒక విశిష్టమైనటువంటి రోజు. ఈ టెక్స్ టైల్స్ పార్క్ స్థాపన ద్వారా, భారతదేశం యొక్క వస్త్ర సంబంధి వైవిధ్యం మరియు మన ప్రజల సృజనాత్మకత తాలూకు నిదర్శనల ను ప్రపంచం గమనిస్తుంది. #PragatiKaPMMitra’’ అని పేర్కొన్నారు.
“ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಮತ್ತು ವಿಶೇಷವಾಗಿ ಕಲಬುರಗಿಗೆ ನಿಜಕ್ಕೂ ವಿಶೇಷ ದಿನ. ಈ ಜವಳಿ ಪಾರ್ಕ್ ಮೂಲಕ ಜಗತ್ತು ಭಾರತದ ಜವಳಿ ವೈವಿಧ್ಯತೆ ಮತ್ತು ನಮ್ಮ ಜನರ ಸೃಜನಶೀಲತೆಯ ದರ್ಶನ ಪಡೆಯುತ್ತದೆ.
#PragatiKaPMMitra”
*****
DS
(रिलीज़ आईडी: 1911651)
आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam