హోం మంత్రిత్వ శాఖ
బెంగళూరులో శుక్రవారం "మాదక ద్రవ్యాల రవాణా మరియు జాతీయ భద్రత" అంశంపై శుక్రవారం జరిగిన ప్రాంతీయ మహాసభకు అధ్యక్షత వహించిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. ఇండియాను మాదకద్రవ్యరహిత దేశంగా మార్చడానికి ఏ మాత్రం క్షమకు తావులేని విధానం ఆచరిస్తోంది.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ప్రభుత్వం జరుపుతున్న పోరాటం కాదు, అది మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలు జరుపుతున్న పోరాటం.
ప్రభుత్వ సంస్థలు స్వాధీనం చేసుకున్న రూ. 1235 కోట్ల విలువైన 9,298 కిలోల మత్తుమందులు, మాదకద్రవ్యాలను కేంద్ర హోమ్ మంత్రి సమక్షంలో ధ్వంసం చేశారు.
2022 జూన్ 1వ తేదీన ప్రారంభించిన ప్రచారోద్యమంలో 75,000 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్దేశిత లక్ష్యానికి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా రూ.8,409 కోట్ల విలువైన 5,94,620 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేయడం జరిగింది.
మాదక ద్రవ్యాల విషయంలో హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'కింది నుంచి పైకి' మరియు 'పై నుంచి కిందికి' విధానాన్ని అనుసరిస్తోంది. ప్రమాదకర మాదక ద్రవ్యాల భూతాన్ని అంతం చేయడానికి రాష్ట్రాలు మరియు సంస్థలు కూడా అదే దారిలో వెళ్లాలి.
దేశ భద్రతకు మరియు
Posted On:
24 MAR 2023 4:33PM by PIB Hyderabad
"మాదక ద్రవ్యాల రవాణా మరియు జాతీయ భద్రత" అనే అంశంపై కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం జరిగిన ప్రాంతీయ మహాసభకు కేంద్ర హోమ్ శాఖ మరియు సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ మహాసభలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు , మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో స్వాధీనం చేసుకున్న రూ. 1235 కోట్ల విలువైన 9,298 కిలోల మత్తుమందులు, మాదకద్రవ్యాలను కేంద్ర హోమ్ మంత్రి సమక్షంలో ధ్వంసం చేశారు. అది కాకుండా, కర్ణాటకలోని శివమొగ్గలో కొత్త క్యాంపస్ ఏర్పాటు కోసం 'రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ' మరియు కర్ణాటక ప్రభుత్వం మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై మంత్రి సమక్షంలో సంతకాలు చేశారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. ఇండియాను మాదకద్రవ్యరహిత దేశంగా మార్చడానికి ఏ మాత్రం క్షమకు తావులేని విధానం ఆచరిస్తోందని కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి తమ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా 2022 జూన్ 1వ తేదీ నుంచి చేపట్టిన 75 రోజుల ప్రచారోద్యమంలో 75,000 కిలోల మాదకద్రవ్యాలను, మత్తుమందులను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో నిర్దేశిత లక్ష్యానికి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా రూ.8,409 కోట్ల విలువైన 5,94,620 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేయడం జరిగిందని హోమ్ మంత్రి తెలిపారు. మొత్తం ధ్వంసం చేసిన మాదక ద్రవ్యాలలో రూ. 3,138 కోట్ల విలువైన 1,29,363 కిలోల మాదకద్రవ్యాలను ఒక్క ఎన్ సి బి మాత్రమే ధ్వంసం చేసిందన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదేశం మేరకు హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాదక ద్రవ్యాల నిర్మూలనకు త్రివిధ మార్గాన్ని అనుసరిస్తున్నదని శ్రీ అమిత్ షా తెలిపారు. సంస్థాగత నిర్మాణక్రమాన్ని పటిష్టం చేయడం , మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన అన్ని సంస్థలకు సాధికారత కల్పించడం మరియు ఆ సంస్థల మధ్య సమన్వయం దృఢపరచడం మరియు ప్రజలను జాగృతం చేసేందుకు ప్రచారోద్యమం నిర్వహించడం త్రివిధ మార్గాలు.
మాదక ద్రవ్యాల రవాణా కేవలం ఒక్క రాష్ట్రానికో లేక కేంద్రానికి మాత్రమే సంబంధించినది కాదని, ఇది మొత్తం జాతికి సంబంధించిన సమస్య అని మరియు ఈ సమస్య పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో మరియు ఐక్యంగా ప్రయత్నాలు జరగాలని ఆయన అన్నారు.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రభుత్వం మాత్రమే కాక ప్రజలు కూడా పోరాటం చేయాలని ఆయన అన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయం కోసం క్రమం తప్పకుండా జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో సమావేశాలు జరపాలని కూడా ఆయన ఉద్ఘాటించారు.
మాదక ద్రవ్యాల రవాణా యంత్రాంగం నడ్డివిరిచి చిన్నాభిన్నం చేయడానికి మాదకద్రవ్యాల కేసులను సమగ్రంగా పరిశోధించాలని / దర్యాప్తు చేయాలని, ఇందుకోసం కింది నుంచి పైకి మరియు పై నుంచి కిందకు విధానాన్ని అవలంభించాలని కేంద్ర హోమ్ మంత్రి ఉద్ఘాటించారు.
ఏ కేసు కూడా వేరుగా పరిశోధించరాదని ఆయన అన్నారు. ఏడేళ్లలో 2006-2013 సంవత్సరాల మధ్య మొత్తం 1257 కేసులు నమోదయ్యాయని, 2014-2022 సంవత్సరాలలో అవి 152 శాతం పెరిగి 3172కు చేరాయని , అదే సమయంలో అరెస్టయిన వారి
సంఖ్య 260 శాతం పెరిగి 1362 నుంచి 4888కు చేరాయని అన్నారు. అదే విధంగా 2006-2013 మధ్య 1.52 లక్షల కిలోల మత్తు మందులు, మాదక ద్రవ్యాలను పట్టుకోగా 2014-2022 నాటికి అవి రెట్టింపై 3.30 లక్షల కిలోలకు చేరాయి. 2006-2013 మధ్య స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ రూ. 768 కోట్లు కాగా 2014-2022 మధ్య కాలానికి స్వాధీనం చేసుకున్న వాటి విలువ 25 రెట్లు పెరిగి రూ. 20,000 కోట్లకు చేరింది.
దేశంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రచారోద్యమం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో చురుకుగా సాగుతున్నదని హోమ్ మంత్రి తెలిపారు. ఈ లక్ష్య సాధనకోసం నాలుగు స్తంభాల వంటి మార్గాలను ఎంచుకున్నారు. అవి: మాదక ద్రవ్యాలను గుర్తించడం, సరఫరాదారుల యంత్రాంగం నాశనం చేయడం, నేరస్థులను నిర్బంధించడం, ఈ వ్యసనానికి బానిసలుగా మారిన వారికి పునరావాసం కల్పించడమని మంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా చర్యలు తీసుకోవడానికి అన్ని రాష్ట్రాలు ఎన్ సి ఓ ఆర్ డి (NCORD) పోర్టల్ మరియు నిదాన్ (NIDAAN) వేదికను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన అన్నారు. ఈ పోరాటాన్ని సమర్ధవంతంగా జరిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడాన్ని వివిధ రాష్ట్రాలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దళాలను (Task Force) శక్తివంతంగా మార్చాలని ఆయన అన్నారు. దానితో పాటు మాదక ద్రవ్యాలు, మనిషి ప్రవర్తన, మెదడుపై ప్రభావం చూపే మత్తు పదార్ధాలకు సంబంధించిన చట్టం (NDPS Act) నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ' ప్రభుత్వం సంపూర్ణంగా కలసికట్టుగా పనిచేసే పధ్ధతి'ని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని, ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థల మధ్య సహకారం, సమన్వయము, భాగస్వామ్యం పెంపొందించారు. ఆ విధంగా ప్రభుత్వం మాదకద్రవ్యరహిత ఇండియా దిశగా ముందడుగు వేస్తోందని కూడా మంత్రి తెలియజేశారు. ఇవన్నీ కాకుండా దక్షిణాది సముద్ర మార్గంలో గట్టి నిఘా అవసరమని, ఇందుకోసం తీరప్రాంత భద్రత మరియు సముద్ర మార్గాలపై దృష్టిని కేంద్రీకరించి కాపాడాలని కూడా మంత్రి అన్నారు.
****
(Release ID: 1910511)
Visitor Counter : 205