ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

షిల్లాంగ్‌లో ఈ రోజు జరిగిన అస్సాం రైఫిల్స్ 188వ రైజింగ్ డే వేడుకలో ప్రసంగించిన డోనెర్, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


అస్సాం రైఫిల్స్ 1835 నుండి అసమానమైన శౌర్య వారసత్వానికి ప్రతీక, విధి నిర్వహణలో ధైర్యవంతులైన
సైనికుల అత్యున్నత త్యాగం ద్వారా అత్యధిక శౌర్య పురస్కారాలను అందించిన ఘనతను పొందింది

అమృత్‌కాల్‌లో ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశ గ్రోత్ ఇంజిన్‌గా మార్చాలన్నదే ప్రధానమంత్రి విజన్.

ఈ దృక్పథానికి అనుగుణంగా, ఈశాన్య ప్రాంతంలో కొత్త శకం ప్రారంభం,
మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, శాంతి, స్థిరత్వం... ఇలా అన్నిటా వేగంగా అభివృద్ధి చెందింది.

ఈశాన్య ప్రాంతంలో ఈ కొత్త నమూనాను సాధించడంలో అస్సాం రైఫిల్స్ ప్రధాన సహకారం అందించింది.

విపత్తు నిర్వహణ కార్యకలాపాల సమయంలో ఈ దళం చేసిన కృషికి మంత్రి ప్రశంస, వారి అరుదైన శక్తి ప్రదర్శన,
టీమ్ వర్క్ కారణంగా ఈ దళాన్నిఎన్ డి ఆర్ ఎఫ్ యూనిట్‌గా పంపించడాన్ని మంత్రి అభినందించారు.

దళంలోని రైఫిల్ మహిళల సేవలను ప్రశంసించిన శ్రీ జి. కిషన్ రెడ్డి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షక దళాలలో, భారతదేశ నారీ శక్తికి ప్రతీకలుగా వారి సేవలను కొనియాడారు.

Posted On: 24 MAR 2023 12:58PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి (డోనెర్), సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈరోజు షిల్లాంగ్‌లో జరిగిన అస్సాం రైఫిల్స్ 188వ రైజింగ్ డే వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అస్సాం రైఫిల్స్‌కు 1835 నుండి అసమానమైన శౌర్య వారసత్వం కలిగి ఉందని, అత్యధిక సంఖ్యలో శౌర్య పురస్కారాలను అందించిన ఘనత కూడా ఉందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ధైర్యవంతులైన బలగాల అత్యున్నత త్యాగం ద్వారా ఈ ప్రత్యేకత సాధ్యమైందని ఆయన అన్నారు. 

 

ఎర్రకోట నుండి భారత ప్రధాని తన ప్రసంగంలో “అమృత్ కాల్” ఆలోచనను దేశానికీ అందించారని, దేశం పురోగతి రోడ్ మ్యాప్‌ను ప్రకాశవంతం చేశారని మంత్రి అన్నారు. ఈ అమృత్‌కాల్‌లో ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశ గ్రోత్ ఇంజన్‌గా ఏర్పాటు చేయాలనేది గౌరవనీయులైన ప్రధానమంత్రి విజన్ అని ఆయన అన్నారు. ఈ దృక్పథానికి అనుగుణంగా, ఈశాన్య ప్రాంతంలో కొత్త శకం ప్రారంభమైందని, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, శాంతి, స్థిరత్వం ఇలా అన్నిటా అభివృద్ధి వేగంగా చెందిందని ఆయన అన్నారు. 8000 మందికి పైగా సాయుధ సిబ్బంది లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరారని, ప్రధానమంత్రి నాయకత్వంలో అనేక శాంతి ఒప్పందాలు జరిగాయని మంత్రి తెలిపారు.

ఈ ప్రాంతంలో ప్రభుత్వం సాధించిన వివిధ విజయాలను శ్రీ కిషన్‌రెడ్డి వివరించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి నిరాటంకంగా కొనసాగేందుకు గత 9 ఏళ్లలో 5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని, 17 కొత్త విమానాశ్రయాలు, 1.05 లక్షల విలువైన రోడ్డు ప్రాజెక్టులు, రూ. 77,930 కోట్లతో కొనసాగుతున్న రైలు ప్రాజెక్టులు వంటి అనేక మెగా కనెక్టివిటీ ప్రాజెక్టులు వేగవంతంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. నేడు ఈశాన్యంలో ప్రతి రంగం ప్రజలకు వృద్ధికి అనేక అవకాశాలను తెరిచేందుకు వేగవంతం చేస్తోందని తెలిపారు.

ఈశాన్య ప్రాంతానికి ఈ కొత్త నమూనాను సాధించడంలో అస్సాం రైఫిల్స్‌కు ప్రధాన పాత్ర ఉందని ఆయన అన్నారు. ఈ శాంతి యుగం వల్ల ఈశాన్య ప్రాంతం నిజమైన సామర్థ్యాన్ని మనం గ్రహించగలిగామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్న వివిధ జి20 శిఖరాగ్ర సమావేశాల సదస్సుల సందర్భంగా మనం ఇప్పుడు వివిధ రంగాలలో మన బలాన్ని ప్రపంచ సమాజానికి నమ్మకంగా ప్రదర్శించగలమని ఆయన అన్నారు. ఈ ప్రాంతం అంతటా జరుగుతున్న ఈ G20 సమావేశాలు అష్టలక్ష్మి రాష్ట్రాలను భారతదేశ వృద్ధి కేంద్రాలుగా నిలబెట్టడంలో సహాయపడతాయని కూడా ఆయన అన్నారు.

 

 

పత్తు నిర్వహణ కార్యకలాపాల సమయంలో దళం చేసిన కృషిని కూడా మంత్రి ప్రశంసించారు. అటువంటి సమయాల్లో వారి అరుదైన శక్తి ప్రదర్శన, ఉమ్మడి సంఘటిత శక్తి కారణంగా దళం ఎన్ డి ఆర్ ఎఫ్ యూనిట్‌గా సేవలను పొందామని ఆయన ప్రశంసించారు. శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ ప్రాంతంలో డ్రగ్ ట్రాఫికింగ్, ఇతర నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి అస్సాం రైఫిల్ చేస్తున్న కృషిని అభినందించారు.

 

 

శ్రీ జి. కిషన్ రెడ్డి దళంలోని రైఫిల్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతి పరిరక్షక దళాలలో భారతదేశ నారీ శక్తికి ఈ మహిళా దళాలు ప్రతీకగా నిలిచాయని, వారి సేవలను కొనియాడారు. అస్సాం రైఫిల్స్ అనేక సందర్భాల్లో ఇంకా ముందుకు దూసుకుపోయిందని అన్నారు. వైద్య శిబిరాలు, మహిళా సాధికారత పథకాలు, జాతీయ సమైక్యత పర్యటనలు మొదలైన వివిధ పౌర కార్యాచరణ ప్రాజెక్టులలో ఉత్సాహంగా పాల్గొన్నాయని ఆయన అన్నారు. .

ఈ ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వం కోసం అంకితభావం, అభిరుచి, త్యాగం కోసం ఈ దళాన్ని 'ఈశాన్య ప్రాంతంలోని సెంటినెల్స్' , 'హిల్ పీపుల్స్ స్నేహితులు' అని పిలుస్తారు.

 

******


(Release ID: 1910510) Visitor Counter : 130