హోం మంత్రిత్వ శాఖ

రేపు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన రేపు బెంగళూరు (కర్ణాటక)లో జరగనున్న 'మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు జాతీయ భద్రత' ప్రాంతీయ సదస్సు


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మాదకద్రవ్యాల రహిత భారతాన్ని రూపొందించడానికి మాదకద్రవ్యాల రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

స్వాధీనం చేసుకున్న 9,298 కిలోల మాదకద్రవ్యాల విధ్వంసాన్ని పర్యవేక్షించనున్న కేంద్ర ,హోం మంత్రి
2022 జూన్ 01 నుంచి 75 రోజుల వ్యవధిలో 75,000 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుని 2022 జూన్ 1 నాటికి లక్ష్యాలకు మించి 5,94,620 కిలోల మాదకద్రవ్యాలను ధ్వంసం చేసిన అధికారులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు అన్ని నార్కోటిక్స్ ఏజెన్సీల సంస్థాగత నిర్మాణం, సాధికారత, సమన్వయాన్ని బలోపేతం చేయడం, మాదకద్రవ్యాల రవాణాపై అరికట్టడానికి సమగ్ర అవగాహన కల్పించడం అనే త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్న కేంద్ర హోంశాఖ

Posted On: 23 MAR 2023 3:45PM by PIB Hyderabad

రేపు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన రేపు  బెంగళూరు (కర్ణాటక)లో  'మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు జాతీయ భద్రత' ప్రాంతీయ సదస్సు జరగనున్నది. సమావేశంలో 5 దక్షిణాది రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటారు.స్వాధీనం చేసుకున్న  రూ.1,235 కోట్ల విలువ చేసే  9,298 కిలోల మాదక ద్రవ్యాల ధ్వంసం చేయడానికి ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. 

సమావేశంలో సముద్ర మార్గం ద్వారా జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు అమలు చేయాల్సిన చర్యలు, అక్రమ రవాణా పూర్తిగా నిలిచిపోయేలా చూసేందుకు మాదకద్రవ్యాల స్మగ్లర్లపై కఠిన  చర్యలు తీసుకోవడం, రాష్ట్ర, కేంద్ర మాదకద్రవ్యాల చట్ట అమలు సంస్థల మధ్య నిరంతర సమన్వయం/ సహకారం సాధించి సమిష్టి అవగాహన కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం లాంటి ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల రహిత భారతాన్ని రూపొందించడానికి మాదకద్రవ్యాల రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది.  

ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా  2022 జూన్ 01 నుంచి  75 రోజుల వ్యవధిలో  75,000 కిలోల మాదకద్రవ్యాలను నాశనం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అయితే, అధికారులు లక్ష్యాన్ని అధిగమించి 2022 జూన్ 1 నాటికి   5,94,620 కిలోల మాదకద్రవ్యాలను  అధికారులు ధ్వంసం చేశారు.స్వాధీనం చేసుకున్న మొత్తం డ్రగ్స్ లో రూ.3,138 కోట్ల విలువైన 1,29,363 కిలోల మాదకద్రవ్యాలను ఎన్ సీబీ ధ్వంసం చేసింది. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు అన్ని నార్కోటిక్స్ ఏజెన్సీల సంస్థాగత నిర్మాణం, సాధికారత, సమన్వయాన్ని బలోపేతం చేయడం, మాదకద్రవ్యాల రవాణాపై  అరికట్టడానికి సమగ్ర అవగాహన కల్పించడం అనే త్రిముఖ వ్యూహం  కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో అమలు జరుగుతోంది. 

మాదకద్రవ్యాల స్మగ్లింగ్ సమస్య కేంద్రానికి లేదా రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని, జాతీయ సమస్య అని ప్రభుత్వం గుర్తించింది. సమస్యను  ఎదుర్కోవడానికి జరిగే  ప్రయత్నాలు కూడా జాతీయంగా, సమిష్టిగా అమలు జరగాల్సి ఉంటుంది. మాదకద్రవ్యాల సమస్యను  సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాలు క్రమం తప్పకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఎన్సీఓఆర్డీ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

    మాదకద్రవ్యాల అణచివేతకు జరుగుతున్న కార్యక్రమాల అమలులో  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం , నల్లమందు పండించే ప్రాంతాలను గుర్తించి నియంత్రించేందుకు డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ మ్యాపింగ్ వాడకాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మాదకద్రవ్యాల కేసులో దాని మూలం నుంచి  గమ్యస్థానం వరకు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దాని మొత్తం వ్యవస్థ నాశనం చేయాలని అధికారులు నిర్ణయించారు. 

***(Release ID: 1910042) Visitor Counter : 148