ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 24న వారణాసి సందర్శించనున్న ప్రధాన మంత్రి


క్షయవ్యాధిపై ప్రపంచ శిఖరాగ్రసభలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

క్షయవ్యాధి లేని పంచాయత్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధాని, దేశవ్యాప్త స్వల్పకాలిక టి బి నిరోధక చికిత్స మరియు టి బికి కుటుంబ చికిత్సా నమూనా ప్రారంభం

రూ. 1780 కోట్ల విలువకు పైబడిన వివిధ ప్రాజెక్టులకు శంఖుస్థాపన మరియు అంకితం చేయనున్న ప్రధాని

ఈ ప్రాజెక్టుల వల్ల వారణాసి భూదృశ్యం / ప్రకృతి చిత్రం పరివర్తన చెందడమే కాక నగర పౌరుల జీవనం మరింత సుఖవంతమవుతుంది.

వారణాసి కంటోన్మెంట్ స్టేషన్ నుంచి గోడౌలియా వరకు ప్రయాణీకుల రోప్ వే నిర్మాణానికి ప్రధానమంత్రి శంఖుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల యాత్రికులు, పర్యాటకులు మరియు స్థానికుల కదలిక మరింత సులభమవుతుంది.

Posted On: 22 MAR 2023 4:07PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఏప్రిల్ 24వ తేదీన వారణాసి సందర్శిస్తారు.   ఉదయం పదిన్నరకు  ప్రధాని రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో  క్షయవ్యాధిపై ప్రపంచ శిఖరాగ్రసభలో ప్రశ్నగిస్తారు.   మధ్యాహ్నం 12 గంటలకు రూ. 1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల అంకితం  మరియు శంఖుస్థాపన  సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో చేస్తారు.

క్షయవ్యాధిపై ప్రపంచ శిఖరాగ్రసభ  

      ప్రపంచ క్షయవ్యాధి దినం సందర్బంగా  ప్రధానమంత్రి  క్షయవ్యాధిపై ప్రపంచ శిఖరాగ్రసభలో ప్రసంగిస్తారు.  కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మరియు టిబిని అంతం చేసే భాగస్వామ్య సంస్థ ఈ శిఖరాగ్ర సభను ఏర్పాటుచేస్తున్నది.

       టిబిని అంతం చేసే భాగస్వామ్యాన్ని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది.   ఈ సంస్థ ప్రజల, సమాజాల మరియు క్షయవ్యాధి ప్రభావిత దేశాల అభిప్రాయాలను విస్తరించి చెప్తుంది.    ఈ సందర్బంగా ప్రధానమంత్రి క్షయవ్యాధి లేని పంచాయత్ కార్యక్రమంతో
సహా వివిధ ఉపక్రమణ చర్యలను ప్రారంభిస్తారు.  దేశవ్యాప్త స్వల్పకాలిక టి బి నిరోధక చికిత్స మరియు టి బికి కుటుంబ చికిత్సా నమూనాను ప్రారంభిస్తారు.  మరియు 2023 సంవత్సరానికి ఇండియా వార్షిక టిబి నివేదికను విడుదల చేస్తారు.

        క్షయవ్యాధిని అంతం చేయడంలో  ప్రగతి సాధించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధానమంత్రి అవార్డులు ఇస్తారు.
క్షయవ్యాధిని అంతం చేయడానికి న్యూఢిల్లీలో  2018 మార్చిలో జరిగిన టిబి అంతానికి శిఖరాగ్ర సభ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ  నిర్ణీత సమయానికి ఐదేళ్ల ముందు 2025 నాటికి ఇండియా టిబి సంబంధిత సహనీయ అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని పిలుపు ఇచ్చారు.  
         
         దేశం క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాలను చేరుకునే క్రమంలో  ప్రపంచ శిఖరాగ్రసభ ఏర్పాటు లక్ష్యాలను చేరుకోవడాన్ని పర్యావలోకనం చేయడానికి  అవకాశం కల్పిస్తుంది.  అదే సమయంలో జాతీయ టిబి నిర్మూలన కార్యక్రమం ద్వారా తెలుసుకున్న విషయాల వెల్లడికి కూడా అవకాశం కల్పిస్తుంది.   30 ప్రపంచ దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధులు శిఖరాగ్ర సభకు హాజరవుతారు.
         
వారణాసిలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు

      వారణాసిలో మరియు నగరం చుట్టుప్రక్కల  భూదృశ్యం / ప్రకృతి చిత్రం పరివర్తన చెందడమే కాక నగర పౌరుల జీవనం మరింత సుఖవంతం చేయడానికి  గత తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి తమ దృష్టిని కేంద్రీకరించారు.  ఈ దిశలో మరో ముందడుగేస్తూ  ప్రధానమంత్రి  రూ. 1780 కోట్ల విలువైన ప్రాజెక్టులను  సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం మైదానంలో జరిగే కార్యక్రమంలో అంకితం మరియు శంఖుస్థాపన  చేస్తారు.

       వారణాసి కంటోన్మెంట్ స్టేషన్ నుంచి గోడౌలియా వరకు ప్రయాణీకుల రోప్ వే నిర్మాణానికి ప్రధానమంత్రి శంఖుస్థాపన చేస్తారు.  ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 645 కోట్లు ఖర్చు కాగలదని అంచనా.   రోప్ వే వ్యవస్థ ఐదు స్టేషన్లతో 3.75 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.  దీనివల్ల పర్యాటకులు, యాత్రికులు మరియు వారణాసి స్థానికుల కదలిక మరింత సులభమవుతుంది.
       
         నమామి గంగే పథకం కింద భగవాన్ పూర్ వద్ద రోజుకు 55 మిలియన్ లీటర్లు శుద్ధి చేయగల ప్లాంటుకు ప్రధానమంత్రి శంఖుస్థాపన చేస్తారు.   ఈ ప్లాంటు నిర్మాణానికి రూ. 300 కోట్లకు పైగా ఖర్చు కాగలదని అంచనా.

          ఖేలో ఇండియా పథకం కింద సిగ్రా స్టేడియం 2వ, 3వ దశ పునర్వికాసం పనులకు ప్రధానమంత్రి శంఖుస్థాపన చేస్తారు.

           ఇసర్వర్  గ్రామంలో సేవాపురి వద్ద  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ నిర్మించే  ఎల్ పి జి బాట్లింగ్ ప్లాంటుకు, భర్తారా గ్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సహా  తేలియాడే జెట్టి తదితర ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంఖుస్థాపన చేస్తారు.  

           జల జీవన్ మిషన్ కింద 63 గ్రామపంచాయతీలలో  3 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూర్చే  19 మంచి నీటి పథకాలను ప్రధాని జాతిజనులకు అంకితం చేస్తారు.   ఈ కార్యక్రమం కింద గ్రామీణ మంచినీటి వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి 59 మంచినీటి స్కీములకు ప్రధానమంత్రి శంఖుస్థాపన చేస్తారు.  

            రైతులకు, ఎగుమతిదారులకు మరియు వర్తకులకు ఉపయోగపడే పళ్ళు, కూరగాయల సమగ్ర ప్యాకింగ్ హౌజ్ ప్రాజెక్టును ఈ సందర్బంగా ప్రధాని జాతికి అంకితం చేస్తారు.  దీనివల్ల వారణాసి మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యవసాయ ఎగుమతులను  పెంచుతుంది.

            వారణాసి స్మార్ట్ సిటీ మిషన్ కింద రాజఘాట్ మరియు మహామూర్గంజ్ ప్రభుత్వ స్కూళ్ల  పునర్వికాసం ,  నగరంలో అంతర్ రోడ్ల సుందరీకరణ ,  ఆరు పార్కుల పునర్వికాసంతో పాటు ఇతర ప్రాజెక్టులను ప్రధాని అంకితం చేస్తారు.

           ప్రధానమంత్రి అంకితం చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో లాల్ బహదూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏ టి సి టవర్ ,  భేలుపూర్ లో  2 మెగావాట్ల సౌరశక్తి ప్లాంటు, కోనియా పంపింగ్ స్టేషన్ వద్ద   800 కిలోవాట్ల సౌరశక్తి ప్లాంటు,  సారనాధ్ వద్ద సామాజిక ఆరోగ్య  కేంద్రం,  చాంద్ పూర్ పారిశ్రామిక వాడలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం,  కేదారేశ్వర్, విశ్వేశ్వర్ దేవాలయాలు మరియు ఓంకారేశ్వర్ ఖండ్ పరిక్రమ కాయకల్పం వంటివి ఉన్నాయి.  

***


(Release ID: 1909755) Visitor Counter : 138