హోం మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో మా శారదా దేవి ఆలయాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కేంద్ర హోం మరియు సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా


నూతన సంవత్సర శుభ సందర్భంగా శారదా మాత ఆలయ పునర్నిర్మాణం జమ్ము కశ్మీర్‌ భక్తులకు నిజంగా కొత్త శకానికి నాంది

కుప్వారాలోని మా శారదా ఆలయ పునర్నిర్మాణం శారదా నాగరికత ఆవిష్కరణ మరియు శారదా లిపిని ప్రోత్సహించే దిశలో అవసరమైన మరియు ముఖ్యమైన దశ.

శారదా పీఠం కర్తార్‌పూర్ కారిడార్ వంటి భారతదేశ సాంస్కృతిక, మతపరమైన మరియు విద్యా వారసత్వానికి చారిత్రక కేంద్రంగా ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం భక్తుల కోసం శారదా పీఠాన్ని తెరవడానికి ముందుకు సాగుతుంది.

ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత, జమ్మూ మరియు కాశ్మీర్ లోయలో శాంతి నెలకుంది. జమ్మూలో మళ్లీ పాత నాగరికత మరియు సంప్రదాయాలు సంస్కృతి పునరుజ్జీవనం కొనసాగుతోంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక దేవాలయాలు మరియు కేంద్రాలను పునరుద్ధరిస్తోంది.

Posted On: 22 MAR 2023 3:43PM by PIB Hyderabad

కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో మా శారదా దేవి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

image.png

శ్రీ అమిత్ షా దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నూతనంగా నిర్మించిన మా శారదా ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం జరిగిందని, ఇది భారతదేశ నలుమూలల నుండి వచ్చిన భక్తులకు శుభసూచకమని అన్నారు. నేడు మా శారదా ఆలయ ప్రారంభోత్సవం నూతన శకానికి నాంది అన్నారు.

image.png

 

శారదా పీఠ్ ఆధ్వర్యంలో పౌరాణిక గ్రంధాల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి తెలిపారు. శృంగేరి మఠం వారు విరాళంగా ఇచ్చిన శారదామాత విగ్రహం ఇక్కడ ప్రతిష్టించడం జనవరి 24 నుండి నేటి వరకు ఒక ప్రయాణం లాంటిది. కుప్వారాలోని మా శారదా ఆలయ పునర్నిర్మాణం శారదా నాగరికత పునరుద్ధరణ మరియు శారదా లిపిని ప్రోత్సహించే దిశలో అవసరమైన మరియు ముఖ్యమైన ముందడుగు. ఒకప్పుడు శారదా పీఠాన్ని భారతదేశంలో విజ్ఞాన కేంద్రంగా భావించేవారని శ్రీ అమిత్ షా అన్నారు. భారత ఉపఖండంతో పాటు దేశం నలుమూలల నుండి పండితులు గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చేవారు. శారదా లిపియే మన కాశ్మీర్‌కు మూల లిపి అని దీనికి మా శారద పేరు పెట్టారు. ఇది మహాశక్తి పీఠాలలో ఒకటి మరియు మత విశ్వాసాల ప్రకారం  సతీదేవి కుడి చేయి ఇక్కడ పడింది.

 

image.png

 

శారదా పీఠం భారతదేశ సాంస్కృతిక, ధార్మిక మరియు విద్యా వారసత్వానికి చారిత్రక కేంద్రంగా నిలిచిందని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కర్తార్‌పూర్ కారిడార్ మాదిరిగానే శారదా పీఠాన్ని భక్తుల కోసం తెరవడానికి ముందుకు సాగుతుందని కేంద్ర హోం మరియు సహకార మంత్రి తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషి వల్ల కాశ్మీర్‌లో శాంతి నెలకొందని, కాశ్మీర్ లోయతో పాటు జమ్మూలో మళ్లీ తమ పాత సంప్రదాయాలు, నాగరికత మరియు గంగా-జమునీ తహజీబ్‌కి తిరిగి వస్తున్నాయని ఆయన అన్నారు. సామాజిక మరియు ఆర్థిక పరివర్తనకు కట్టుబడి ఉన్నందున,ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జమ్మూ మరియు కాశ్మీర్‌లోని సంస్కృతి పునరుజ్జీవనంతో సహా అన్ని రంగాలలో చొరవ చూపిందని శ్రీ షా చెప్పారు. దీని కింద గుర్తించబడిన 123 ప్రదేశాలలో క్రమబద్ధమైన పునరుద్ధరణ మరియు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని ఇందులో అనేక దేవాలయాలు మరియు సూఫీ ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు.  మొదటి దశలో రూ.65 కోట్లతో 35 స్థలాలను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. 75 మత, సూఫీ సాధువులను గుర్తించి 31 మెగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు  తెలిపారు. ప్రతి జిల్లాలో 20 సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, ఇవి మన పాత వారసత్వాన్ని పునరుద్ధరించడం లో సహాయపడతాయని శ్రీ షా చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రధాన ప‌థ‌కాల‌న్నింటినీ జ‌మ్మూ క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్‌ శ్రీ మ‌నోజ్ సిన్హా అమ‌లు చేయ‌డం ప్రశంస‌నీయ‌మ‌ని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో శ్రీ మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్‌లో పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన అన్నారు. నేటి ప్రారంభం ఈ ప్రదేశానికి కోల్పోయిన వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి దోహదపడుతుందని, మా శారదా ఆశీర్వాదంతో పూజా కేంద్రంగా నిలుస్తుందని మరియు భారతదేశ చైతన్యాన్ని యుగయుగాలుగా మేల్కొల్పడానికి కొనసాగుతుందని ఆయన అన్నారు.


 

****



(Release ID: 1909723) Visitor Counter : 123