ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఉమ్మడిగా ప్రారంభించిన భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్


భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి

బంగ్లాదేశ్ తో పెరిగిన అనుసంధానత వల్ల ప్రజల మధ్య బంధం మరింత బలోపేతం

Posted On: 18 MAR 2023 6:03PM by PIB Hyderabad

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఈరోజు ఉమ్మడిగా  భారత్-బంగ్లాదేశ్ మైత్రి పైప్ లైన్  (ఐబీఎఫ్ పి) ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణానికి ఇరుదేశాల ప్రధానులు 2018 సెప్టెంబర్ లో శంకుస్థాపన చేశారు. నుమాలీగర్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ 2015 నుంచి బంగ్లాదేశ్ కు పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేస్తోంది. భారత్ కు పొరుగుదేశంతో ఉన్న రెండో  సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐ బి ఎఫ్ పి.   

భారత్-బంగ్లాదేశ్ సంబంధాలలో ఇంధన, విద్యుత్ సహకారం చాలా కీలకంగా ఉంటోంది. బంగ్లాదేశ్ కు హి స్పీడ్ డీజిల్ సరఫరా చేయటానికి భారత్-బంగ్లాదేశ్ మధ్య మొట్ట మొదటి  సీమాంతర ఇంధన పైప్ లైన్ ఐబీఎఫ్ పి. దీని రవాణా  సామర్థ్యం   ఏడాదికి 1 మిలియన్ మెట్రిక్ టన్నులు.  బంగ్లాదేశ్ తో పెరిగిన అనుసంధానత  వల్ల ఇరుదేశాల  ప్రజల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది.  

భారత దేశపు అభివృద్ధి భాగస్వాములలో బంగ్లాదేశ్ చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా బంగ్లాదేశ్.  ఈ మైత్రీ పైప్ లైన్ వాడకంలోకి వచ్చిన తరువాత రెండు దేశాల మధ్య ఇప్పటి ఇంధన సహకారం మరింత పెరుగుతుంది. అదే విధంగా బంగ్లాదేశ్  పురోగతి , మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగ పురోగతి  పెరుగుతుంది.

ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేసినందుకు ప్రధాని మోదీ ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హశీనాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనం కోసం ఇదే విధంగా కలసి పనిచేయాలని ఆకాంక్షించారు. 

 

***



(Release ID: 1908630) Visitor Counter : 160