నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ సిక్కింలో సమావేశం కానుంది

Posted On: 17 MAR 2023 1:51PM by PIB Hyderabad

భారతదేశం  జీ 20 ప్రెసిడెన్సీలో కొత్తగా ఏర్పడిన స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ యొక్క రెండవ సమావేశం 18 - 19 మార్చి 2023న సిక్కింలోని గాంగ్‌టక్‌లో జరుగుతుంది. ఈ సమావేశం G20 సభ్యులు మరియు ఆహ్వానిత దేశాల నుండి ప్రతినిధులను, బహుపాక్షిక సంస్థల ప్రతినిధులు మరియు భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ లబ్దిదారులను ఆహ్వానిస్తుంది. 

 

స్టార్టప్ 20 చైర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ మాట్లాడుతూ, "స్టార్టప్ ప్రపంచాన్ని భారతదేశంలోని నిర్మలమైన ఈశాన్య ప్రాంతానికి తీసుకురావడానికి మరియు దాని ప్రత్యేకమైన మరియు పెరుగుతున్న స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించడానికి సిక్కిం సభ ఒక విశిష్ట అవకాశాన్ని అందిస్తుంది."

 

2023 జనవరి 28 - 29 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన ప్రారంభ సమావేశంలో ఖరారు చేసిన ఎజెండాను హాజరైన ప్రతినిధులందరి మద్దతుతో సిక్కిం సభ ముందుకు తీసుకుపోతుంది. ప్రారంభ సమావేశంలో, స్థాపన మరియు సంబంధాలు, ఫైనాన్స్, మరియు సమ్మిళితం మరియు సుస్థిరత అనే మూడు టాస్క్‌ఫోర్స్‌లకు సంబంధించిన లక్ష్యాలు మరియు ఉత్పాదనలు రూపొందించడానికి ప్రతినిధులందరి నుండి వచ్చిన సూచనలను పొందుపరుస్తారు.

 

స్థాపన మరియు సంబంధాలు (ఫౌండేషన్ మరియు అలయన్స్) టాస్క్‌ఫోర్స్ ఏకాభిప్రాయం ఆధారిత నిర్వచనాల ద్వారా ప్రపంచ స్టార్టప్ వ్యవస్థ ను సమన్వయం చేయడానికి పని చేస్తుంది. ఇది స్టార్టప్‌ల కోసం ప్రపంచ విజ్ఞాన సంచయం /హబ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది జీ 20 దేశాలలో అత్యుత్తమ అభ్యాసాలను ప్రదర్శించడానికి  భాగస్వామ్యం చేస్తుంది. టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వాలు, విధాన రూపకర్తలు, విద్యా- పరిశోధనా సంస్థలు, పరిశ్రమ సంఘాలు మరియు ఎస్ డీ జీ లపై దృష్టి సారించే స్టార్టప్‌లతో సహా అంతర్జాతీయ సంస్థలతో ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక సహకారాన్ని కూడా సృష్టిస్తుంది. చివరగా, ఇది జీ 20 దేశాలలో పనిచేస్తున్న స్టార్టప్‌ల కోసం మార్కెట్‌లను మరియు  ప్రపంచవ్యాప్త ప్రతిభ ప్రాప్యత లభ్యత కోసం వ్యవస్థలను సృష్టిస్తుంది. స్టార్టప్‌లతో కలిసి పనిచేయడానికి పరిశ్రమ  మరియు ప్రభుత్వ సంస్థలకు సహాయక విధానాలను సిఫార్సు చేస్తుంది.

 

స్టార్టప్‌లకు అందుబాటులో ఉన్న ఆర్థిక సాధనాల శ్రేణిని విస్తృతం చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక సహకారం మరియు పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌లను అందించడం ద్వారా స్టార్టప్‌లకు మూలధనానికి ప్రాప్యతను లభ్యత ను పెంచడం ఆర్థిక సహకారం టాస్క్‌ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మూలదనేతర పెట్టుబడి ఆధారిత ఆర్థిక ఉత్పత్తుల ద్వారా సకాలంలో ఖాయిలా మూలధనం  సులభంగా లభ్యం అయ్యేటట్లు  చేస్తుంది . ప్రాధాన్యతా రంగాలకు నిర్దిష్ట మొత్తాన్ని కేటాయిస్తుంది. స్టార్టప్ ఫండింగ్‌లో ప్రభుత్వ పెట్టుబడి ని ప్రోత్సహించడానికి మరియు జీ 20 దేశాల విదేశీ పెట్టుబడిదారుల పర్యావరణ వ్యవస్థతో పరస్పర అనుసంధానం చేయడానికి, పన్ను విధాన రూపకల్పన మరియు స్టార్టప్ ఫండింగ్‌ కు అనుకూల చట్టపరమైన నిబంధనలను  కూడా టాస్క్‌ఫోర్స్  సమన్వయం చేస్తుంది. చివరగా, స్టార్టప్ పెట్టుబడులపై ఉత్తమ విధానాల డాక్యుమెంట్ ద్వారా ప్రపంచ ఇన్వెస్టర్ కమ్యూనిటీతో స్టార్టప్‌ల కోసం నిధుల అభ్యర్థనలు, సామర్థ్య నిర్మాణం మరియు నెట్‌వర్కింగ్ అవకాశాలను ఇది సృష్టిస్తుంది.

మహిళలు, వికలాంగులు, ఎల్‌జిబిటిక్యూ+, మైనారిటీలు, ఇతర సమూహాల నేతృత్వంలోని స్టార్టప్‌లు/పారిశ్రామికవేత్తల నిర్దిష్ట అవసరాలను సమ్మిళితం మరియు సుస్థిరత టాస్క్‌ఫోర్స్ గుర్తిస్తుంది.  మార్కెట్, ఆర్థిక వనరులు, శిక్షణ మరియు ప్రభుత్వ నేతృత్వంలోని సహాయ ప్రోత్సాహ పథకాలలను అందచేయడం ద్వారా వారికి మద్దతు ఇవ్వడం, టెక్నాలజీలు (ఉదా., సహాయక సాంకేతికత.) వెనుకబడిన ప్రపంచాన్ని మరింత కలుపుకొని పోయేందుకు స్టార్టప్‌లను ప్రోత్సహించడం ఈ టాస్క్‌ఫోర్స్ లక్ష్యం.  కేంద్రీకత పెట్టుబడులు, అనువైన వాతారణాన్ని కల్పించడం మరియు మార్గనిర్దేశ సహకారం, పరస్పర మార్కెట్ ప్రవేశం, పర్యవేక్షణ వ్యవస్థ  ఎస్ డీ జీ ల కోసం పనిచేసే స్టార్టప్‌ల ప్రోత్సాహం మొదలైనవాటిలోటాస్క్‌ఫోర్స్ ప్రోత్సహిస్తుంది/మద్దతు ఇస్తుంది. స్టార్టప్‌లు వారి దీర్ఘకాలిక లాభదాయకత కోసం స్థిరమైన వ్యాపార నమూనాలను అనుసరించేలా ప్రోత్సహిస్తుంది.

 

సిక్కిం సభలో, స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌లోని టాస్క్‌ఫోర్స్ సభ్యులు (జీ 20 దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడినది) అధికారిక విధాన ప్రకటన యొక్క మొదటి ముసాయిదాపై  చర్చిస్తారు. ఈవెంట్ లో వివిధ అంశాలు  స్టార్టప్20ఎక్స్, ఎంజి మార్గ్‌లో స్టార్టప్‌ల ప్రదర్శన మరియు ప్రతినిధులు రుమ్‌టెక్ మొనాస్టరీ  సందర్శన వంటి  ఈవెంట్‌లు కార్యక్రమాలు కూడా జరిగాయి.

 

విధాన ప్రకటన యొక్క మొదటి ముసాయిదా రాబోయే నెలల్లో రూపొందించబడుతుంది  తిరిగి చర్చించబడుతుంది. స్టార్టప్ 20 లో భాగంగా జరిగే ఇతర మధ్యవర్తిత్వ ఈవెంట్‌లు, స్టార్టప్ 20 యొక్క ఆశించిన ఫలితాలు అధికారిక పాలసీ కమ్యూనిక్, సాధారణంగా అంగీకరించబడిన నిర్వచనాలు మరియు పరిభాషల పదకోశం సెట్ తో కూడిన స్టార్టప్ హ్యాండ్‌బుక్, సరిహద్దులఅవల అంతటా సహకారాన్ని పెంపొందించడానికి గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ మరియు స్టార్టప్ ప్రపంచ పర్యావరణ వ్యవస్థల కోసం ప్రపంచ సమన్వయ కేంద్రం ఏర్పాటు చేయడం వంటివి స్టార్టప్ 20 కార్యకలాపాలు.

***


(Release ID: 1908281) Visitor Counter : 173