ప్రధాన మంత్రి కార్యాలయం

పిఎమ్ మిత్ర మెగా టెక్స్  టైల్  పార్కులు ‘మేక్ ఇన్ ఇండియా’ కు మరియు ‘మేక్ఫార్ ద వరల్డ్’ కు ఒక గొప్ప ఉదాహరణ అవుతాయి: ప్రధాన మంత్రి 

Posted On: 17 MAR 2023 2:30PM by PIB Hyderabad

పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కుల ను తమిళ నాడు లో, తెలంగాణ లో, కర్నాటక లో, మహారాష్ట్ర లో, గుజరాత్ లో, మధ్య ప్రదేశ్ లో మరియు ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అవి 5ఎఫ్ (ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాశన్ టు ఫారిన్) దృష్టికోణాని కి అనుగుణం గా వస్త్రాల రంగాని కి ప్రోత్సాహాన్ని ఇస్తాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కులు వస్త్ర రంగాని కి అత్యాధునిక మౌలిక సదుపాయాల ను సమకూర్చి, కోట్ల కొద్దీ రూపాయల పెట్టుబడి ని ఆకట్టుకోవడం తో పాటు లక్షల కొద్దీ ఉద్యోగాల ను కూడా కల్పిస్తాయి అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు 5ఎఫ్ (ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాశన్ టు ఫారిన్) దృష్టికోణాని కి అనుగుణం గా వస్త్ర రంగాని కి దన్ను గా నిలబడతాయి. తమిళ నాడు లో, తెలంగాణ లో, కర్నాటక లో, మహారాష్ట్ర లో, గుజరాత్ లో, మధ్య ప్రదేశ్ లో మరియు ఉత్తర్ ప్రదేశ్ లో పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని వెల్లడించడానికి సంతోషిస్తున్నాను.’’

 

‘‘పిఎమ్ మిత్ర మెగా టెక్స్ టైల్ పార్కు లు వస్త్ర రంగాని కి అత్యాధునికమైనటువంటి మౌలిక సదుపాయాల ను అందిస్తాయి; కోట్ల కొద్దీ రూపాయల విలువైన పెట్టుబడి ని ఆకర్షిస్తాయి. దానితో పాటు లక్షల కొద్దీ కొలువుల ను సృష్టిస్తాయి. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కు మరియు ‘మేక్ ఫార్ ద వరల్డ్’ కు ఒక గొప్ప ఉదాహరణ అవుతుంది. #PragatiKaPMMitra’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS

 



(Release ID: 1908005) Visitor Counter : 148