ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం లో నౌకాశ్రయాల రంగం శర వేగం గా వృద్ధి చెందడం తో పాటు ఆర్థిక ప్రగతి కి తోడ్పడుతున్నది: ప్రధాన మంత్రి
Posted On:
16 MAR 2023 2:56PM by PIB Hyderabad
ట్యూటికోరిన్ విఒసి నౌకాశ్రయం అంతక్రితం సంవత్సరం తో పోలిస్తే 11.35 శాతం వార్షిక వృద్ధి ని సాధించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ నౌకాశ్రయం ఈ సంవత్సరం లో మార్చి నెల 14వ తేదీ నాటి కి 36.03 మిలియన్ టన్నుల ఓడ రవాణా సంబంధి సరకు ను సంబాళించడం తో పాటు గా నౌకాయాన మంత్రిత్వ శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరాని కి గాను నిర్ధేశించిన 36 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్ణయించిన గడువు కు 17 రోజుల ముందే అధిగమించింది.
వి.ఒ. చిదంబరనార్ పోర్ట్ ఆథారిటి, ట్యూటికోరిన్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -
‘‘మంచిది. భారతదేశం యొక్క నౌకాశ్రయాల రంగం శరవేగం గా వృద్ధి చెందుతున్నది మరి ఆర్థిక ప్రగతి కి తోడ్పాటు ను కూడా అందిస్తోంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1907616)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam