హోం మంత్రిత్వ శాఖ

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌, ది ఎలిఫెంట్ విస్పరర్స్‌ బృందాలకు అభినందనలు తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా


ఆస్కార్ గెలుచుకోవడం ద్వారా నాటు-నాటు పాట చరిత్ర సృష్టించింది, భారతీయ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయి వంటి రోజు, భారతీయులతో పాటు ప్రపంచ సంగీత ప్రియులపై పెదవులపై ఈ పాట నాట్యమాడింది, ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి అభినందనలు

ఏనుగులను రక్షించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం తెరపై ఆవిష్కరించింది, ఈ అవార్డు భారతీయ చలనచిత్ర పరిశ్రమ సామర్థ్యాన్ని ఎలుగెత్తి చాటింది, యువ చిత్ర నిర్మాతలకు స్ఫూర్తినిస్తుంది

Posted On: 13 MAR 2023 1:03PM by PIB Hyderabad

ఆర్‌ఆర్‌ఆర్‌ 'నాటు నాటు' పాట, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' లఘుచిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు గెలుచుకోవడంపై అభినందిస్తూ హోం మంత్రి శ్రీ అమిత్ షా ట్వీట్‌ చేశారు.

“ఆస్కార్ గెలుచుకోవడం ద్వారా నాటు-నాటు పాట చరిత్ర సృష్టించింది., భారతీయ సినిమా చరిత్రలో ఇదొక మైలురాయి వంటి రోజు. భారతీయులతో పాటు ప్రపంచ సంగీత ప్రియులపై పెదవులపై ఈ పాట నాట్యమాడింది. ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి @ssrajamouli @mmkeeravaani @boselyricist @tarak9999 @AlwaysRamCharanకు అభినందనలు" అని తన ట్వీట్‌లో అమిత్‌ షా పేర్కొన్నారు.

“ఉత్తమ లఘుచిత్రం విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ గెలుచుకున్నందుకు @EarthSpectrum, @guneetmకు అభినందనలు. ఏనుగులను రక్షించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం తెరపై ఆవిష్కరించింది, ఈ అవార్డు భారతీయ చలనచిత్ర పరిశ్రమ సామర్థ్యాన్ని ఎలుగెత్తి చాటింది, యువ చిత్ర నిర్మాతలకు స్ఫూర్తినిస్తుంది" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

*****

RK/AY/AKS



(Release ID: 1906457) Visitor Counter : 181