ప్రధాన మంత్రి కార్యాలయం

టెక్నాలజీ అందరి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ పౌరులను సాధికారం చేస్తోంది : పిఎం

Posted On: 06 MAR 2023 8:09PM by PIB Hyderabad

టెక్నాలజీ అందరి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ పౌరులను సాధికారం చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు అరుణాచల్  ప్రదేశ్  లో మొబైల్ సర్వీస్ లు అందించే ఒకే  ఒక్క ఆపరేటర్ ఉండే వారు. ఇప్పుడు వారి సంఖ్య 3కి చేరిందంటూ  రాజ్యసభ ఎంపి శ్రీ నబం రెబియా చేసిన ట్వీట్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

గతంలో ఈ గ్రామంలో వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే వైద్యుని చేరడానికి లేదా వైద్యుని తీసుకురావడానికి  ప్రజలు రోడ్డు మార్గంలో ఇటానగర్ కు ప్రయాణం చేయాల్సివచ్చేది. అందుకు మూడు రోజులు పట్టేది. నేడు వీడియో కాల్ ద్వారా ప్రజలు వైద్యుని సంప్రదించగలుగుతున్నారు. కేవలం 30 నిముషాల కన్నా తక్కువ సమయంలోనే డాక్టర్ వారికి సరైన చికిత్స తెలియచేయగలుగుతున్నారు. అరుణాచల్  ప్రదేశ్ లోని ప్రజలకు ఇ-సంజీవని ఒక వరంగా నిలుస్తోంది అని శ్రీ రెబియా తన ట్వీట్లలో తెలిపారు.

ఎంపి ట్వీట్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ ‘‘టెక్నాలజీ ప్రజల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ, పౌరులను సాధికారం చేస్తోంది’’ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.



(Release ID: 1904797) Visitor Counter : 124