హోం మంత్రిత్వ శాఖ
న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో 2023 మార్చి 10న విపత్తు ప్రమాద తీవ్రత తగ్గించడానికి ఏర్పాటైన జాతీయ వేదిక (ఎన్పిడిఆర్ఆర్) మూడవ సమావేశాలు ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 10 సూత్రాలకు అనుగుణంగా స్థానికంగా సౌకర్యాలు కల్పించి సంసిద్ధత సాధించడం ప్రధాన లక్ష్యంగా సమావేశాల నిర్వహణ
కేంద్ర హోం మంత్రి ,సహకార మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఒక బహుళ-భాగస్వాముల జాతీయ వేదికగా పనిచేస్తున్నఎన్పిడిఆర్ఆర్
విపత్తు ప్రమాద తీవ్రత తగ్గించడానికి అమలు చేయాల్సిన చర్యలు, విధానాలు రూపొందిస్తున్న ఎన్పిడిఆర్ఆర్
ప్రారంభోత్సవం తర్వాత శ్రీ అమిత్ షా అధ్యక్షతన మంత్రుల స్థాయి సమావేశం
వివిధ స్థాయిల్లో విపత్తు ప్రమాద తీవ్రత తగ్గించే వ్యవస్థలను మరింత బలోపేతం చేసే అంశంపై చర్చించనున్న కేంద్ర , రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు
రెండు రోజుల పాటు జరిగే సమావేశంలో సెండై వ్యవస్థ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 10 సూత్రాల విధానంపై చర్చించనున్న నిపుణులు, విద్యావేత్తలు, ప్రతినిధులు
అమృత కాలంలో జరుగుతున్న సమావేశంలో జరిగే చర్చలు, తీర్మానాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్-2047 కింద 2030 నాటికి భారతదేశం స్వావలంబ
Posted On:
06 MAR 2023 3:54PM by PIB Hyderabad
న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో 2023 మార్చి 10న విపత్తు ప్రమాద తీవ్రత తగ్గించడానికి ఏర్పాటైన జాతీయ వేదిక (ఎన్ పిడి ఆర్ఆర్) మూడవ సమావేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న ప్రమాదాల తీవ్రత తగ్గించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 10 సూత్రాలకు అనుగుణంగా స్థానికంగా సౌకర్యాలు కల్పించి సంసిద్ధత సాధించడం ప్రధాన లక్ష్యంగా సమావేశాలు జరగనున్నాయి.
ఎన్పీడీఆర్ఆర్ సదస్సుకు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల విపత్తు నిర్వహణ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థల అధిపతులు, విద్యావేత్తలు, ప్రైవేటు రంగ సంస్థల ప్రతినిధులు, మీడియా, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు సహా 1000 మందికి పైగా విశిష్ట అతిథులు హాజరుకానున్నారు.
హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఎన్పిడిఆర్ఆర్ బహుళ-భాగస్వాముల జాతీయ వేదికగా పనిచేస్తోంది. విపత్తుల వల్ల జరిగే ప్రమాద తీవ్రత తగ్గించడానికి అమలు చేయాల్సిన చర్యలపై ఎన్పిడిఆర్ఆర్ సభ్యులు చర్చించి అనుభవాలు, అభిప్రాయాలు ఆలోచనలు పంచుకుంటారు. విపత్తు ప్రమాద తగ్గింపు (డిఆర్ఆర్) లో తాజా పరిణామాలు, ధోరణులను చర్చించి వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి, విపత్తు ప్రమాద తగ్గింపు ప్రయత్నాలను మరింత వేగవంతం చేయడానికి ప్రణాళిక రూపొందిస్తారు. . మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణ, గ్రామీణ స్థానిక-స్వపరిపాలన సంస్థలు, విద్యా సంస్థలు, ఎన్జిఓలు, సిఎస్ఓలు, పిఎస్యులు, ప్రజల సహకారంతో విపత్తు నిర్వహణ పద్ధతులను మరింత పటిష్టంగా అమలు చేయడానికి ఎన్పిడిఆర్ఆర్ సమావేశం ఉపయోగపడుతుంది.
హోం మంత్రిత్వ శాఖ , నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డిఆర్ఎఫ్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడిఎమ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎన్పిడిఆర్ఆర్ లో నాలుగు ప్రధాన సదస్సులు, మంత్రుల స్థాయి సమావేశం, 8 అంశాలపై విడివిడిగా సమావేశాలు జరుగుతాయి.
ప్రారంభోత్సవం తర్వాత కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ప్రత్యేక మంత్రుల స్థాయి సమావేశం జరుగుతుంది, ఈ సమావేశంలో వివిధ స్థాయిల్లో విపత్తు ప్రమాదాన్ని తగ్గించే వ్యవస్థలను మరింత బలోపేతం చేసే అంశంపై కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు చర్చిస్తారు. నిపుణులు, ప్రాక్టీషనర్లు, విద్యావేత్తలు, ప్రతినిధులు సెండాయ్ ఫ్రేమ్ వర్క్ ఆధారంగా విపత్తు ప్రమాద తీవ్రత తగ్గించడానికి సహకరించే వివిధ అంశాలు, విపత్తు తీవ్రత తగ్గించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన 10 అంశాల ఎజెండాపై చర్చలు జరుగుతాయి.
ఈ కార్యక్రమానికి ముందు గత రెండు నెలల్లో దేశవ్యాప్తంగా 12 కు పైగా నగరాల్లో విపత్తు ప్రమాద నిర్వహణ (వడగాలులు, తీరప్రాంత ప్రమాదాలు, విపత్తు ప్రమాద నిర్వహణ లో మహిళల నాయకత్వాన్ని పెంచడం వంటి అంశాలు) కు సంబంధించిన వివిధ నిర్దిష్ట అంశాలపై 19 కార్యక్రమాలు జరిగాయి. ఈ 19 కార్యక్రమాల్లో అమలు చేసిన కార్యక్రమాలు, సిఫార్సులు 2023 మార్చి 10-11 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఎన్పీడీఆర్ఆర్ 3వ సమావేశంలో చర్చకు వస్తాయి. ఉంటాయి. 2013, 2017 లో ఎన్పీడీఆర్ఆర్ మొదటి, రెండు సమావేశాలు జరిగాయి. అమృత్ కాలంలో జరుగుతున్న ఈ సమావేశం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్-2047 కింద 2030 నాటికి భారతదేశం స్వావలంబన సాధించడానికి ఎన్పిడిఆర్ఆర్ సమావేశం ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది.
***
(Release ID: 1904721)
Visitor Counter : 198