ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పాటియాలాలో నీట్ పీజీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి నీట్ పీజీ పరీక్షల నిర్వహణను పరిశీలించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పరీక్ష నిర్వహణకు చేసిన ఏర్పాట్లు పరిశీలించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన డాక్టర్ మాండవీయ
నీట్ పీజీ 2023 ని 277 నగరాల్లోని 902 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించిన ఎన్బీఈఎంఎస్
పరీక్షకు హాజరైన 2,08,898 మంది అభ్యర్థులు
Posted On:
05 MAR 2023 12:49PM by PIB Hyderabad
పాటియాలాలోని నీట్ పీజీ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు , పరీక్షల నిర్వహణను సమీక్షించారు. అభ్యర్థుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ( ఎన్బీఈఎంఎస్) పరీక్ష జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి సందర్శించడం ఇదే తొలిసారి.
నీట్ పీజీ పరీక్షలకు హాజరైన విద్యార్థులను అభినందించిన కేంద్ర ఆరోగ్య మంత్రి పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. “నేను పాటియాలా పరీక్షా కేంద్రాన్ని సందర్శించినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో సంభాషించే అవకాశం నాకు లభించింది. ఈ రోజు పరీక్షకు హాజరవుతున్న వారందరికీ నా శుభాకాంక్షలు”. అని డాక్టర్ మాండవీయ అన్నారు.



కంప్యూటర్ ఆధారిత విధానంలో నీట్ పీజీ 2023 ని 277 నగరాల్లోని 902 పరీక్షా కేంద్రాలలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ( ఎన్బీఈఎంఎస్) నిర్వహించింది. 2,08,898 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులు అక్రమాలకు పాల్పడకుండా సక్రమంగా పరీక్ష రాసేలా చూసేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పటిష్ట చర్యలు అమలు చేసింది. జీరో టాలరెన్స్ విధానంలో భాగంగా బయోమెట్రిక్ తనిఖీ, సీసీటీవీ నిఘా, దస్త్రాల పరిశీలన, మొబైల్ ఫోన్ జామర్‌లు లాంటి చర్యలు అమలు చేసిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కటినమైన నిఘా ఏర్పాటు చేసింది.
అహ్మదాబాద్‌లోని కమాండ్ సెంటర్ సెటప్ నుంచి నీట్ పరీక్షా నిర్వహణను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రెసిడెంట్ డాక్టర్. అభిజత్ షేత్ పరిశీలించారు. . 90 మంది సభ్యులతో కూడిన బృందం వివిధ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ బృందంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పాలకమండలి సభ్యులు, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అధికారులు,టిసిఎస్ ప్రతినిధులు ఉన్నారు.
నీట్ పీజీ పరీక్షలు జరుగుతున్న తీరు పర్యవేక్షించడానికి, పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ద్వారకా కార్యాలయంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో పరీక్షలు సక్రమంగా జరిగేలా చూసేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ పటిష్ట చర్యలు అమలు చేసింది. కమాండ్ సెంటర్‌కు వివిధ పరీక్షా కేంద్రాల నుంచి ప్రత్యక్ష ఫీడ్‌లు కూడా అందుతున్నాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లో భాగంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ద్వారకా కార్యాలయంలో పోలీస్ చెక్ పోస్ట్, వైద్య సహాయ గదిని కూడా ఏర్పాటు చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 10 మంది సభ్యులతో టిసిఎస్ ముంబైలో ఒక నిఘా కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నీట్ పీజీ పరీక్ష ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని పాట్నాలో ప్రత్యేక భద్రతా కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయబడింది. ప్రాంతీయ కమాండ్ కేంద్రాలు కూడా ఏర్పాటు అయ్యాయి. పరీక్ష సకాలంలో ప్రారంభమై నిర్ణీత సమయానికి ముగిసేలా చేయడానికి అన్ని చర్యలు అమలు జరిగాయి. ముగుస్తుందని నిర్ధారించుకోవడానికి కార్యాచరణ పారామితులను పర్యవేక్షించడానికి TCS iON పరీక్ష నిర్వహణను పర్యవేక్షించింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ లో ఏర్పాటు చేసిన కమాండ్ సెంటర్‌లో 25 మంది టిసిఎస్ బృందం సభ్యులు కూడా ఉన్నారు. పరీక్ష కేంద్రాలను లైవ్ సీసీటీవీల ద్వారా పర్యవేక్షించారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రత, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం అందించారు. నీట్ పీజీ ఈరోజు ఉదయం 09:00 గంటలకు 896 కేంద్రాలలో విజయవంతంగా ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగిసింది.
***
(Release ID: 1904388)
Visitor Counter : 191