ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ న్యూ ఢిల్లీలో భారీ ఆరోగ్యానికి నడక కార్యక్రమాన్ని నిర్వహించింది.


దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ‘ఆరోగ్యకరమైన మహిళలు ఆరోగ్యకరమైన దేశం ’ అనే థీమ్‌తో సైక్లాథాన్ నిర్వహిస్తున్నారు.

శారీరక శ్రమ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అంటురోగాలు కాని జబ్బులు (NCDs) యొక్క తీవ్రత తక్కువ చేయటం మాత్రమే కాకుండా మానసిక శ్రేయస్సుపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి

"స్వస్థ మనస్సు, స్వస్థ గృహం"లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనం గురించి అవగాహనను ప్రోత్సహించడం మరియు పెంపొందించడం లక్ష్యంగా ఏడాది పొడవునా ప్రచారం

Posted On: 05 MAR 2023 9:47AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియూ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలో భారీ ఆరోగ్యానికి నడక కార్యక్రమాన్ని  నిర్వహించింది. ఉత్సాహంగా పాల్గొనేవారు మెరుగైన ఆరోగ్యం కోసం నడక కార్యక్రమం లో గొప్ప ఉత్సాహంతో మరియు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు.

గౌరవ ప్రధానమంత్రి ఆరోగ్య భారతదేశం కోసం అనే దృష్టిని అనుసరించి, వాక్‌థాన్ మరియు ఇలాంటి ఈవెంట్‌లు పౌరులలో ఆరోగ్యకర ప్రవర్తనా మార్పులను తీసుకురావడానికి మరియు మరింత శారీరకంగా చురుకైన జీవనశైలి గురించి అవగాహన కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. అటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, సైకిల్ తొక్కడం పట్ల తనకున్న ఉత్సాహంతో "గ్రీన్ ఎంపీ"గా కూడా పిలువబడే కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్ కోసం శారీరక శ్రమను ప్రోత్సహిస్తున్నారు. దేశంలో 63% కంటే ఎక్కువ మరణాలకు అంటురోగాలు కాని జబ్బులు (NCDలు) కారణమవుతున్నాయి. పొగాకు వాడకం (ధూమపానం & పొగ రహితం), మద్యపానంఅలవాట్లు, సరైన ఆహారం తీసుకోకపోవడం , తగినంత శారీరక శ్రమ లేకపోవడం మరియు వాయు కాలుష్యం వంటి ప్రధాన ప్రవర్తన ప్రమాద కారకాలతో ఎక్కువ మరణాలకు కారణమవుతాయి. 

 

అంటురోగాలు కాని జబ్బులకు శారీరక బద్దకం (నిష్క్రియాత్మకత) ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. నేషనల్ ఎన్‌సిడి మానిటరింగ్ సర్వే (ఎన్‌ఎన్‌ఎంఎస్) (2017-18)లో కూడా 41.3% భారతీయులు శారీరకంగా నిష్క్రియంగా నిశ్చలంగా ఉన్నారని కూడా ఇది ప్రతిబింబిస్తుంది. శారీరక శ్రమ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు హృదయ సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైన అంటురోగాలు కాని జబ్బులను తగ్గించటం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి, చిత్తవైకల్యం యొక్క ఆగమనాన్ని ఆలస్యం చేస్తాయి మరియు ఆరోగ్య శ్రేయస్సును కూడా ప్రోత్సహిస్తాయి.

 

ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, శారీరక మరియు మానసిక శ్రేయస్సు మరియు పర్యావరణ అనుకూలమైన రవాణాను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా జిల్లా ప్రధాన కార్యాలయంలో 5 మార్చి 2023న సైక్లింగ్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ‘ఆరోగ్యకరమైన మహిళలు ఆరోగ్య భారతదేశం’ అనే థీమ్‌తో సైక్లాథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

ఈ సైక్లాథాన్‌లో సామాన్య ప్రజలు పాల్గొనేలా జిల్లా వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. కార్యక్రమ  థీమ్ అభివర్ణించినట్లుగా, మహిళల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యవంతమైన స్త్రీలు తమ కుటుంబంలో మాత్రమే కాకుండా సమాజంలో కూడా తమ వంతు సహకారం అందించి చివరకు భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా మార్చుతారు.

 

అయితే, జిల్లా కేంద్రంలో సైక్లింగ్ ఈవెంట్‌కు అనుబంధంగా, శారీరక దృఢత్వం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఢిల్లీలో "ఆరోగ్యం కోసం నడక" అనే మరో కార్యక్రమం కూడా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం విజయ్ చౌక్ నుండి కర్తవ్య మార్గ్ మీదుగా ప్రారంభమై ఇండియా గేట్ మీదుగా నిర్మాణ్ భవన్ చేరుకుంది.

 

అంతకుముందు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఫిబ్రవరి 2023 నెలలో, 'స్వస్థ మనస్సు, సవస్థ గృహం' అనే థీమ్‌తో అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న 1.5 లక్షల ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో (AB-HWC) ఇలాంటి సైక్లింగ్ ఈవెంట్ నిర్వహించబడింది. 

 

శ్రీ విశాల్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా (RML) హాస్పిటల్ మరియు లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ వంటి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, నర్సులు మరియు సిబ్బంది కూడా వాకథాన్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు మరియు రక్త పోటు, మధుమేహం, మానసిక అనారోగ్యం మరియు క్యాన్సర్ వంటి జీవనశైలి ఆరోగ్య సంబంధిత సమస్యలు/వ్యాధులను నివారించడానికి మరియు నియంత్రించడానికి ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనాన్ని అలవర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

***


(Release ID: 1904340) Visitor Counter : 250