ఆయుష్

సంప్రదాయ వైద్యంపై ఎస్.సి.ఒ తొలి అంతర్జాతీయ సదస్సు ఎక్స్పో ను ప్రారంభించిన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శర్వానంద్ సోనోవాల్


ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ వైద్య అంతర్జాతీయ ఆరోగ్య కేంద్రం , విద్య, సంప్రదాయ వైద్యాన్ని ఆయా దేశాలలో బలోపేతం చేసేందుకు

అందుకు అనుగుణంగా సభ్యదేశాలు తగిన చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది: శ్రీ శర్వానంద్ సోనోవాల్

Posted On: 02 MAR 2023 2:55PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ , పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ శర్వానంద్ సోనోవాల్ ,షాంఘై సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి బి2బి అంతర్జాతీయ సదస్సు
అండ్ ఎక్స్పోను గౌహతిలో ఈ రోజు ప్రారంభించారు. 150 మందికి పైగా ప్రతినిథులు 17 ఎస్ సిఒ దేశాల నుంచి ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో నాలుగు దేశాలు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నాయి.
నాలుగురోజులపాటు సంప్రదాయ వైద్యంపై సాగే ఎక్స్ పో ను కూడా సోనోవాల్ ఇదే ప్రాంగణంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర మంత్రి,  “ఇండియా అందుబాటులో ఉన్న సహజవనరులను ఆయుర్వేదం , ఇతర సంప్రదాయ విధానాల ద్వారా  సద్వినియోగం చేసుకుంటూ,
ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్నదని, అలాగే అందరికీ ఆరోగ్య సేవలు అందించే లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నదని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన అంతర్జాతీయ సంప్రదాయ వైద్య విధాన కేంద్రాన్ని భారతదేశ సహకారంతో జామ్ నగర్లో ఏర్పాటు
చేస్తున్నారని, ఇది ఆయా దేశాలలో సంప్రదాయ వైద్య విధానాలను , వైద్య విద్యను బలోపేతం చేసేందుకు ఉపకరిస్తుందని తెలిపారు.


ఈ ప్రారంభ సమావేశానికి కేంద్ర ఆయుష్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర భాయ్ ముంజ్పారా హాజరయ్యారు.
మయన్మార్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ థెట్ ఖైంగ్ విన్, మాల్దీవుల ఆరోగ్య శాఖ ఉపమంత్రి  సఫియా మహ్మద్ సయీద్,
ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయుష్, మహిళా , శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర భాయ్
ముంజపారా మాట్లాడుతూ,
 ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ద, సోవా–రిగ్పా, హోమియోపతి (ఆయుష్) కి సంబంధించి నాణ్యమైన విద్యను , వైద్య విధానాలను అందించేందుకు ఇండియా గట్టి కృషిపెడుతోందని చెప్పారు.
ఆయుర్వేద ఉత్పత్తుల నాణ్యతా పరిరక్షణకు అక్రిడిటేషన్ యంత్రాంగాలు, రెగ్యులేటరీ ప్రొవిజన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సమీకృత వైద్య విధానాన్ని దేశంలో అభివృద్ధి చేసేందుకు, సంప్రదాయ వైద్య విధానాలను, పాశ్చాత్య వైద్యంతో అనుసంధానం చేసేందుకు
ఈ విషయంలో తగిన శిక్షణ, పరిశోధన, రక్షణ కు వీలు కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.


మయన్మార్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ థెట్ ఖైంగ్ విన్ మాట్లాడుతూ, “మయన్మార్ లో సంప్రదాయ వైద్యాన్ని వెలకట్టలేని విలువైన జాతీయ సంపదగా
గుర్తించి పెద్దపీట వేస్తున్నాం. ఇది మా సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తున్నది. సంప్రదాయ వైద్యానికి డిమాండ్  పెరుగుతుండడంతో
సంప్రదాయ వైద్యం అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తున్నాం”అని ఆయన అన్నారు.
మాల్దీవుల  ఆరోగ్య శాఖ ఉపమంత్రి సఫియా మహ్మద్ సయీద్ సంప్రదాయ వైద్యం గురించి మాట్లాడుతూ,ఈ వైద్యం
లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నదని ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలలో  గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నదని చెప్పారు.
ఈ పరిశ్రమకు సహాయపడేందుకు తగిన మార్గదర్శకాలు, చట్టపరమైన ఫ్రేమ్వర్క్ కు సంబంధించి మెరుగైన విధానాల అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు.
ఇండియాతోపాటు 17 దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రతినిధులు , ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఇందులో ఉన్నతస్థాయి
ప్రతినిధులైన ఆరోగ్య మంత్రులు, అధికారిక ప్రతినిధులు, విదేశీ కొనుగోలుదారులు, ఎస్.సి.ఓ నుంచి , భాగస్వామ్య దేశాలనుంచి ఇందులో పాల్గొన్నారు
 75 మంది విదేశీ అధికారులు, 13 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు నేరుగా ఈ సమావేశాలలో పాల్గొంటున్నారు.  చైనా , ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, కజకస్థాన్ దేశాల అధికార ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో ఎస్.సి.ఒ దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు సంప్రదాయ వైద్య ఉత్పత్తులకు సంబంధించి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్,  ఫార్మకోపియా, నాణ్యతా ప్రమాణాలు, పరిశోదన
వనమూలికల నుంచి తీసే పదార్ధాలు, న్యూట్రాసిటికల్స్ తదితరాల పై చర్చిస్తారు. ఇందులో తయారీదారులు,సరఫరాదారులు, ప్రభుత్వ సంస్థలు,సంప్రదాయ వైద్యాన్ని పెంపొందించేందుకు
తీసుకుంటున్న చర్యలపై తమ ప్రజంటేషన్లు ఇస్తారు. మీ కొనుగోలుదారును తెలుసుకోండి అనే సెషన్లు అలాగే బి 2 బి సమావేశాలు జరుగుతాయి. ఇవి ఆయా ఉత్పత్తుల వారీగా,
ఎగుమతులు, దిగుమతులు వారీగా గల అవకాశాలపై జరుగుతాయి. ఆర్ధిక భాగస్వామ్యం, మార్కెట్ అందుబాటును పెంపొందించుకోవడం వంటి వాటిని కూడా చర్చిస్తారు.

నాలుగురోజులపాటు సంప్రదాయ వైద్యంపై జరిగే ఎక్స్పోను కూడా ప్రారంభించారు. ఆయుష్ పరిశ్రమ, దానితోపాటు విదేశీ సంప్రదాయ వైద్య పరిశ్రమ, ఎగుమతులు,దిగుమతులు,
ఆయా ఉత్పత్తులు , సేవలకు సంబంధించిన అంశాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంటాయి. ఈ ఎక్స్పో సంప్రదాయ వైద్యంలో వాణిజ్య అవకాశాలను పెంపొందింపచేయడానికి ఉద్దేశించినది. ఆయుష్ మంత్రిత్వశాఖ
కౌన్సిళ్లు తాము సాధించిన విజయాలకు సంబంధించి పెవిలియన్ లో స్టాల్స్ను ఏర్పాటు చేశాయి.

 

***



(Release ID: 1904139) Visitor Counter : 160