ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మేఘాలయలో ప్రతి ఓటరుకూ చేరువయ్యే దిశగా ‘ఇసిఐ’ కృషికి ప్ర‌ధానమంత్రి ప్రశంస

Posted On: 26 FEB 2023 11:07AM by PIB Hyderabad

   మేఘాల‌య‌లో అర్హులైన ప్ర‌తి ఓట‌రు సులువుగా ఓటు వేయ‌గ‌లిగేలా భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) చేసిన వినూత్న కృషిలో పాలుపంచుకున్న వార‌ందరినీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. కాగా, మేఘాలయలోని 59 శాసనసభ స్థానాల్లో విధి నిర్వహణ కోసం 974 బృందాలను ‘ఇసిఐ’ నియమించింది.

   ఈ నేపథ్యంలో ఆయా బృందాలు గంటల తరబడి శ్రమించి సంక్లిష్ట ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. ఇందులో భాగంగా కేవలం 35 మంది ఓటర్లు మాత్రమేగల దుర్గమ ప్రాంతం కమ్సింగ్ పోలింగ్ కేంద్రానికి కూడా వారు చేరుకున్నారు. ఆ విధంగా ప్రతి ఓటరు తమ హక్కును కోల్పోకుండా చూడటం కోసం పోలింగ్ సామగ్రి రవాణాకు సంప్రదాయ ఖాసీ బుట్టలను ఉపయోగించారు.

దీనిపై మేఘాలయ పీఐబీ విభాగం ట్వీట్‌కు ప్రతిస్పందనగా ప్రధానమంత్రి చేసిన ట్వీట్‌లో:

“అర్హతగల ప్రతి ఓటరు సులువగా ఓటు వేయగలిగేలా భరోసా ఇవ్వడంలో ‘ఇసిఐ’ చేసిన వినూత్న కృషికి ఇది మరొక నిదర్శనం. ఈ పోలింగ్‌ బృందాల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ  అభినందనలు. ఓటర్లు రికార్డు స్థాయిలో తమ హక్కు వినియోగించుకునేలా, మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేలా స్ఫూర్తినివ్వాలి” అని అందులో ఆకాంక్షించారు.

*****

DS/ST


(Release ID: 1902541) Visitor Counter : 183